Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akarumata story review

ఈ సంచికలో >> శీర్షికలు >>

మూత్ర పిండాల ఆరోగ్యానికి మనము తీసుకోవలసిన ఆహారము - అంబడిపూడి శ్యామసుందర రావు

how to protectect kidney

ఆరోగ్యవంతమైన సమర్ధవంతమైన మూత్రపిండాలు మన ఆరోగ్యానికి,  మనము సుఖముగా  ఉండటానికి చాలా అవసరము. చిక్కుడు గింజ ఆకారములో ఉండే ఈ అవయము ఉపిరితిత్తుల చుట్టూ ఉండే ఎముకల గూడు దిగువన ఉంటూ మన నుండి హానికరమైన
వ్యర్ధ పదార్ధాలను విసర్జిస్తూ ఉంటుంది మనలో చాలా మంది ఎదో ఒక దశలో మూత్రపిండాల ఇన్ఫెక్షన్ వల్ల భాధ లేదా మూత్రపిండాలలో రాళ్ళ వంటి వాటితో భాధ పడటము చూస్తూ ఉంటాము.ఒక్క అమెరికాలోనే  దాదాపు 26 మిలియన్ల మంది దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బులతో బాధపడుతున్నారని లెక్కలు చెపుతున్నాయి అంత ముఖ్యమైన అవయవము పట్ల మనము కొంచెము  జాగ్రత్త, శ్రద్ద వహిస్తే అది
సమర్ధవంతముగా పనిచేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ విషయములో మనము మూత్ర పిండాల జాగ్రత్త కోసము తీసుకోవలసిన ఆహారము గురించి, మూత్ర పిండాల సమస్యల గురించి తెలుసుకోవటము అవసరము , ముందుగా మూత్రపిండాల ప్రాముఖ్యతను తెలుసుకుందాము. మూత్రపిండాలు శరీరము సక్రముగా పనిచేయటానికి అవసరమైన మూడు ముఖ్యమైన క్రియలను నిర్వహిస్తాయి అవి

1. మనశరీరములోని నీటి స్థాయిలను నియం త్రించటము :-శరీరములోని అన్నివ్యవస్థలు సక్రమముగా పనిచేయటానికి సరిఅయిన ప్రమాణములో నీరు అవసరము తక్కువఅయినా ఎక్కువ అయినా దాని ప్రభావము మన నిత్య కార్యక్రమాల  పైన  ఉంటుంది అవసరమైనప్పుడు నీటిని ఉంచుకోవటములోను అవసరములేనప్పుడు అధికముగా ఉన్న నీటిని మూత్రము ద్వారా బయటకు పంపటంలో మూత్రపిండాలు ప్రధానపాత్ర వహిస్తాయి

2. వ్యర్ధ పదార్ధాలను,విషపదార్ధాలు  విసర్జించటము :- మన శరీరము చాలా క్లిష్టమైన యంత్రము లాంటిది అది జరిపే అనేక జీవక్రియలలో కొన్ని అనవసర వ్యర్ధ పదార్ధాలు తయారు అవుతాయి వాటిని వెంటనే బయటకు పంపక పొతే అవి శరీరములో విష పదార్ధాలుగా మారి శరీరానికి హానిచేస్తాయి కాబట్టి వీటిని బయటకు పంపే పని మూత్రపిండాలది దీనివల్ల శరీరములోని ఘన ,ద్రవ పదార్ధాల మధ్య సమతుల్యత ఉంటుంది. మన శరీరములో ప్రోటీనులు విశ్లేషణ వల్ల నత్రజని సంబదిత  వ్యర్ధపదారము యూరియా తయారు అవుతుంది ఇది నీటిలో కరగి
యూరిన్(మూత్రము) రూపములో బయటకు విసర్జింప బడుతుంది ఇంతే కాకుండా కండరాల చర్యల వలన తయారయే క్రియాటినైన్ కూడా విసర్జిస్తుంది మనము వాడే మందులు ఉత్పత్తిచేసే విషపదార్ధాలు కూడా బయటి పంపేది మూత్రపిండాలే అంటే రక్తాన్ని వడపోసి శుద్దిచేసేది మూత్రపిండాలు. 

3. కొన్ని హార్మోనులను ఉత్పత్తిచేస్తుంది.:- మన శరీరములో జరిగే జీవ రసాయన చర్యలను నియంత్రించేవి హార్మోనులు ఇవి ఉత్పత్తిఅయే చోటు నుంచి పనిచేసే చోటుకు రక్తము ద్వారా చేరి వాటి ప్రభావావ్వి చూపుతాయి నియంత్రణ సమన్వయములో నాది వ్యవస్థ తరువాత ఈ హార్మోనులు చాలా ముఖ్యమైనవి. మూత్ర పిండాలపైనా టోపీ మాదిరిగా ఉండే అడ్రినల్ గ్రంధి (అధివృక్క గ్రంధి) కొన్ని అతి ముఖ్యమైన హార్మోనులను రక్తములోకి విడుదల చేస్తుంది. వీటిలో రక్త ప్రసరణను నియంత్రించే హార్మోనులుకూడా ఉంటాయి ఈ ప్రధానమైన మూడు పనులవల్ల మూత్రపిండాల ప్రాముఖ్యతను అర్ధముచేసుకోవచ్చు ఇప్పుడు అవి సమర్ధవంతముగా పనిచేయటానికి మనము ఏ రకమైన జాగ్రత్తలు లేదా చర్యలు చేపట్టాలో తెలుసుకుందాము .సమీకృత ఆహారము లో మనము తీసుకొనే పదార్ధాలు త్రాగే పానీయాలు చాలా మటుకు మూత్ర పిండాలకు ఉపయోగించేవే. ఇంకా ఏదైనా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు డాక్టరు ను సంప్రదించి ఎటువంటి ఆహారము
తీసుకోవాలో తెలుసు కోవాలి.మన మూత్రపిండాలు బాగా ఉండాలి అంటే  మన ఆహారములో పొటాషియం కలిగిన నట్స్, తాజాకూరలు, పాలిష్ పట్టని ధాన్యాలు తీసుకోవాలి కానీ మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు పొటాషియం అధికముగా కలిగిన ఆహారపదార్ధాలు తీసుకుంటె ఎక్కువగా మూత్ర  విసర్జన జరిగి దాహము ఎక్కువ అవుతుంది.  మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు తక్కువ పొటాషియం కలిగిన ఆహారపదార్ధాలు తీసుకోవటం వల్ల మూత్రపిండాలలో పాటు సాధారణ ఆరోగ్యము కూడా బాగుంటుంది అటువంటి ఆహారపదార్ధాలు ఏమిటో చూద్దాము. 

1. క్యాలిఫ్లవర్:- మూత్రపిండల ఆరోగ్యానికి దోహదపడేవాటిలో ఇది ఒకటి  దీనివల్ల పీచు,విటమిన్ సి అధికముగా లభ్యమవుతాయి అంతేకాకుండా దీనిలోని పోషకాలు శరీరములో ఏర్పడే విషపదార్ధాల చర్యను తటస్తీకరిస్తాయి మూత్రపిండాలకు వైద్యము చేయించుకునేవారు వారి ఆహారములో బంగాళాదుంపలకు నదులుగా క్యాలిఫ్లవర్  తింటే మంచిది

2. పుట్టగొడుగులులేదా 
కుక్కగొడుగులు(మష్ రూమ్స్) :- ఇవి మూత్ర పిండలా ఆరోగ్యానికి అవసరమయిన విటమిన్ డి ని అందిస్థాయి.విటమిన్ డి మూత్ర పిండాల పనిని బాగా జరిగేటట్లు చూస్తుంది   మూత్ర పిండాలకు సంబంధించిన రోగాలు రాకుండా కాపాడుతుంది సోయా పాలు కూడా విటమిన్ డికిసంబంధిచిన ఆహారము వీటిని తీసుకునేటప్పుడు మన ఆహారములో రోజుకు 200 నుండి 300 మిల్లీగ్రాముల పొటాషియం మించకుండా చూసుకోవాలి లేకపోతె మిగతా సమస్యలు ఉత్పన్నమవుతాయి.

3. యాపిల్స్:- ఇవి శరీరాన్ని శుబ్రపరిచేవి అంటే మూత్రపిండాలకు సహాయకారులు ఇవి మూత్రపిండాలకు శుభ్రము చేయటములో సహాయపడతాయి ఎలాగంటే ఎక్కువ మూత్ర విసర్జన అవసరము లేకుండానే శుభ్ర పరుస్తాయి ఇవి విటమిన్ సి మరియు పెక్టిన్
ను అందిస్తాయి యాపిల్స్ రక్తములో గ్లూకోజ్ నిల్వలను నియంత్రిస్తూ ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.

మరిన్ని శీర్షికలు
Bad Breath | నోటి దుర్వాసన | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D.