Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
shailaja...shailaja

ఈ సంచికలో >> సినిమా >>

సూపర్‌స్టార్‌ 2.0 వచ్చేస్తోంది

coming super star 2.0

శంకర్‌, రజనీ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. సంచలన స్థాయిలో విజయం సాధించింది. రజనీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా ఈ సినిమా నిలిచింది. ఇప్పుడు 'రోబో' సీక్వెల్‌ కూడా రెడీ అయిపోతోంది. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రజనీ చేతుల మీద విడుదలయ్యింది. ఈ నెల 20న సినిమా ఫస్ట్‌లుక్‌ని బాలీవుడ్‌ గ్రేట్‌ డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ చేతుల మీదుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు డైరెక్టర్‌ శంకర్‌. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు హాజరు కానున్నారట. అందుకోసం ముంబయ్‌లో యశ్‌రాజ్‌ స్టూడియోలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నారట. ఈ సినిమాలో ముద్దుగుమ్మ అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఇటీవల అత్యంత హైప్‌ మధ్య విడుదలైన 'కబాలి' సినిమా అంచనాలను తారుమారు చేసింది. కానీ 'రోబో 2.0' మాత్రం 'రోబో'ను మించి విజయం సాధిస్తుందంటున్నారు. సూపర్‌ స్టార్‌ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు ఈ సినిమాలో. అంతేకాదు చాలా యాక్టివ్‌గా కూడా నటించారట. అనారోగ్య పరిస్థిల నుండి బయటపడి, రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమా కోసం చాలా కష్టపడి నటించారట సూపర్‌ స్టార్‌. ఆ కష్టం అంతా సినిమాలో కనిపిస్తుందంటోంది చిత్ర యూనిట్‌. ఈ సినిమాలోని విజువల్‌ ఎఫెక్ట్స్‌ మొదటి పార్ట్‌ని మించి ఆకట్టుకుంటాయంటున్నారు డైరెక్టర్‌ శంకర్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
special attractions in khaidi no. 150