Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
harmful food items for brain

ఈ సంచికలో >> శీర్షికలు >>

జంబీర వృక్షం - నిమ్మచెట్టు . - హైమాశ్రీనివాస్.

lemon tree information

"అమ్మా ! ఈరోజు లంచ్ బాక్స్ లోకి నిమ్మకాయ పులిహోర చేయవే! మా కోలిగ్సంతా మీ అమ్మచేసిన’ నిమ్మపులిహోర’  చాలా బావుంటుందని తెగ మురుస్తున్నారు.. మరో పెద్ద డబ్బానిండా పెట్టివ్వవూ ప్లీజ్   "అంది  నిర్మల.

" అమ్మోయ్ ! ఎండ మండుతున్నదే ఈరోజు నాకు వాటర్ బాటిల్లో నిమ్మరస్మ పోసివ్వు."నీరజ్ అమ్మను అడిగాడు.

"అమ్మాయ్! కాస్తంత నిమ్మ కారం చేయరాదూ ! నోటికి రుచిగా ఉంటుంది.." అంది అత్తమ్మ అనంతమ్మ.

" చూడూ సుగుణా! ఉప్మాలో మరి కాస్తంత నిమ్మరసం  పిండవూ!" భర్త భాస్కరం  అర్ధింపు.

" అత్తా! ఒక్కనిమ్మకాయుంటే అడిగి రమ్మంది అమ్మ" పక్కింటి పాపాయ్ పిలుపు. వాళ్ళపెరట్లో నిమ్మచెట్టు అందరి కోరికలూ తీరుస్తున్నది.’ నిమ్మ చేసిన మేలు అమ్మైనా చేయద ‘నే నానుడి. నిమ్మలో దాగు న్న వైద్య విలువలూ,ఆరోగ్యా సూత్రాలు అంత గొప్ప వన్నమాట. వంట గదిలో నిమ్మకు ‘ పెద్దపీటే! ‘ నిమ్మ కిచెన్లో ఉంటే నిమ్మ ళంగా ఏదైనా చేసేయొచ్చు, కూరల్లేవని బాధ పడక్కర్లేదు. నిమ్మకారం, నిమ్మకాయ చారు, నిమ్మపిండిన పప్పూ, నిమ్మకాయ పులిహోరా , నిమ్మ మజ్జిగా చాలు ఎన్ని కడుపులైనా ఇట్టే నింపేస్తాయి .ఎటోచ్చీ నంజుడుకు కాసిన్ని వడి యాలు, చేయితడిసే నెయ్యీ ఉంటే చాలు.

నిమ్మను ' లెమన్ ' లైం ' అని ఆంగ్లలోనూ ,లాటిన్  లో సిట్రస్ లిమోన్  అనీ సంస్కృతంలో నింబుఫలం అనీ , ' స్వల్ప జంబిరికా 'అనీ కూడా అంటారు.

నిమ్మ పండులో విటమిన్ 'సి 'కావల్సినంత  ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమపండు విలువ వీటిలోని నిమ్మరసాన్ని బట్టి ఉంటుంది.  ఎక్కువ రసం లభించే నిమ్మపండ్ల కు రేటు ఎక్కువగా పలుకుతుంది  .  నిమ్మ  చిన్నపాటి చెట్టు. దీని కొమ్మలు తేలికగా , గుత్తంగా వుంటాయి. వీటికి పదునైన ముళ్ళు  రక్షణ కవచం లా కాపాడు తాయి.  పూలు గుత్తులు గుత్తులుగా తెల్లగా ఉంటాయి.

నిమ్మ మొదటగా మనదేశంలోని అస్సాం రాష్ట్రంలో పండించినట్లు చెప్తారు. ఎక్కువకాలం సముద్ర ప్రయాణం చేసే వారికి స్కర్వీ వ్యాధి వస్తుంది. దీనికి కారణం వారిలో  విటమిన్ సి లోపించడం  అని తెల్సుకుని వారికి నిమ్మరసంతో చికిత్సచేసి నయం చేసారుట!   నిమ్మ పిందెగా ఉన్నపుడు ఆకుపచ్చరంగులో ఉండి ,క్రమంగా  ముదురాకు పచ్చకు వచ్చి,పండేకోద్దీ పసుపురంగుకు మారుతుంది .పసుపుపచ్చని నిమ్మపండ్లలో కావలసినంత రసం ఉంటుంది.  నిమ్మరసాన్ని  వేసవిలో ఉప్పు లేక పంచదారతో కలిపి  తాగడం వలన వేసవి వేడి నుండీ ఉపశమనం కలుగుతుంది. ఇది చాలా రుచికరంగానూ ఉంటుంది.  వేసవిలో వచ్చే అతి ధులకు చక్కని నిమ్మ రసంతో ఉపశమనం కలిగించవచ్చు. దీనినే నిమ్మ షర్బత్ అంటారు.  నిమ్మకాయ పిండేముందు నేలమీద బాగా గుండ్రగా రుద్ది పిండాలి దానివల్ల కాయ మెత్తబడి లోపలి   రసం బాగా పిండగానే వచ్చేస్తుంది. నిమ్మకాయ పరీక్షిత్తు మహా రాజు కాలంలోనే ఉన్నట్లు చెప్తారు. తక్షకుడు నిమ్మకాయలో సూక్షం రూపంలో ఉండి పరీక్షిత్తు నివసిస్తున్న ఏక స్థంభ   భవనంలోకి పండ్లబుట్టలో వెళ్ళి కాటేశాడంటారు .    

నిమ్మపండులతో రక రకాల ఊరగాయలు, నిల్వపచ్చళ్ళూ చేస్తారు. ఏదైనా అనారోగ్యం ఉన్నపుడు నిమ్మకారం ఊరగాయ తింటే నోటికీ పొట్టకూ కూడా హాయి. పత్యానికి నిమ్మ ఊరగాయ పెడితే నోటికి రుచికలిగి మంచిగా భుజించి తవ్రలోనే కోలు కుంటారు.  వేసవిలోనిమ్మ షోడాకు గిరాకీ ఎక్కువే! నిమ్మ  షర్బత్ లు, నిల్వ వుండే పానీయంగాకూడా చేస్తారు . ముఖ్యం గా  నిరాహార దీక్ష విరమించినవారికి  నిమ్మ రసం అందిస్తారు. నిమ్మరసంలోని విటమిన్ సి గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు చేసినవారికీ నిమ్మరసం  మంచిదే!.

ఆయుర్వేదంలో నిమ్మ  స్థానం గొప్పది.జీర్ణక్రియలోను,చర్మసౌందర్యానికి చాలా మంచిదని ఆయుర్వేదం చెప్తున్నది. నిమ్మ రసం  వేడి నీటిలో త్రాగితే కాలేయం శుభ్రపడుతుంది.ఊబకాయం తగ్గను ఉదయాన్నే ఒక నిమ్మపండు రసంలో ఒక స్పూన్  తేనే కలిపి త్రాగితే ఫలితం కనిపిస్తుందంటారు ఆయుర్వేదనిపుణులు.    రోజూ పర కడుపున  ఒక గ్లాసుడు గోరు వెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే కూడా ఊబకాయం తగ్గుతుందని నమ్మిక.

చుండ్రు, మొటిమలు, మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ త్రాగితే ఫలితం ఉండవచ్చు. మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణ రసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది.

చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు.  నిమ్మను చాల సౌంద ర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ముఖంమీద ముడతలను, మృతకణాలను ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్నిసరిగా చేస్తుంది. చేతులు, పాదాలు మృధువుగా వుండడానికి నిమ్మ రసం వాడతారు. 

ఇహ పోషక విలువల గురించీ అందాజ్ గా చెప్పుకుంటే --

శక్తి 30 kcal.,పిండిపదార్థాలు -9 g.,చక్కెర -2.5 g.,పీచుపదార్థాలు-2.8 g.,కొవ్వు పదార్థాలు-0.3 g., మాంసకృత్తులు-1.1 g.,నీరు-89 g.,విటమిన్ సి-53 mg 88%,సిట్రిక్ యాసిడ్ -5 g  -- లభ్యమవుతున్నాయి . మరి నిమ్మపండులో ఖచ్చితమైన రేట్లో పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు ఇలాఉన్నాయిట- .శక్తి 30 kcal 120 kJ,పిండిపదార్థాలు -9 గ్రా,చక్కెర-2.5 గ్రా,పీచు పదార్థాలు-2.8గ్రా,కొవ్వు పదార్థాలు -0.3గ్రా,మాంసకృత్తులు-1.1గ్రా,నీరు-89 గ్రా,విటమిన్ సి -53 మి.గ్రా,88% సి-,సిట్రిక్ యాసిడ్-  5 గ్రా , లభ్యమవుతాయని పోషకవిలువల నిపుణుల వ్యాఖ్య. 

నిమ్మ  సైజ్ లో తేడాలు ఉన్నప్పటికీ అన్నీ ఒకేలా కనిపించినప్పటికీ నిమ్మ లో చాల రకాలున్నాయి. ప్రపంచంలో నిమ్మ ఉత్పత్తిలో భారతదేసాందే  అగ్రస్థానంఅనిచెపప్కతప్పదు. పింగ్ర్, కాఫిర్, కీ మస్క్ వైల్డ్ స్వీట్ లైమ్, ఇలా చాల రకాలున్నాయి. సామాన్యంగా నిమ్మ చెట్టు చిన్న గుబురు మొక్కైనా కొన్ని నిమ్మ తీగలు కూడా వుండటాం చిత్రంగ అనిపిస్తుంది. దాన్నే తీగ నిమ్మ అంటారు. పెద్ద పరిమాణంలో వుండే నిమ్మకాయలను గజ నిమ్మ అంటారు. మనకు సాధారణంగా తెలిసిన రంగులు పశుపు పచ్చ లేదా ఆకు పచ్చ. కాని వీటిలో ఎర్రని, తెల్లని, గులాబి రంగు నిమ్మపండ్లుకూడా ఉన్నాయంటే నమ్మ బుధ్ధే యదు కదూ!  దొండ కాయల్లాగ పొడవుగా ఉండే నిమ్మకాయలు కూడ వున్నాయి. సృష్టిచిత్రం! 

నిమ్మ చెట్టును బోనసాయ్ చెట్టుగా అంటే మరుగుజ్జు చెట్లన్నమాట మన ఇంట్లో,  బాల్కనీలలో నేడు పెంచుతున్నారు. పెద్ద వృక్షా లను మూరెడంత విగా , చెట్ల వ్రేళ్లను,కొమ్మలను కత్తిరించి పెంచుతారు. ఇది ఒక కళ కూడా.ఐతే ఈ వృక్షాలకు కాసే కాయలు మామూలు చెట్లకు కాసినంత సైజ్ లో నేఉండటం చిత్రం.ఈ చెట్లకు యూరియా ,పొటాషియం సల్ఫేట్ , అమ్మోని యం ఫాస్ఫేట్ ఇంకా ఇతర కెమిక ఎరువులూ ద్రవరూపంలో వాడుతారు. కొందరు సేంద్రియ ఎరువులనూ వేసి ఈ బోనసాయ్ వృక్షాలనుండీ సాధారణ ఆర్గానిక్ ఫలాలను పండించడం కాస్తంత చిత్రంగానే ఉంటుంది.  ఈకాలంలో శాస్త్రఙ్ఞులు సాధించ లేని దేమీ లేదుగా!  

ఇక ఈ చెట్ల మీదుగా వచ్చే గాలి ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్నికలిగిస్తుంది. అందువల్లే చాలా మంది ఖాళీ నేల ఇంటి చుట్టూ ఉండే వారు ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టును , ముఖ్యంగా  నుయ్యి  అంటే బావి సమీపంలో  పెంచు తుంటారు.నుయ్యి చుట్టూ ఉన్న పళ్ళెం నుండీ కాలువ తీసి వాడిన నీరంతా నిమ్మపాదుకు పొయ్యేలా  చేస్తారు. ఒక్క చుక్క నీరు వృధా కాకుండా నిమ్మ పీల్చు కుంటుం ది, అందుకే  'నిమ్మకు నీరెత్తినట్లు' అనే సామెత కూడా వచ్చింది.

నిమ్మచెట్టు గాలిలో ని కాలుష్యాన్ని దిగమింగి  స్వచ్ఛమైన  గాలిని మనకు అంది స్తుంది. అంతే కాకుండా ఉష్ణోగ్రతను నియం త్రించే శక్తి నిమ్మకుంది.అందుకే నిమ్మచెట్టు దగ్గర చల్లగా ఉంటుంది. విజయవాడ కనకదుర్గనూ, ఇంకా అనేక మంది శక్తి రూపా లనూ,ముఖ్యంగా గ్రామ దేవతలనూ నిమ్మ దండలతో అలంకరిస్తారు. ఇలా దేవతల మెడలోవాలే అదృష్టం, ప్రత్యేకతా  మరే పండు కూలేని  ప్రాధాన్యత నిమ్మకే ఉంది.    కొత్త ఇళ్ళలో చేరేప్పుడు ఇంటి గుమ్మాలన్నింటిమీదా నిమ్మపండు కోసిపెడతాం, అన్ని మూలల్లోనూ నిమ్మకాయ  కోసి ఉంచుతాం.  కొత్తవాహనాలకూ నిమ్మకాయలతో దృష్టి తీయడం మన ఆనవాయితీ. కొత్త కార్ల టైర్లను ముందుగా నిమ్మ కాయలమీదనుంచీ నడుపుతాం, నిమ్మకాయలను ముందుభాగానికి కడతాం. ఇలా నిమ్మ అమ్మలా దృష్టి దోషాన్ని పోగొట్టి కాపాడుతుందని మన నమ్మకం.    

నిమ్మచెట్లు ఇంట్లో ఉంటే ఆఇంటికి దృష్టి దోషంతగల దని చాలామంది విశ్వాసం కూడా. నిమ్మ తోటలపెంపకం లాభాలను అన్ని కాలాల్లో చేకూర్చి పెడుతుంటుంది. నిమ్మలేని కాలం సంవత్సరంలో లేనేలేదు. అన్నికాలాల్లో దిగుబడినిచ్చేది నిమ్మ తోటలే.  ఐతే కొందరి భయం ఇంట్లో నిమ్మచెట్టును పెంచను  ' నిమ్మ ఉన్నచోట అమ్మ ఉండదు ' అనేమాట. ఏది ఏమైనా నిమ్మ చెట్టు ఉంటే ఆ తీరే వేరు. రైతులు వ్యాపారపంటగా నిమ్మ తోటలను పెంచుతారు.నిమ్మ  మొక్కలను జూన్ నుండి డిశెంబరు వరకు వర్షాకాలం  లోనూ  నాటుతారు.  
నిమ్మ చెట్లకు, మిగతా అన్నిచెట్లకంటే ఎక్కువ నీరు అవసరం. అందుకే పూర్వం ఇళ్ళలో నిమ్మచెట్లను నూతికి సమీపంలో వేసే వారు,లేదా స్నానం చేసిన నీరు అంతా నిమ్మపాదుకు వచ్చే లాగా కాలువలు తీసేవారు. నిమ్మ చెట్టు కు నీరు ఎక్కువగా ఎందుకు వసరమంటే నిమ్మ సంవత్సరమంతా కాపునిస్తుంది గనుక.  తల్లి లా నిమ్మ మన శరీరారోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దానిలోని వైద్య  కారకాలను సరిగా తెల్సుకుని సజావుగా వాడు కుంటే  చాలు.నిమ్మ మనిషి ఆరోగ్యానికే గాక  అందం పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.  తలంటుస్నానం  నిమ్మరసం కలిపిన నీటితో చేస్తే వెంట్రుకలు నల్లగా నిగనిగా మెరుస్తాయి.

నిమ్మ రసంతో తెల్ల ఉల్లిపాయ రసం కలిపి జుట్టు మొదట్లోబాగా రాచి ఒక అర్ధగంట ఉండి తలంటు చేసేస్తే తలలో  పేలు వాటి గుడ్లూ చచ్చినట్లూ చచ్చి ఊరు కుంటాయి. తలలో ఎక్కువగా దురద ఉంటే  నిమ్మ రసానికి  పుల్ల పెరుగు చేర్చి బాగా వెంట్రు కల లోపలి వరకూ రాచి  మర్ధనా చేసి అర్ధగంట తర్వాత తలంటు స్నానం చేస్తే  సరి .ఇహ  దురద  ఉండనే ఉండదు .స్వానుభవం కూడా.     
 నిమ్మరసానికి జిడ్డు తొలగించే స్వభావం ఉండటాన నిమ్మరసాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగి తే ముఖంమీద జిడ్డు తొలగి  తాజాగా ఉంటుంది.

ఎండబెట్టిన నిమ్మను మెత్తని పొడి చేసుకొని సున్నిపిండితో కలిపి స్నానం చేస్తే చర్మంమీది మృతకణాలన్నీ తొలగి పోతాయి.
నిమ్మరసాన్ని పెరుగులో కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించి స్నానం చేస్తే మేనిఛాయ పెరుగుతుంది.

కంటికింద ఉన్న నల్లటి వలయాలు తగ్గాలంటే దూదితో నిమ్మరసాన్ని అద్ది మునివేళ్లతో సున్నితంగా మర్ధన చేయాలి. వారం పాటు ఇలాచేస్తే కళ్లచుట్టూ కనిపించే నల్లని వలయాలు నెమ్మదిగా పోతాయి.

వేసవిలో నిమ్మ జ్యూస్ త్రాగితే వేడి తగ్గిస్తుంది, హాయిగానూ ఉంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా అందరూత్రాగవచ్చు, ఐతే షుగర్ వ్యాధి ఉన్నవారు పంచదార  బదులుగా ఉప్పుచేర్చి త్రాగితే సరి. ఆయుర్వేద  ఔషధాల శుద్ధికి ,తయారికీ నిమ్మను ఎక్కు వగా వాడుతుంటారు.  వేవిళ్లతో  బాధ పడు తున్న వారికి నిమ్మరసం, అల్లం రసం, తేనెతో కలిపి ఇస్తే త్వరగా వాంతులు తగ్గు తాయి. నోటి దుర్వాసన పోవాలంటే నిమ్మరసంలో , ఉప్పు, వంటసోడా చిటికెడు కలిపి పళ్ళమీద  మీద రుద్దితే ఫలితం కనిపిస్తుంది.

ప్రతి రోజూ ఉదయాన్నే నిమ్మరసం  తాగితే కాలేయానికి టానిక్కుగా పని చేసి పైత్యరసాల ఉత్పత్తిని పెంచుతుంది. నిమ్మరసం లోని విటమిన్ సి వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగై, అనేక రకాల అంటురోగాల నుంచి మనకు రక్షణకలిగిస్తుంది. గొంతునొప్పి, ఆస్తమాల నుంచి ఉపశమనం కలిగించే గుణం నిమ్మకు ఉంది. నిమ్మ తాను అరిగి మిగతా వాటినీ అరిగిస్తుందని పెద్దలు చెప్తారు. నిమ్మతో  “ఫేస్ ప్యాక్స్”ని తయారు చేసుకోవచ్చు

నారింజా,  నిమ్మ పండ్ల పై తొక్కలలోని “విటమిన్ ఛ్” మన చర్మ సంరక్షణలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ తొక్కల ను ఎండ బెట్టి పొడిగా చేసి పౌడరు చేసి,దానికి కొంచెం పెరుగు, నీరు కలిపి ముద్దలాచేసి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరు వాత చల్లని నీటితోకడిగితే   చర్మంలోని జిడ్డుపోయి ముఖం మిల మిల మెరుస్తుంది.   కొంచెం పెసర పిండిని, నిమ్మ రసంతో కలిపి ముఖానికి పట్టిస్తే ముఖ చర్మం మృదువుగా మచ్చలు లేకుండా తయారవుతుంది.

నిమ్మ కాయలనురసం తీశాక ఆ  చెక్కలతో  దీపారాధన చేసే కుందులను తోమితే నిగనిగలాడతాయి. కంచు, ఇత్తడి వస్తువు లను ఈచెక్కలతో తోమి కొత్త  నిగారింపు తేవచ్చు, కుక్కరు మనం తరచుగా ఉత్తిగా తోముతాము, వారానికోమారు సమయం చిక్కిన పుడు కుక్కర్లో వాడిన నిమ్మచెక్కలువేసి కాసిని నీరుపోసి ఒక్క విజిల్ వచ్చేవరకూ ఉంచి  తర్వాత వేడి తగ్గాక తోమితే కొత్త కుక్క ర్లా లోపల ఉండట మేకాక , దానిలో వండిన పదార్ధాల వాసన పోయి ఫ్రష్ గా ఉంటుంది.   నిమ్మ ను ఆయుర్వేదంలోనే కాక  సిధ్ధ ,యునానీ , ప్రకృతి ,యోగా  వైద్యాలలోకూడా వాడుతారు.

****

"అబ్బా! క్యాంపులతో ఊర్లన్నీ తిరిగి నోరు చవిచెడింది ,కమ్మగా ఏదైనా పెట్టవే చెల్లాయ్ !"అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు  అన్న కుమార్.

" రా అన్నా! నిమ్మ కాయ కారం చేసాను ,మెంతి పొడి కలిపి "అంటూ వేడి అన్నం ,నిమ్మ కారం వడ్డించి, ఇంత నెయ్యి పోసింది, గుమ్మడి వడియాలు, బియ్యపు వడియాలూ నంజుడుకు  వేసింది, గబాగబా తినేసి రెండోమారు వడ్డించమన్న అన్నను  మురి పెంగా చూసింది చెల్లాయ్  చేమంతి.  మనమూ తిందాం రండి మెంతి నిమ్మకారం.

మరిన్ని శీర్షికలు
Best Home Remedies for Dandruff in Telugu | | Dr. Murali Manohar