Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
balayya, krish both are fighting satakarni

ఈ సంచికలో >> సినిమా >>

బుజ్జీమాతో రొమాన్స్‌ చేయనున్న నాగ్‌

bujjeemaa.. got lucky chance

సీనియర్‌ హీరోలంటే సీనియర్‌ హీరోయిన్స్‌లతోనే రొమాన్స్‌ చేయాలి అనే రూల్‌ మారిపోయింది. ఇప్పుడిప్పుడూ ఇండస్ట్రీకి వచ్చిన లేలేత ముద్దుగుమ్మలు కూడా అవకాశం వస్తే సీనియర్స్‌తో రొమాన్స్‌ చేయడానికి అస్సలు మొహమాటపడడం లేదు. ఇక సీనియర్‌ హీరోల విషయానికి వస్తే బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి హీరోలు సీనియర్స్‌తోనే జోడీ కడుతున్నారు. కానీ నాగార్జున మాత్రం అలా కాదు. ఒక పక్క సీనియర్‌ భామలతో రొమాన్స్‌ చేస్తూనే మరో పక్క జూనియర్‌ భామలతో కూడా ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తూ ఉంటాడు. అందుకే టాలీవుడ్‌కి మన్మధుడయ్యాడు నాగ్‌. తాజాగా నాగార్జునతో జోడీ కట్టబోతున్న భామ ఎవరో తెలుసా? సీరత్‌ కపూర్‌. అదేనండీ 'రన్‌ రాజా రన్‌'లో క్యూట్‌ క్యూట్‌ లుక్స్‌తో 'బుజ్జీమా'గా అలరించిన ముద్దుగుమ్మ. నాగార్జున డైరెక్టర్‌ ఓంకార్‌తో 'రాజుగారి గది' సీక్వెల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా, అందులో ఒన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌గా సీరత్‌ కపూర్‌ని ఎంచుకున్నారట. నాగార్జునతో సినిమా అనగానే అమ్మడికి ఒక్కసారిగా నేల మీంచి గాల్లో ఎగిరినంత పని చేసిందట సంతోషం పట్టలేక. గతంలో 'సోగ్గాడే చిన్న నాయనా' సినిమాలో లావణ్య త్రిపాఠికి లక్కు చిక్కింది. 'ఓం నమో వేంకటేశాయ'లో ప్రగ్యా జైశ్వాల్‌కీ, తాజాగా సీరత్‌కీ సీనియర్‌ హీరో నాగ్‌తో నటించే అరుదైన అవకాశం దక్కింది. నాగార్జున యంగ్‌ డైరెక్టర్స్‌కీ, న్యూ డైరెక్టర్స్‌కీ ఛాన్సివ్వడంలో ముందుంటారు. ఇప్పుడు ఆ క్యూ హీరోయిన్స్‌కీ ఇచ్చేశాడు. లేటు వయసులో యంగ్‌ హీరోయిన్స్‌తో వరుసగా జత కడుతున్నాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
sakshi chowdary ready to item song