Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
neredu tree

ఈ సంచికలో >> శీర్షికలు >>

న్యూమరాలజీలు శాస్త్రీయమా, అశాస్త్రీయమా - సిరాశ్రీ

1. అశాస్త్రీయమైన జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ పేరుతో జనాన్ని చాలా మంది దోచేస్తున్నారు. జనం మోసపోతున్నారు. దీని పట్ల జనవిజ్ఞానవేదిక మొదలైనవాళ్లు చేస్తున్న కృషి గొప్పది. ఆ కృషి మరింత చేసి సమాజాన్ని కాపాడాలి. టీవీల్లో వస్తున్న జ్యోతిష్య, వాస్తు కార్యక్రమాల్ని కూడా ఆపాలి. 

2. జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీలు శాస్త్రీయమా, అశాస్త్రీయమా అనేది పక్కన పెడితే జనం వాళ్లు నమ్మేదే నమ్ముతారు. జనవిజ్ఞానవేదికల్లాంటివి ఎన్ని ఉన్నా ఫలితం ఉండదు. వ్యసనమో, అవసరమో, సరదానో జనం కొన్నిటికి ఖర్చుపెడతారు. అలా పెట్టినప్పుడే రకరకాల ఉపాధులు సృష్టించబడతాయి. చెప్పేవాడికి, వినేవాడికి లేని బాధ చూసేవాడికి ఎందుకు? ఈ ఏడుపంతా జనం మోసపోతున్నారన్నదానికంటే తీరిగ్గా కూర్చుని జ్యోతిష్యులు లక్షలు సంపాదించేస్తున్నారనే. 

పై రెండిట్లో ఏది కరెక్ట్?
మరిన్ని శీర్షికలు
meeremantaru