Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sonu sood says ..No protection in shooting spot

ఈ సంచికలో >> సినిమా >>

సినీ పరిశ్రమ భయపడాల్సిందేనా!

movie industry in fear

దేశవ్యాప్తంగా కరెన్సీ మార్పిడి దుమారం రేపుతోంది. రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. పైకి 'అంతా హ్యాపీ' అంటూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న కరెన్సీ రద్దు - మార్పిడి నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ తెరవెనుక ఎవరి పాట్లు వారికి ఉన్నాయి. తమ దగ్గరున్న నల్లడబ్బుని తెల్లగా మార్చుకునేందుకు వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. సినీ పరిశ్రమలో కూడా ఈ యాతన కొంత ఉందని అంటున్నారు. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో సంపాదించినవారు ఎక్కువగా బాధపడుతున్నారట. వారి దగ్గరనున్న నల్లడబ్బుని తెల్లడబ్బుగా మార్చే ప్రక్రియ ఇప్పటికే జరుగుతోందని కూడా గుసగుసలు వినవస్తున్నాయి. అయితే ఇదంతా గిట్టనివారు చేస్తున్న దుష్ప్రచారమేనని, సినీ పరిశ్రమలో బ్లాక్‌ మనీ అనేది చాలా తక్కువని కొందరు సినీ ప్రముఖులు అంటున్నారు. అన్ని చోట్లా ఉన్నట్లే సినీ పరిశ్రమ కూడా వ్యాపారం లాంటిదే గనుక కొందరు అక్రమార్కులు ఇక్కడ కూడా ఉండవచ్చని ఇంకొందరు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతుండడం జరుగుతోంది. వాస్తవ కోణంలో చూస్తే సినీ పరిశ్రమ లాభాల వ్యాపారం కాదు, అదొక ప్యాషన్‌. ఇక్కడ సంపాదించుకున్నవారికంటే పోగొట్టుకున్నవారే ఎక్కువ. లాభాలొచ్చిన సినిమా కంటే, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమానే నిర్మాతకీ, నటీనటులకీ, టెక్నీషియన్లకీ సంతృప్తినిస్తుంది. కాబట్టి ఇక్కడ అక్రమాలకు ఆస్కారం చాలా తక్కువ అని సినీ పరిశ్రమ పరిశీలకులు కుండబద్దలుగొట్టేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కరెన్సీ మార్పిడి మంచి నిర్ణయం. అయితే తక్షణ నిర్ణయంతో డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు అందుబాటులోకి రాక సినీ పరిశ్రమ కూడా ఇబ్బంది పడుతోంది. 
 

మరిన్ని సినిమా కబుర్లు
ranjinikatha son in law so different