Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty of kashmir

ఈ సంచికలో >> శీర్షికలు >>

గోతెలుగు కథా సమీక్షలు - ..

కథ : నిర్మానుష్యం..
రచయిత :  డాక్టర్.అప్పారావు పంతంగి .
సమీక్షకులు : సుంకర వి హనుమంతరావు.
గోతెలుగు 93వ సంచిక!

 

నాకు ఇంత మంచి కధను విశ్లేషించే అవకాశం కల్పించిన గోతెలుగు వారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఆ మధ్య ఒక పాఠకుడు గోతెలుగు కధలన్నీ ఓతెలుగు పత్రికలా మూస ధోరణి లో అంటూ విశ్లేషించారు. దయచేసి ఈ కధ చదవండి. మనసుమార్చు కుంటారు.

నిజానికి ఇది కధ కాదు.జీవితాలకు ప్రతిబింబం.ఈనాడు సమాజంలో ప్రతి చోటా ప్రతి క్షణం కనిపించే దయనీయ జీవితాల సమాహారం.డాక్టర్ గారూ ఎంత చక్కగా విశ్లేషించారు..సార్.  నిస్సహాయులైన అమ్మానాన్న..

బతుకు తెరువు కోసం తన దేహాన్నే పణంగా పెట్టిన  అబల..అటూ యిటూ కాని జీవితాలతో బ్రతుకు పోరాటం చేసే ఆ జాతి మనుషుల వ్యధను మనో ఫలకాలమీద ముద్రించుకు పోయేలా..చిత్రించిన మీ రచనా పాఠవానికి..నమస్సుమాలు. నేను కథలోని కంటెంట్ ను టచ్ చేసి..పలుచన చేయలేను. మనసుతో చదవి ఆ అనుభూతిని ఆస్వాదించాలి. అప్పుడే  కధకోఅర్దం పరమార్దం.ఈ మూడు సంఘటనల్లో కథలోని పాత్రలెలా స్పందించాయో..అంతకు మించిన స్పందన మన మనసును కబ్జా చేసుకుంటుంది. నేనీ మాటలు చేతితో రాయడంలేదు..గుండె కవాటాల స్పందనతో రాస్తున్నాను.

“తాను పుండై..ఒకరికి పండై..

తాను శవమై..వేరొకరికి వశమై..”

ఏ కవిలో రగిలిన భావావేశమో గాని..మన కళ్లల్లో తిరిగే..కన్నీటి కెరటాల..ఘోషవుతుంది. ఈ కథను ఎంత సమీక్షించినా..తరగని వ్యధే రూపు దిద్దుకంటుంది.

డాక్టర్ గారూ! దగా పడుతున్న అభాగ్య జీవితాలను ఆలోచించేలా  ఆవిష్కరించారు. మీ కలం నుండి ఇటువంటి జీవితాలే జాలువారాలని కాంక్షిస్తున్నాను.

 

మీరూ యీ కథ చదివేవుంటారు లేకపోతే కింద లింకు ఓపెన్ చేసి చదవండి...http://www.gotelugu.com/issue93/2454/telugu-stories/nirmanushyam/

 

 

మరిన్ని శీర్షికలు
weekly horoscope december 2nd to december8th