Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with nikhil

ఈ సంచికలో >> సినిమా >>

అంధుడి పాత్రలో రాజ్‌తరుణ్‌

raj tarun as blimd

తొలి సినిమాతోనే సూపర్‌ సక్సెస్‌ అందుకున్న హీరో రాజ్‌ తరుణ్‌. హ్యాట్రిక్‌ హీరోగా కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. అనుకోకుండా హీరో అయిన ఈ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ఇప్పుడు ఎనర్జిటిక్‌ లెవల్‌ నుండి ఎక్స్‌పెరమెంటల్‌ రేంజ్‌కి ప్రమోషన్‌ అందుకున్నాడు. ఈ యంగ్‌ హీరో అంధుడి పాత్రలో నటించి మెప్పిస్తానంటున్నాడు. రచయితగా పలు సినిమాలకు పనిచేసిన వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుంకర రామబ్రహ్మం నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు.

'కుమారి 21ఎఫ్‌'తో హాట్‌ హాట్‌గా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ రాజ్‌ తరుణ్‌తో మూడోసారి జతకడుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన 'కుమారి 21ఎఫ్‌', ఆడో రకం ఈడో రకం' సినిమాలు సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. ఆ సినిమాల్లో ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా పండింది. అందుకే ఈ లక్కీ పెయిర్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలున్నాయి. ఫస్ట్‌హాస్‌ అంతా రాజ్‌తరుణ్‌ ఈ సినిమాలో అంధుడిగా కనిపిస్తాడట. అందుకే ఈ సినిమాకు 'అంధగాడు' అనే టైటిల్‌ని పెట్టినట్లు తెలుస్తోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
pawan as producer for fan