Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty of kashmir

ఈ సంచికలో >> శీర్షికలు >>

గ్రీన్ టీ యొక్క అమోఘమైన ఉపయోగాలు - అంబడిపూడి శ్యాం సుందర రావు

green tea uses

ప్రస్తుతము చాలా మంది గ్రీన్ టీ ఆరోగ్య రీత్య మంచిదని డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్పటము వల్ల  త్రాగటము అలవాటు చేసుకుంటున్నారు. చైనా
వారి ఉద్దేశ్యము ప్రకారము మూడు రోజులు ఆహారము లేకుండా ఉండ వచ్చుకాని ఒక్క రోజు కూడా టీ లేకుండా ఉండలేము అని. ప్రస్తుతము శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని వాళ్ళ పరిశోధనల అనంతరము ఆ  టీ ని "గ్రీన్ టీ" గా చెపుతున్నారు అందువల్ల ప్రపంచ వ్యాప్తముగా అందరు అంగీకరించేది గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది అని దానివల్ల చాలా ఆరోగ్య పరమయిన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని, అవి ఏమిటో తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము

గ్రీన్ టీ కధ క్రీస్తు పూర్వము 2,737సంవత్సరములోనే ప్రారంభమయింది అని చరిత్ర చెపుతుంది. చైనా లోని మూలికా వైద్య పితామహుడు చక్రవర్తి షున్ నుంగ్ ఒక ప్రయాణములో కాకతాళీయముగా దీనిని కనుగొన్నాడు. టీ త్రాగటానికి నీటిని మరగిస్తున్నప్పుడు కొన్నిటీ ఆకులు వేడి నీటిలో పడి ఆ టీ రంగును కొద్దిగా ఆకుపచ్చ,గోధుమ రంగు లోకి మారింది. ఆ రాజు ఆ టీ ని త్రాగి.ఉత్తేజితుడై   ఆ టీ కి రుచే కాకుండా కొన్ని ఆరోగ్య పరమైన లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు చైనాలో పూర్వము గ్రీన్ టీ ని తలనొప్పి,ఇన్ఫెక్షన్ ను ,డిప్రషన్ ను తగ్గించటానికి వాడేవారు  నవీన కాలములో గ్రీన్ టీ వయస్సు పై బడటాన్ని ఆలస్యము చేస్తుందని, దంతాలు గట్టిగా ఉండేటట్లు చేస్తుందని   శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఇన్ఫలమేషన్ ను ఇన్ఫెక్షన్ ను నివారిస్తుందని తెలిసింది. సూర్య రశ్మి వలన కంటికి చర్మానికి జరిగే హానిని కూడా నివారిస్తుంది. అల్జీమర్స్ పార్కిన్సన్ వంటి

వ్యాధులు రాకుండా కాపాడుతుంది. గ్రీన్ టీ లో ఉండే పోషకాలు ఏమిటో తెలుసుకుందాము అన్ని రకాల టీ నలుపు అయినా ఆకుపచ్చ అయినా కెమిల్లియా సైనెన్సిస్ అనే మొక్క నుండి ఉత్పత్తి అవుతుంది టీకి వచ్చే రంగు టీ తయారీలోని పులియబెట్టటం(ఫెర్మెంటేషన్) పై ఆధారపడి ఉంటుంది. బ్లాక్ టీ పూర్తిగా ఫెర్మెంటేషన్ గావించ బడుతుంది, గ్రీన్ టీ ని అసలు ఫెర్మెంటేషన్ చేయరు .ఊలాంగ్ టీ కొద్దిగా ఫెర్మెంటేషన్ చేయబడుతుంది. తాజా టీ ఆకులను ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద నీటిలో మరిగించి తయారు చేస్తారు టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి కానీ గ్రీన్ టీ లో అధికముగా పాలీ ఫినాల్స్,థియరుబిగిన్స్.ఎపికెటెచిన్స్ ,మరియు కేటచిన్స ఉంటాయి. ఇవన్నీ ఫ్లేవనాయిడ్స్

గ్రీన్ టీ వల్ల ఆరోగ్యప్రయోజనాలు:-1.గుండెకు'ఆర్యోగ్యము -రోజు గ్రీన్ టీ త్రాగటము వల్ల కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది ముఖ్యముగా చెడు LDL కొలెస్ట్రాల్  ను తగ్గించటము వల్ల గుండెకు సంబదించిన వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

2. గ్రీన్ టీ లోని కెటాచీన్ అనే  ఫ్లవనాయిడ్ DNA ను చెడగొట్టే ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కొని క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ముఖ్యముగా ఎపిగాల్లో కెటాఛిన్ -3- గల్లెట్ గ్రీన్ టీలో అధికముగా ఉంటుంది. సాధారణ టీ లాగా దీనిని టీ  డికాక్షన్ తయారు చేయరు కాబట్టి కేటాచిన్లు నష్టపోవు,

3. గ్రీన్ టీ త్రాగ టము వల్ల బరువు తగ్గుతారు. గ్రీన్ టీ లోని కెటాచిన్స్ శరీరములోని పేరుకుపోయిన క్రొవ్వును  కరిగిస్తాయి. ఈ విధమైన క్రొవ్వును కరిగించే లక్షణమువల్ల మిగితా లాభాలు కూడా కలుగుతాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

4. శరీరము  యొక్క రోగ నిరోధకత  పెంచుతుంది. గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు నిరోధక శక్తి పెరగటానికి మంచి ఆరోగ్యనికి సాధారణముగా వచ్చే జలుబు జ్వరాలనుండి రక్షణను కల్పిస్తుంది .

5. కెటాచిన్స్ యాంటీ బ్యాక్టీరియల్ అవటమువల్ల దంతాలు పుచ్చిపోవటము , దుర్వాసన వంటి సమస్యలను దూరము చేస్తుంది. అంతేకాకుండా పళ్ళపై గార పట్టకుండా చూస్తుంది.

6. గ్రీన్ టీ మధుమేహాము ను నివారిస్తుంది లేదా రావటాన్ని ఆలస్యము చేస్తుంది అని శాస్త్రవేత్తల ప్రాధమిక పరిశోధనలలో తెలిసింది.  గ్రీన్ టీ రక్తములో గ్లూకోజ్ స్థాయిలని నియంతృస్తుంది అని కూడా శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

7. ఎముకల ఆరోగ్యాన్ని వృద్ది చేసే గుణము గ్రీన్ టీ కి ఉన్నది ఇది ఎముకల సాంద్రతను పెంచి త్వరగా విరిగే ప్రమాదాన్ని  అరికడుతుంది. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినప్పుడు ఎముక త్వరగా పెరిగి అతుక్కోవటానికి సహాయపడుతుంది.

8. ప్రస్తుతము పెద్దలు ఎదుర్కొనే సమస్య "అల్జీమర్స్ ,పార్కిన్సన్స్ " అనే వ్యాధులు.  గ్రీన్ టీ లోని పాలీఫినాల్స్ ఏకాగ్రత పెరగటానికి ఉపయోగపడి మతిమరుపును కలుగజేయవు.మెదడుకు హానిచేసే ప్రోటీన్లను శరీరములో  పేరుకు పోనివ్వదు .

9.గ్రీన్ టీ ని ఒక పానీయము మాత్రమే కాదు దీనిని ఉపయోగించి చర్మ రక్షణకు అవసరమైనా ఉత్పత్తులను తయారుచేస్తున్నారు.ఎదుకంటే గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మము ముడతలు పడకుండా చూస్తుంది. ఇవండీ గ్రీన్ టీ యొక్క కోయి నాకు తెలిసిన ఉపయోగాలు కాబట్టి ఇంకెందుకు ఆలస్యము రోజు గ్రీన్ టీ త్రాగటం అలవాటు చేసుకోండి మీ ఆరోగ్యాన్ని బాగుచేసుకోండి

మరిన్ని శీర్షికలు
horoscope from 18-11-2016 to 24-1-2016