Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ranjinikatha son in law so different

ఈ సంచికలో >> సినిమా >>

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ మెగాస్టార్‌

young and energtic megastar

ఒక్క స్టెప్పు చాలు సినిమా సూపర్‌ హిట్‌ అయిపోడానికి. జోవియల్‌గా ఓ పోజు ఇస్తే అదే డాన్సింగ్‌ సెన్సేషన్‌ అయిపోతుంది. అంతలా తెలుగు తెరపై తనదైన డాన్సులతో చెలరేగిపోయిన మెగాస్టార్‌ చిరంజీవి తొమ్మిదేళ్ళపాటు వెండితెరకు దూరమైపోవడం సినీ డాన్సుల్ని అభిమానించేవారికి చాలా కష్టమైన విషయమే. జీర్ణించుకోలేకపోయారు, కానీ ఎదురు చూశారు. ఆ ఎదురుచూపులు ఫలించాయి. అతి త్వరలో చిరంజీవి తనదైన డాన్సులతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ఇంతల తనకోసం అభిమానులు ఎదురుచూస్తున్నారని చిరంజీవికీ తెలుసు. అందుకే ఈ వయసులోనూ డాన్సులు అదరగొట్టేయాలనే నిర్ణయానికి వచ్చారు.

యంగ్‌ కొరియోగ్రాఫర్లని తన సినిమా కోసం చిరంజీవి ఎంపిక చేసుకున్నారు. లారెన్స్‌ కొరియోగ్రఫీలో చిరంజీవి ఎన్నో అద్భుతమైన డాన్సులు చేశారు. ఈ సినిమాకి కూడా లారెన్స్‌ పనిచేస్తుండగా, శేఖర్‌, జానీ అనే ఇద్దరు యంగ్‌ కొరియోగ్రాఫర్లతోనూ చిరంజీవి డాన్సులు వేస్తుండడం విశేషంగానే చెప్పుకోవాలి. వయసు పెరిగే కొద్దీ చిరంజీవి డాన్సుల్లో స్టైల్‌ పెరుగుతూ వస్తోంది, ఈజ్‌ కూడా అంతే. తమిళ సినిమా 'కత్తి'కి రీమేక్‌గా వస్తున్న 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి డాన్సులే ప్రధాన ఆకర్షణ. ప్రతిపాటా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్‌ చేశారట. రెండు పాటల్ని యూరోప్‌లో చిత్రీకరిస్తారు. దీనికోసం చిత్ర యూనిట్‌ విదేశాలకు పయనమవుతోంది. విదేశీ అందాల్ని సైతం చిరంజీవి స్టైల్‌, యడాన్సులు డామినేట్‌ చేస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. చిరంజీవి సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వినాయక్‌ దర్శకుడు కాగా, రామ్‌చరణ్‌ నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam