Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvandi. navvinchandi

ఈ సంచికలో >> శీర్షికలు >>

నడి వయస్సు వారు తప్పనిసరిగా తీసుకోవలసిన పోషకాలు - అంబడిపూడి శ్యామసుందర రావు.

health tips for middle age persons

సాధారణముగా బాల్యము యవ్వనము దశలలో ఆకలి ఎక్కువగా ఉంటుంది ఎటువంటి ఆహారము తిన్నా జీర్ణము అవుతుంది అందుకే పెద్దలు "రాళ్లు తిన్న హరించుకొనే వయస్సు" అని బాల్యాన్ని యవ్వనాన్ని అంటారు క్రమముగా నలభై ఏళ్ళు వచ్చేసరికి నది వయస్సు అని అంటారు మనము ఎప్పుడయితే నలభైకి చేరామోఅప్పటినుంచి మన శరీరములో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. అప్పటినుంచి ఏమాత్రము ఎక్కువ తిన్నా లావు అవటము జరుగుతుంటుంది ఆడవారి లో మెనోపాజ్ దశ ప్రారంభమవుతుంది .ఎక్కువ మందిలో మధుమేహము,అధిక రక్త పీడనము, గుండెకు సంబంధించిన వ్యాధులను,ఇతర ఆరోగ్య సమస్యలను గమనించవచ్చు కాబట్టి నలభై ఏళ్ళు దాటినా వారిలో ఎదో ఒక ఆరోగ్య సమస్య పెద్దదిగాని చిన్నదిగాని రావటము సహజము వీటిని ఎలా ఎదుర్కోవాలి అన్నది ప్రధాన సమస్య దీనికి పరిష్కారము మనము తినే ఆహారము అందలి కొన్ని ముఖ్యమైన విటమిన్లు ప్రస్తుతము వాటి గురించి తెలుసుకుందాము. బ్రతకటానికి ఆహారము అవసరము ఆరోగ్యముగా బ్రతకటానికి ముఖ్యముగా నలభై దాటినా వారు విస్మరించకూడని విటమిన్ల ను తీసుకోవాలి

విటమిన్ బి 12:- రక్తానికి,మెదడు బాగా పనిచేయటానికి ఇది అవసరము నలభై ఏళ్ళు  వయస్సు వచ్చినవారికి యాభై దగ్గరకు చేరినవారికి ఇది చాలా అవసరము. పిల్లలు, యువతకు బి 12 విటమిన్ వారు తినే ఆహారము ద్వారానే లభ్యమవుతుంది ముఖ్యముగా చికెన్,చేపలు, పాల ఉత్పత్తులు,గ్రుడ్లు మొదలైన వాటి వల్ల లభ్యమవుతుంది కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ విటమిన్ శరీరంలోనికి శోషణ తగ్గిపోతుంది
కాబట్టి యాభైవ పడిలో పడినవారు పూర్తిగా ఆహారము మీద ఆధారపడకుండా విడిగా తీసుకోవాలి ప్రతిరోజూ మనకు 2.4mg ల బి12 విటమిన్ కావాలి ఇది నీటిలో కరిగే విటమిన్ కాబట్టి ఎక్కువ తీసుకున్నా ప్రమాదము లేదు ఎక్కువైనా విటమిన్ బయటకు విసర్జింపబడుతుంది 

2. క్యాల్షియమ్ :- మనము తీసుకొనే ఆహారంలోని క్యాల్షియమ్ ను ముప్పైఏళ్ల వరకు ఎముకలు వాటికి అవసరమైనంత వరకు శోషిస్తాయి ఎముకల బలానికి కండరాల సంకోచాలకు,నాడులు ,గుండె పనిచేయటానికి క్యాల్షియమ్ అవసరము వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరానికి అవసరమైన క్యాల్షియమ్ ఆహారము ద్వారా లభ్యము కాకపోతే శరీరము క్యాల్షియమ్ ను ఎముకలనుండి  సంగ్రహించి ఎముకలను బలహీన
పరుస్తుంది  అందువల్ల నలభై ఏళ్ళు దాటినవారు క్యాల్షియమ్ అధికముగా ఉండే ఆహార పదార్ధాలను తప్పనిసరిగా తీసుకోవాలి లేదా క్యాల్షియం మాత్రలను తీసుకోవాలి.

3. విటమిన్ డి :-వయస్సు వల్ల శరీరములో వచ్చే మార్పులను ఎదుర్కోవాలంటే విటమిన్ డి చాలా అవసరము.డి విటమిన్
లోపము మధుమేహము,గుండె జబ్బులు, బ్రెస్ట్ కొలోన్ క్యాన్సర్  వంటి జబ్బులకు  దారితీస్తుంది విటమిన్ డి శరీరము క్యాల్షియమ్ శోషణకు అవసరము విటమిన్ డి ని సూర్య రశ్మి ద్వారా పొందవచ్చు కానీ అందరికి అటువంటి అవకాశము లేనప్పుడు డీ 3 విటమిన్ మాత్రలను తీసుకోవాలి 

4. మెగ్నీషీయం:- ఇది రక్త పీడనాన్నిఅదుపు చేసేది కాబట్టి నలభై ఏళ్ళు  దాటినవారికి చాలా అవసరము ఎందుకంటే ఆ వయస్సుకు చేరినవారికి అధిక రక్త  పీడనంవుండే అవకాశాలు ఎక్కువ. మధుమేహము, గుండెజబ్బులు మొదలైనవి మెగ్నీషియం లోపముతో ముడిపడి ఉన్నాయి, మెగ్నీషియమ్ కండరాలు ,నాడులు , గుండె బాగా  పని  చేయటానికి తోడ్పడుతాయి ఆకుకూరలు,బీన్సు సోయా ,వంటి ఆహారపదార్ధాలను అధికము గా తీసుకోవటంద్వారా శరీరానికి అవసరమైన మెగ్నీషియమ్ ను పొందవచ్చు మెగ్నీషియము  ఎక్కువ అయితే పెద్దగా ఆరోగ్య సమస్యలు రావుగాని  డయోరియా,నాసియా వంటి సమస్యలు వచ్చే అవకాశము ఉంది. 

5. పొటాషియమ్ :-  ఎంత వయస్సు వారికైనా  పొటాషియమ్ బ్లడ్ ప్రెజర్ ను అదుపు లో ఉంచుతుంది. ఈ మధ్య జరిపిన పరిశోధనలలో శాస్త్రవేత్తలు మెనోపాజ్ దశకు చేరిన ఆడవారు పొటాషియం అధికముగా కలిగిన ఆహారము తీసుకుంటే గుండె పోతూ వచ్చే అవకాశాలు తక్కువ అని గుర్తించారు. సమతుల్య ఆహారముద్వారా అరటి పండ్లు, బంగాళా దుంపలు బీన్స్ వంటి ఆహార పదార్ధాల ద్వారా పొటాషియం ను పొందవచ్చు. సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు డాక్టర్ల పర్యవేక్షణ అవసరము ఎందుకంటే ఎక్కువ పొటాషియమ్ తీసుకుంటే అన్న వాహిక గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది ఈ పరిస్థితి కార్డియాక్ అరెస్ట్ కు దారితీయవచ్చు 

6. ఓమెగా 3:- ఇది సాంకేతికంగా విటమిన్ కాకపోయినప్పటికీ అది అందించి లాభాల వల్ల దీనిని విటమిన్ల వరుసలో చేర్చవచ్చు వయస్సుతో వచ్చే కొన్ని హానికరమైన మార్పులను ఎదుర్కోవటములో  సహాయపడుతుంది. ముఖ్యముగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గింస్తుంది.ఓమెగా3 లోని క్రొవ్వు ఆమ్లాలు రక్త పీడనాన్ని ,చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గిస్తుంది.ఓమెగా3 జ్ఞాపక శక్తి
పెంపొందించటము లోను , ఆలోచనలను వేగవంతము చేయటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. రక్తములో ఓమెగా 3 ఎక్కువగా కలిగి ఉన్నవారు జ్ఞాపక శక్తికి సంబంధించిన పరీక్షలలో బాగా చేయటాన్ని శాస్త్రవేత్తలు ఈ మధ్య గమనించారు ఓమెగా3 చేపలు,వాల్నట్స్ ప్లేక్స్ సీడ్స్ ,ఆకుకూరల ద్వారా లభ్యమవుతుంది లేని పక్షములో దానికి సంబంధించిన సప్లిమెంట్ ను తీసుకోవాలి.

7. ప్రోబయోటిక్స్ :- ఇవికూడా సాంకేతికంగా విటమిన్ లేదా మినరల్స్ కాదు కానీ మన శరీరానికి(వయస్సు పైబడ్డవారికి) చాలా అవసరమైనవి. బరువు తగ్గించుకోవటానికి జీర్ణనాళము సక్రమముగా పనిచేయటానికి ఇవి అవసరము. ఇవి హార్ట్ అటాక్స్, మధుమేహము వంటి వ్యాధులువచ్చే అవకాశాలను  తగ్గిస్తాయి ఇవి పాల ఉత్పత్తులలోను, పులియ బెట్టిన సోయా గింజలలోను  అధికముగా ఉంటాయి.

మరిన్ని శీర్షికలు
adavi bapiraju gari story vana story review