Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

25-11-2016 నుండి 01-12-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద అనవసరమైన ఆలోచనలను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట అనేది సూచన. స్వల్ప అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును కావున సమయానికి భోజనం చేయుట అనేది సూచన. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయల్లో సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం కొంత ఓడిడుడులు తప్పక పోవచ్చును కావున పెట్టుబడుల విషయంలో మాత్రం అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది కావున తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళుట సూచన. అనుకోని వివాదములు కలుగుటకు అవకాశం ఉంది కావున మాటను పొదుపుగా వాడుట అనేది సూచన అందరిని కలుపుకొని వెళ్ళుట అనేది సూచన. 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలను మొదలు పెట్టుటకు ఉత్సాహంను కలిగిఉండే అవకాశం ఉంది. పెద్దలతో కలిసి చేసిన చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. బంధువులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు వారితో కలిసి విందులలో పాల్గొనే అవకాశం ఉంది. వాహనముల మూలాన ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండుట అనేది సూచన. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట వలన మేలుజరుగుతుంది. 

మిథున రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులతో చేపట్టిన చర్చలు మంచిఫలితాలను ఇచ్చుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనుల మూలాన పనిభారం తప్పకపోవచ్చును కావున ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట అనేది సూచన. ప్రయాణాలు చేయుట వలన స్వల్ప ఆరోగ్యసమస్యలు తప్పక పోవచ్చును కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. ఇష్టమైన వ్యక్తులను కల్సుఅత్రు వరైతి కలిసి చేసిన ఆలోచనలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కుటుంబంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కీకమైన మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది కావున ఈవిషయంలో ఆచితూచి వ్యవహరించుట మంచిది. ధనమునకు సంభందించిన విషయాల్లో కొంత అటుఇటుగా ఉండుటకు అవకాశం ఉంది కావున అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది నిదానం అవసరం.   

కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద ఉత్సాహంను కలిగిఉండి పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో నూతన భాద్యతలను కలిగి ఉంటారు వాటిని పూర్తిచేసే దిశగా అడుగులు వేయుట మంచిది. మిత్రులతో కలిసి చేపట్టిన పనులలో మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకువెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన ఉద్యోగంలో దాదాపు ఆశించిన విధంగా ఫలితాలు పొందుతారు. పనిఒత్తిడి తప్పక పోవచ్చును ఆరోగ్యం విషయాల్లో మాత్రం అశ్రద్ద చూపకండి తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్దఅవసరం.  

 సింహ రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలనుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది వారిసూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో చేపట్టిన పనులు మంచి ఫలితాలను ఇచ్చుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయత్నం పెంచుట వలన ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం కలదు. వ్యాపారంలో మాత్రం పెట్టుబడులు పెట్టునపుడు బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. మిత్రులతో అనుకోని విధంగా మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున వివాదములకు అవకాశం ఇవ్వకండి అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది.  


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. ధనమునకు సంభందించిన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారులతో ఉన్న అనుభందం మీకు ఉపయోగపడుతుంది నలుగురిని కలుపుకొని వెల్లుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలు కలుగుటకు అవాకాశం ఉంది,చిననాటి మిత్రుల నుండి నూతన సమాచారం సేకరించుటకు అవకాశం ఉంది. బంధువర్గంతో లేక సోదరవర్గం తో చర్చలు చేయునపుడు వారి సూచనలు పాటించుట మంచిది. పెద్దలతో వివాదములకు అవకాశం ఉంది కావున ఈ విషయంలో కొంచం తగ్గుట వలన మేలుజరుగుతుంది. ఆరోగ్యం విషయంలో నిదానంగా అలాగే జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.    

తులా రాశి : ఈవారం మొత్తంమీద  మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది చేపట్టు ప్రతిపనిలో నిదానం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తెసుకుంటే వాటికి మూల్యం చెల్లించ వలసి రావోచ్చును జాగ్రత్త. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట వలాన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు కలిగినను ధనం సమయానికి సర్దుబాటు అవ్వడానికి అవకాశం కలదు. ప్రయాణాలు చేయుట వలన అలసిపోయే అవకాశం ఉంది కావున వాయిదవేయుట మంచిది. స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సూచన. నూతన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది.   

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది చేపట్టుపనుల విషయంలో స్పష్టమైన అవగాహనా కలిగిఉండుట వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఆరంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట అనేది సూచన. ప్రయాణాలు చేయకండి వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. పెద్దలతో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున సర్దుబాటు విధానం చాలావరకు మేలుచేస్తుంది. పెద్దలతో చేసిన సంప్రదింపులు అనుకున్న స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవచ్చును ప్రయత్నం పెంచుట మంచిది. కుటుంబంలో సభ్యులనుండి వ్యతిరేకత ఉండుటకు ఆస్కారం ఉంది అందరిని నచ్చచెప్పుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. గతంలో చేపట్టిన పనులను మాత్రం విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు.  

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద స్వల్పఅనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. పెద్దలతో చేపట్టిన చర్చల మూలాన నూతన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో ఊహించని విధంగా ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మానసికంగా ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది అనవసరమైన ఆలోచనలు చేయకండి. బందుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు సమయాన్ని నచ్చిన విధంగా గడపడానికి ఇష్టపడుతారు. గతంలో చేపట్టిన పనులను అనుకున్న సమాయనికి పూర్తిచేయుట ద్వార నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది చిననాటి మిత్రులను కలుస్తారు. జీవితభాగస్వామితో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త.    

మకర రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అందరిని కలుపుకొని వెళ్ళుట వలన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది అలాగే నూతన ప్రయత్నాలను మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. అధికారులనుండి ఆశించిన విధంగా చక్కటి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి. సేవాసంభందమైన విషయాలకు ప్రముక్యతను ఇచ్చుటకు అవకాశం ఉంది గతకొంతకాలంగా ఆగిఉన్న ఆలోచనలు ముందుకు సాగుటకు అవకాశం ఉంది. పెద్దలనుండి వచ్చు సూచనలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు తీసుకుపోండి ఉత్తమం. బండువులనుండి నూతన సమాచరం సేకరిస్తారు కాకపోతే ప్రతి విషయాన్ని పట్టించుకోవడం వలన కొంత ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో కొంత ఊరట పొందుటకు అవకాశం ఉంది. 


కుంభ రాశి : ఈవారం మొత్తంమీద పనుల విషయంలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు కొనసాగించుటలో విఫలం అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి నూతన వార్తలను వినే అవకాశం కలదు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి అందరిని కలుపుకొని వెళ్ళుట చేత వివాదములు తగ్గుటకు అవకాశం ఉంది. మొండినిర్నయలు తీసుకొనే అవకాశం ఉంది మీ ఆలోచనలు తోటివారిని కొంత ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది నిదానంగా వ్యవహరించుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు ఆస్కారం కలదు. ఇష్టమైన వ్యక్తులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది సమయపాలన అవసరం.  


మీన రాశి : ఈవారం మొత్తంమీద విదేశాలనుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం సూచన. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. పనులలో సరైన ప్రణాళిక కనుక లేకపోతే ఒత్తిడి తప్పక పోవచ్చును నలుగురిలో వారికీ అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిమూలన ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకోనేందుకు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చును. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. మాటలను మాత్రం పొదుపుగావాడుట అనేది సూచన.  
 

మరిన్ని శీర్షికలు
animea