Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
latest and hottest pooja hegde

ఈ సంచికలో >> సినిమా >>

చిరంజీవితో వినాయక్‌ ఏం మాయ చేస్తున్నాడో!

vinayak mesmerize

రీమేక్‌ సినిమా అంటే ఎప్పుడూ కత్తిమీద సామే. కానీ రీమేక్‌ల మీద ఇంట్రెస్ట్‌ తగ్గదు. కొత్త కథలతో కన్నా ఆల్రెడీ విజయవంతమైన కథలు సేఫ్‌ జోన్‌ అనే భావనతోనే ఆ కథల మీద ఇంట్రెస్ట్‌ ఎక్కువ చూపిస్తుంటారు. అలాగే మంచి కథని ఇంకోసారి చూపించాలనే ఆలోచన కూడా రీమేక్‌లకు కారణం. తమిళంలో ఘనవిజయం సాధించిన 'రమణ' సినిమాని తెలుగులోకి 'ఠాగూర్‌'గా రీమేక్‌ చేశారు. ఒరిజినల్‌ వెర్షన్‌తో పోల్చితే తెలుగు వెర్షన్‌లో కమర్షియల్‌ అంశాలు ఎక్కువ. మెగాస్టార్‌ స్టార్‌డమ్‌ ఆ సినిమాకి ప్లస్‌ అయ్యింది. ఫలితం సూపర్‌ హిట్‌. ఆ సినిమాకి వినాయక్‌ దర్శకుడు. 9 ఏళ్ళ విరామం తర్వాత చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా 'ఖైదీ నెంబర్‌ 150'. ఇది తమిళ సినిమా 'కత్తి'కి రీమేక్‌. ఈ 'ఖైదీ నెంబర్‌ 150'కి కూడా దర్శకుడు వినాయకే.

వినాయక్‌నే చిరంజీవి ఎంచుకోవడానికి కారణం, 'ఠాగూర్‌' సినిమానే. వినాయక్‌తో చిరంజీవికి ఆ కంఫర్ట్‌ ఉంటుంది. మంచి కథ దొరికితే, దానికి మెరుగులు బాగా దిద్దగల కమర్షియల్‌ మాస్‌ డైరెక్టర్‌ వినాయక్‌. 'కత్తి' సినిమా తమిళంలో ఘనవిజయం సాధించింది. దాంతో 'ఖైదీ నెంబర్‌ 150' ఇంకా పెద్ద సంచలన విజయం అందుకుంటుందని చిరంజీవి అంచనా వేస్తున్నారు. ఓ రకంగా వినాయక్‌, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో పెద్ద మ్యాజిక్కే చేస్తున్నాడట. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ విషయంలో చిరంజీవి అంచనాలకు తగ్గట్టుగానే వినాయక్‌ వ్యవహరిస్తున్నాడని సమాచారమ్‌. మెగాస్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అనే స్థాయిలో ఈ సినిమా ఫలితం ఉండబోతోందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ చెప్తున్నాయి. 


 

మరిన్ని సినిమా కబుర్లు
balakrishna act in poori jagannaath direction