Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pawan as producer for fan

ఈ సంచికలో >> సినిమా >>

శైలజా.. శైలజా.. గాల్లో తేలినట్టుందే..

shailaja...shailaja

తొలి సినిమా 'నేను శైలజ' నుండీ తన అందంతో ఎట్రాక్ట్‌ చేస్తోంది ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. అందంతోనే కాకుండా అభినయంతోనూ ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఎంతో కాలం కాకపోయినా, అన్నీ సూపర్‌ ఛాన్స్‌లే అమ్మడిని పలకరిస్తున్నాయి. దాంతో షార్ట్‌ పీరియడ్‌లోనే బెస్ట్‌ హీరోయిన్‌ అన్పించేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో ఈ ముద్దుగుమ్మ జోరు మరీ ఎక్కువగా ఉంది. టాప్‌ హీరోలు ధనుష్‌, విజయ్‌ వంటి వారి సరసన కూడా ఛాన్స్‌ దక్కించుకుంది. ఇప్పుడు తెలుగులో ఏకంగా మూడో సినిమాకే పవర్‌ స్టార్‌ సరసన చోటు దక్కించుకుందంటే అమ్మడి లక్‌ అలా ఇలా లేదు. పవన్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యింది. సాధారణంగా త్రివిక్రమ్‌, పవన్‌ సినిమాల్లో హీరోయిన్స్‌కి స్పెషాలిటీ ఉంటుంది. డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తారు హీరోయిన్స్‌. వారికి అవి కెరీర్‌ బెస్ట్‌ లుక్స్‌ కూడా.

'జల్సా'లో ఇలియానా, 'అత్తారింటికి దారేది' సినిమాలో సమంత, ప్రణీతల గ్లామరే ఇందుకు బెస్ట్‌ ఎగ్జామ్‌పుల్‌ అని చెప్పొచ్చు. అంతేకాదు పవన్‌కి కూడా హీరోయిన్స్‌ గ్లామర్‌లో మంచి విజన్‌ ఉంటుంది. సో ఈ లెక్కల్లో చూస్తే కీర్తి సురేష్‌ అందానికి బాగా సాన పెట్టేదే ఈ సినిమా అంటున్నారు సినీ ప్రముఖులు. వారెవ్వా వాట్‌ ఏ లక్కీ ఛాన్స్‌ కీర్తి! ప్రస్తుతం ఈ భామ నానితో 'నేను లోకల్‌' సినిమాలో నటిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
coming super star 2.0