Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఎక్కడికీ పోతావు చిన్నవాడ చిత్ర సమీక్ష

ekkadiki potavu chinnavaada movie review

చిత్రం: ఎక్కడికి పోతావు చిన్నవాడా 
తారాగణం: నిఖిల్‌, హెబ్బా పటేల్‌, నందిత శ్వేత, అవికా గోర్‌, సత్య, వెన్నెల కిషోర్‌, హర్ష, రాజా రవీంద్ర, తనికెళ్ళ భరణి తదితరులు. 
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌ 
నిర్మాణం : మేఘన ఆర్ట్స్‌ 
నిర్మాత: పివి రావు 
దర్శకత్వం: విఐ ఆనంద్‌ 
సంగీతం: శేఖర్‌ చంద్ర 
విడుదల తేదీ: 18 నవంబర్‌ 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 

తన స్నేహితుడు కిషోర్‌ (వెన్నెల కిషోర్‌)కి దెయ్యం పట్టడంతో ఆ దెయ్యాన్ని వదిలించడానికి కేరళలోని మహిషాసురమర్దిని ఆలయానికి వెళతాడు అర్జున్‌ (నిఖిల్‌). అక్కడే అమల (హెబ్బా పటేల్‌) పరిచయమవుతుంది అర్జున్‌కి. ఆ పరిచయం ప్రేమకు దారి తీస్తుంది. అయితే అనుకోకుండా అర్జున్‌కి అమల దూరమవుతుంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన అర్జున్‌కి షాకింగ్‌ న్యూస్‌ తెలుస్తుంది. అసలు నువ్వెవరు? అన్న అమల ప్రశ్నతో షాక్‌ తినేస్తాడు అర్జున్‌. ఇంతలోనే మరో షాకింగ్‌ విషయం తెలుసుకున్న అర్జున్‌, ఆ షాక్‌ నుంచి తేరుకున్నాడా? అసలు అమల ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 

'కార్తికేయ' సినిమాలో నిఖిల్‌ని చూశాం. చాలా జెంటిల్‌గా ఉన్నాడు. సినిమాకి అన్నీ తానే అయి వ్యవహరించాడు. ఈ సినిమాకి కూడా అంతే. స్టైలిష్‌గా మంచి నటనతో సెటిల్డ్‌గా ఆకట్టుకున్నాడు. హుషారుగా కనిపిస్తూనే అవసరమైనచోట స్టబర్న్‌గా నటించి మెప్పించాడు. నటన పరంగా నిఖిల్‌కి వెంక పెట్టలేం. నటించడం కాదు, జీవించేశాడనటం అతిశయోక్తి కాకపోవచ్చు.  అలాగే హెబ్బా పటేల్‌ కూడా చాలా యిక్టవ్‌గా కనిపించింది. ఇప్పటిదాకా చేసిన సినిమాలకన్నా ఇంకా అందంగా ఉంది. నందితకు ఇదే తొలి చిత్రం బాగానే చేసింది. మరిన్ని అవకాశాలు వస్తే తెలుగు సినీ పరిశ్రమకు మరో మంచి నటి దొరికినట్లే. సత్య బాగానే నవ్వించాడు, వెన్నెల కిషోర్‌ కూడా కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 

కథ కొత్తదే, కథనం కూడా ఆకట్టుకునేలానే ఉంది. థ్రిల్లర్‌ సినిమాలకి ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించడం కష్టమేగానీ వర్కవుట్‌ అయితే మంచి ఫలితాన్నే ఇస్తుంది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కన్నా దర్శకుడు కామెడీ మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. అయితే స్టోరీలో థ్రిల్‌ని ఆడియన్స్‌ ఫీలయ్యేలా చేయగలిగాడు దర్శకుడు. డైలాగ్స్‌ బాగానే పేలుతాయి. కామెడీ పంచెస్‌ పరంగా ఇంకా బావుంది. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హెల్పయ్యింది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా, కొత్తగా కనిపిస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 

అక్కడక్కడా కాస్త బోరింగ్‌గా అనిపించినా ఓవరాల్‌గా దర్శకుడు కామెడీనీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌నీ బాగానే మిక్సప్‌ చేయడంతో ఓవరాల్‌గా మంచి ఔట్‌ పుట్‌ ఇచ్చాడనిపిస్తుంటుంది. తదుపరి సన్నివేశాల్ని ప్రేక్షకుడు ఊహించగలిగేయడం ఇలాంటి సినిమాలకు మైనస్‌ పాయింట్‌. దాన్ని కామెడీతో కవర్‌ చేశాడు. కథ కొత్తగా ఉండటం, నిఖిల్‌ పెర్ఫామెన్స్‌, హీరోయిన్ల అందచందాలు పస్ల నటన ఇవన్నీ సినిమాకి అన్ని విధాలా కలిసొచ్చాయి. ఫస్టాఫ్‌ సరదాగా సాగిపోతూనే అక్కడక్కడా సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఎంటర్‌టైన్‌ చేస్తాయి. సెకెండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఓవరాల్‌గా సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గానే సాగింది. క్లయిమాక్స్‌పై మీద ఇంకొంచెం ఫోకస్‌ పెట్టి ఉంటే బావుండేదనిపిస్తుంది. 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5 

మరిన్ని సినిమా కబుర్లు
interview with nikhil