Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
story review

ఈ సంచికలో >> శీర్షికలు >>

.‘ కిచ్చిలి ’ - ఆరంజి చెట్టు. - హైమాశ్రీనివాస్.

orange tree

" ఆరంజి రసం ! ఆరంజి రసం. ఫ్రష్ " అనేకేక విని బయటికొచ్చింది భానుమతి. ఉదయం తొమ్మిది. ఆదివారం .వీధిలో ఒక బండిమీద ఆరంజి పండ్లు పెట్టుకొని త్రోసుకుంటూ వస్తున్న ఒక కుర్రాణ్ణి చూసింది. అది వాడికేకే అని అర్ధమైంది ఆమెకు.    " ఏరా!నిండా పన్నెండేళ్ళు లేవు! ఇలా బండిమీద ఆరంజి పళ్ళేసుసుకుని అమ్ము కోక పోతే , చక్కగా బళ్ళో కెళ్ళి చదువుకోవచ్చుగా!" అంది. విశ్రాంత ఉపాధ్యాయి నైన ఆమె.

" ఏంచైమంటారు అమ్మగారూ ! మా నాయినకు ఒంట్లోబాలేదమ్మా! ఆయనే బండి రోజంతా తిప్పేవోడు.మాకు కడుపు నిండాల న్నా, నాస్కూల్ పుస్తకాలకూ ఈ బండే దిక్కు, మా గుడిసె చుట్టూతా  మాతాత ఏసిన పది ఆరంజి చెట్లున్నాయ్, అవేమా కడుపులు నింపుతున్నై అమ్మా! ఈ పండ్లు అమ్ము డైతే మాకు రెండ్రోజుల భోజనం." అంటున్న ఆ పిల్లవాడిని ఆగమని, తన ఇంట్లో అందరినీ చుట్టుపక్కల వాళ్ళనూ,కేకేసి ఆరంజి రసం అప్పటి కపుడు ఫ్రష్ గా తీయించి అందరినీ త్రాగమని ఆఫర్ చేసి,బండిలోని పండ్లన్నీ ఖాళీ చేయించి ఆపిల్ల వాడి చేతుల్లో మరి కాస్త ఎక్కువే సొమ్ము పెట్టి, " ఇహ వెళ్ళి చదువుకో పోరా!" అని పంపింది భానుమతి.ఆసాయంకాలానికి అంతా భానుమతిని " ఏం భానూ ! ఆ ఆరంజి బండి పిల్లాడు రేపూ వస్తాడా! రసం ఎంత బావుందో! కడుపు చల్లగా ఉంది " అని అడగ సాగారు.
ఆరంజి రసం చేసే మేలు చాలా ఎక్కువేమరి.

ఆరంజి పండు పుట్టిల్లు చైనా. మెట్టినిళ్ళు మనదేశంతో సహా ప్రపంచం మంతానూ. ఆరంజి ఉష్ణ ప్రాంతా ల్లోనూ సమశీతోష్ట  ప్రాంతాల్లోనూ కూడా కూడా బాగా పండుతుంది. ఐతే చాలా కారణాలవల్ల  ప్రస్తుతం మార్కెట్లో విస్తా రం గా  లభించటం లేదు. నిమ్మకన్నా ఆరంజి రసం  ఉత్తమమైనది . ఆరంజి పండు సిట్రస్ జాతికి చెందిన ఫలం. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలు ఆరంజి లో ఉన్నాయి.

సంస్కృతంలో “నారంగ-ఐరావతి” అంటే, హిందీలో దీన్ని  -నారంగీ, సంతరా- అనీ, బంగ్లాలో -కమలా రేఖ - అనే పేర్లతో పిలు స్తుంటారు. ఆరంజి పండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగి స్తుంది. మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. ఆరంజి చెట్టు వర్షాకాంలోను, వేసవికాలం లోను కూడా కాపు కాస్తుంది. వర్షాకాలపు ఆరంజి పండ్లలో పులుపు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎండా కాలం కాసే  ఆరంజి పండ్లలో తియ్యదనం ఎక్కువగా ఉంటుంది. పుల్లగా ఉండే నారింజ కన్నా, తియ్యగా ఉండే ఆరంజి శ్రేష్టమైనది. “ఆరెంజ్ క్లాటస్ ఆరంటమ్” అనే శాస్త్రీయ నామం కలిగిన ఆరంజి పండ్లు చలి కాలంలో ఎక్కువగా దొరుకు తుంటాయి.
ఐతే పుల్ల ఆరంజి తో ఊరగాయలు పెట్టు కుంటారు.తియ్య ఆరంజి  రసం త్రాగను ఇష్ట పడతాం. ప్రకృతి మాత ప్రసాదించిన పండ్లలో అత్యుత్త మమైనది నారింజ. అనేక  విటమిన్లతో పాటుగా ఎముకలు, దంతాల పుష్ట్టికి అవ సరమైన కాల్షియం ఆరంజి పండులో సమృద్ధిగా లభిస్తున్నది. ఆరంజి పండులో ఉండే కాల్షియం శరీరంలోని ధాతువుల లో అతి తేలిగ్గా కలిసి పోతుంది. ఆరంజి పండు తొనల్లో కాల్షియం ఎక్కువగా ఉంటున్నందున ఆరంజి పండును రసం పిండుకుని త్రాగే కన్నా, వల్చుకుని తొనలను లోపలి ముత్యాలతో సహా నమిలి తినటం మంచిది. ఆరంజి పండులో కాల్షియం తో బాటు ఇతర సేంద్రియ లవణాలు, లోహాలు, విటమిన్ సి, ఫోలేట్, థయామిన్ కూడా తగినంతగా ఉన్నాయి.

100 గ్రాముల నారింజ పండులో పోషకా లు ఇలా లభిస్తున్నాయి.తేమ - 87.8% ,పిండి పదార్థాలు 12.0గ్రాములు, క్రొవ్వు పదార్థాలు 0.1 గ్రాములు, మాంసకృత్తులు 0.6 గ్రాములు, కాల్షియం 20 మిల్లీగ్రాములు, భాస్వరం 10 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 20 మిల్లీగ్రాములు, ఇనుము 0.9 మిల్లీగ్రాములు, ఉప్పు 1 మిల్లీగ్రాము, పొటాషియం 86 మిల్లీగ్రాములు, పీచు పదార్థం 0.3 మి.గ్రాములు , సేంద్రియ లవణాలు - 0.4% ,విటమిన్ - ఏ - 350 ఐ. యూ,విటమిన్ - బి1 - 120 ఐ. యూ విటమిన్ - సి - 68 ఐ. యూ,శక్తి 50 కేలరీలు. పోషకాలలో ముఖ్యమైన పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటివి నారింజలో ఉన్నాయి .

ఆరంజి పండు మంచి జీర్ణకారి. జీర్ణశక్తిని పెంపొందించి శరీర పోషణను కావల్సిన శక్తిని ఇస్తుంది. జీర్ణ రసోత్ప త్తి ని ఎక్కువ చేసి, ఆకలిని పుట్టించి, అజీర్ణకోశంలోను విషక్రిములను తరిమేస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట భోజనా నంతరం కొంచెం ఆరంజి రసం, ఉదయం స్నానాంతరం కొంచె నారింజ రసం తీసుకుంటే మలబద్ధకాన్ని మటు  మాయం చేయవచ్చు. ఫ్రీ మోషన్ అవుతుంది. కేవలం ఆరంజి రసాన్నీ, వలిచిన పండు తొనలను అధికంగా ఇచ్చి ఉబ్బసం లాంటి శ్వాసకోశ వ్యాధులను  పోగొట్టవచ్చు. ఆరంజి పండు శరీరంలోని మాలిన్యాలను తొలగి స్తుంది. ఆరంజి పండు గర్భిణి స్త్రీలకు,బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.చిన్న పిల్లలకు ఆరంజి పండును బాగా పెట్టినట్లైతే కాలేయ సంబంధ వ్యాధులు,జలుబు  తదితర వ్యాధులు రావు.  

ఇంకో చిత్రం ఏంటంటే మనుషుల్లో మంచి వారూ చెడ్ద వారిలాగే ఆరంజి పండులో చేదు ఆరంజి లూ కూడా ఉన్నాయంటే చిత్రమే కదూ! ప్రకృతి మాయ. చేదు ఆరంజి ను  ఆంగ్లంలో బిట్టర్ ఆరెంజ్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం  ‘సిట్రస్ ఔరంటియుమ్ ‘. ఇది కూడా నిమ్మజాతి చెట్టే.  ఈ చెట్టు ఫలం చూడటానికి కమలా పండు లాఉంటుంది. ఈ పండు కమలాపండు లాగానే పుల్లగా, తీయగా ఉండక చేదుగా ఉంటుంది. అందుకే  దీన్ని ‘ చేదు ఆరెంజ్ ‘లేక  ‘చేదు నారింజ’ అంటారు. ఇది ‘సిట్రస్ మాక్సిమా’  ‘సిట్రస్ రెటికులాటా’ నిమ్మజాతుల సంకర జాతి. ఐతే ఈచేదు ఆరెంజ్ తినను పనుకి రాకపోయినా దీన్నిఅనేక రకాలను ‘ఎస్సేన్షియాల్ ఆయిల్ ‘ తయారీలో ఉపయోగిస్తారు.ప్రకృతిలో పనికి రానిదేదీ లేదుగా, ఐగా మానవ మేధ దేన్నైనా ఉపయో గించు కుంటుందాయె!ఈ ముఖ్యమైన నూనెను పరిమళ ద్రవ్యాలలోను, రుచుల కొరకు కలిపే ద్రావకాలలోను , మూలికా వైద్యంలో ఉపయోగిస్తారు.

ముదిరిన ఆరంజి కాయలను ఊరగాయలా నిల్వపెట్టుకుని యాడాదంతా తింటారు.బాగా ముదిరిన కాయలు పండకుండానే  కోసి, ఉప్పులో ఊరబెట్టి, కారం ,మెంతి పొడి కలిపి నిల్వ ఊరగాయపెడతారు. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది చేస్తుంది. ఆరంజి లో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్లు కూడా ఉన్నాయి. జ్వరపడి జీర్ణశక్తి తగ్గిన వారికి పూర్వం అజీర్ణ  సమస్యల నివారించను, ఆరంజి ఊరగాయతో పథ్యం పెట్టేవారు. ఆహారనాళాలలో విషక్రిములు  చేరకుండా నిరోధించే శక్తి కూడా ఆరంజి కు ఉంది. ఆరంజి లో ‘బెటా కెరోటిన్  ‘అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం-ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగనూ సహకరిస్తుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న ఆరంజి ను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే,చర్మానికి మంచి నిగారింపు కలుగు తుంది.జలుబు, దగ్గు లాంటి సమస్యలను దూరం  చేస్తుంది . ఆరంజి రోజూ పర కడుపున ఒక గ్లాస్ ఆరంజి జ్యూస్ తాగితే, మార్నింగ్ సిక్నెస్నుండి సులభంగా బయటపడవచ్చు. గర్భవతులు రోజూ ఒక గ్లాస్ ఆరంజి జ్యూస్ తాగినట్లైతే - ఫోలిక్యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరమే రాదు.  

ఆరంజి తొక్కను పడేయకుండా… ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే చర్మానికి మంచిది. చర్మంపై ఉండే మృతకణాలన్నీ తొలగిపోతాయి. ఆరంజి లో విటమిన్లు, లవణాలు, ఎక్కువగా ఉండటం వల్ల, దీనికి ప్రపంచంలో ఎంతో గిరాకీ ఉంది. విటమిన్ - ఏ, బి -స్వల్పంగా, విటమిన్ - సి ఎక్కువగా దీన్లో ఉంటాయి. ఆరు ఔన్సుల ఆరంజి రసం త్రాగితే చాలు, మనిషికి ఆ రోజుకు కావలసిన 'సి' విటమిన్  సంపూర్ణంగా లభించినట్లే. కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది. దీనిలోని కాల్షియం శరీర ధాతువుల్లో సులభంగా కలసిపోతుంది. తీపి ఆరంజి లో చక్కెర ఎక్కువఉండటాన  ఎక్కువ శక్తి నిస్తుంది. సూర్యరశ్మిలో పండినప్పుడు, ఆరంజి లోని పిండిపదార్ధాలు చక్కెరగా మారుతాయి. ఆరంజి సులభం గా జీర్ణమవుతుంది. ఆరంజి లో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్లు కూడా లభిస్తాయి. ఆరంజి పండ్లలో అధిక పోషక విలువలు ,ఫైబర్'లు ఉంటాయి.

'అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్' వారు తెలిపిన దాని ప్రకారం -మిగిలిన ఆహార పదార్థాల కన్నా పండ్లు చాలా ఆరోగ్యకరమని తెలిపారు. పండ్లు అధికంగా ఫైబర్ ,తక్కువ గ్లైసిమిక్'లు ఉండటమే.అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వారు తెలిపిన దాని ప్రకారం అధిక పోషక విలువలు కలిగిన  మొదటి 10 రకాల ఆహార పదార్థా ల లో ఆరంజ్ పండు  ముందుంది. ఆరంజి లో ఉండే పోషకాలు మధుమేహ వ్యాధి గ్రస్తులలో ఆరోగ్యాన్ని పెంపొంది స్తాయి.  నారింజ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో జబ్బులను నివారించడంతో పాటు మరెన్నో వ్యాధు లకు ముందస్తు బెయిల్లాగా ముందస్తు చికిత్సగా కూడా పని చేస్తుంది. ఆరంజి తో వచ్చే కొన్ని ఆరోగ్య ప్రయో జ నాలివి. బరువు తగ్గించుటలో ఆరంజ్ పండ్లు అద్భుతంగా పని చేస్తాయి . కిడ్నీలో రాళ్లకు కారణ మయ్యే క్యాల్షియమ్ ఆక్సలేట్ను ఆరంజి జ్యూస్ పూర్తిగా తొలగిస్తుంది. అందుకే కిడ్నీలో రాళ్లు వచ్చేందుకు అవకాశం ఉన్న వారు తరచూ ఆరంజి జ్యూస్ తాగమని వైద్యుల సలహా  కూడా. 

అంతేకాదు రక్తంలో విటమిన్- సి ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే అల్సర్లను కూడా నివారిస్తుంది. ఆరంజ్ లోని యాంటీఆక్సిడెంట్స్, ఫోలేట్, పొటాషియమ్ గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది.  ఒక కప్పు ఆరంజ్ రసం లో 112 క్యాలోరీలు ఉంటాయి అనగా ఒక ఆరంజ్ పండులో ఉండే క్యాలోరీల కన్నా రెట్టింపు అని అర్థం.

రండి రండి మనమూ ఫ్రష్ ఆరంజ్ జ్యూస్ త్రాగి మన అనా రోగ్యానికి చెక్ పెడదాం.                 

మరిన్ని శీర్షికలు
mangalampalli bala muralikrishna