Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

పోర్న్‌స్టార్‌ అయినా ప్రభావం చూపింది

sunny leone  feel happy

సన్నీలియోన్‌ తన గతం గురించి ఎప్పుడూ బాధపడదు. తాను గతంలో పోర్న్‌స్టార్‌ననే విషయం ఎప్పుడూ మర్చిపోనని చెబుతుంటుందామె. పోర్న్‌స్టార్‌గా కెరీర్‌కి గుడ్‌ బై చెప్పేసి మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్‌ నటిగా బిజీ అయిపోయిన సన్నీలియోన్‌ తెలుగులో 'కరెంట్‌ తీగ' సినిమాలో నటించింది. ఈ బ్యూటీ అత్యంత ప్రభావవంతమైన మహిళల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించి సర్వే ఒకటి బిబిసి సంస్థ నిర్వహించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు ఇందులో పోటీ పడ్డారు.

భారతదేశానికి చెందిన ఐదుగురికి 100 మందిలో స్థానం దక్కింది. వారి సరసన సన్నీలియోన్‌ కూడా చోటు దక్కించుకోవడం గొప్ప విషయంగానే భావించాలి. ఈ ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది సన్నీలియోన్‌. నటిగా తనకు ఇంత గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది సన్నీలియోన్‌. 2005లో బిగ్‌బాస్‌లో నటించడం ద్వారా బాలీవుడ్‌లో చోటు దక్కించుకున్న సన్నీలియోన్‌ ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అడల్ట్‌ కామెడీస్‌కీ, అడల్ట్‌ థ్రిల్లర్స్‌కీ ఆమె తప్ప ఇంకొకరు సాటిరారనేంతలా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంది. భారత సంతతికి చెందిన సన్నీలియోన్‌ కెనడాలోనే పుట్టిపెరిగింది. ఇప్పుడిప్పుడే భారతీయత అంటే ఏమిటో తెలుసుకుంటున్నట్లు సన్నీలియోన్‌ చెప్పింది. 

మరిన్ని సినిమా కబుర్లు
biggest block bustter