Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
druva is tention

ఈ సంచికలో >> సినిమా >>

అన్నయ్యకి విలన్‌గా తమ్ముడు

karthi in negetive roal with surya

అన్నయ్య రూట్‌లోనే సినీ రంగంలోకి వచ్చిన తమ్ముడు, అన్నయ్యకన్నా స్టార్‌డమ్‌ సంపాదించుకోవడం గొప్ప విషయమే. అది కూడా తమిళ సినిమాల్లో కాకుండా, తెలుగు సినిమాల్లో అన్నయ్యకు పోటీ ఇవ్వడం విశేషంగా చెప్పుకోక తప్పదు. 'గజిని' వంటి సూపర్‌ హిట్‌ సినిమాలతో సూర్య, తమిళంతోపాటు తెలుగులోనూ పాపులర్‌ అయ్యాడు. అయితే సూర్యలా సెన్సేషనల్‌ హిట్స్‌ కార్తీకి లేవు. కానీ మంచి మంచి చిత్రాలతో కార్తీ హీరోగా నిలదొక్కుకున్నాడు. 'కాష్మోరా' సినిమాతో ఇటీవల మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కార్తీ, తెలుగులో 'నా ఊపిరి'తో స్ట్రెయిట్‌ హీరో అనిపించుకున్న సంగతి తెలుసు కదా. 'కాష్మోరా' సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన ఈ విలక్షణ నటుడు, అవకాశముంటే అన్నయ్య సినిమాల్లో విలన్‌గా నటిస్తానని చెప్పాడు. 'అన్నయ్య హీరోగా నేను విలన్‌గా చేయాలని ఉంది' అంటూ మనసులో కోరికను బయటపెట్టాడు కార్తీ. హీరోగా కెరీర్‌ బాగున్న సమయంలో విలన్‌గా చేయాలని ఎవరైనా అనుకుంటారా? అదే కార్తీ ప్రత్యేకత. కార్తీని చూడగానే మన పక్కింటి కుర్రాడు, మన ఇంట్లోని కుర్రాడు గుర్తుకొస్తాడు. అదే అతని సక్సెస్‌ సీక్రెట్‌. కామెడీ చేసినా, సెంటిమెంట్‌ పండించినా, హీరోయిజం చూపించినా కార్తీకి అన్నీ బాగా సూటవుతాయి. ఏదేమైనా కార్తీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది గనుక తమ్ముడితో తెరపై ఒకే సినిమాలో తలపడేందుకు సూర్యనే ముందుకు రావాల్సి ఉంది. 

మరిన్ని సినిమా కబుర్లు
venkatesh  nex movie ready