Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
maharaja chiken curry

ఈ సంచికలో >> శీర్షికలు >>

సభకు నమస్కారం - ..

నారంశెట్టికి తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ పురస్కారం (పత్రికా వార్త) 

 

 

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత బాలసాహితీవేత్త నారంశె    ట్టి ఉమామహేశ్వరరావు రచించిన "వింత జలం" బాలసాహిత్య గ్రంధానికి తొలుత ప్రకటించిన విధంగానే తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర హోం శాఖామాత్యులు నాయిని నరసింహారెడ్డి మరియు ఆర్ధిక శాఖా మాత్యులు ఈటెల రాజేందర్ గార్లు అందించారు. హైదరాబాదు, నాంపల్లిలో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆవరణలో గల ఎన్.టి.ఆర్. ఆడిటోరియంలో  డిసెంబరు ఒకటవ తేదీ సాయంత్రం జరిగిన సభలో సాహితీ పురస్కారాన్ని నారశెట్టికి ప్రధానం చేసారు. ఈ సభకు సంధానకర్తగా విస్తరణ సేవా విభాగం అధికారి రింగు రామమూర్తి వ్యవహరించగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఎస్వీ. సత్యనారాయణ అధ్యక్షత వహించారు. తెలంగాణా రాష్ట్ర హోంశాఖా మాత్యులు నాయిని నరసింహారెడ్డి మరియు ఆర్ధిక శాఖా మాత్యులు ఈటెల రాజేందర్ గార్లు  ముఖ్య అస్ర్థులుగా  హాజరయ్యారు. తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారాలు పొందిన మొత్తం పదకొండు మంది సాహితీ వేత్తలకు  పురస్కారం కింద రు. 20116.00 ల నగదు, జ్ఞాపిక , పురస్కార పత్రం చొప్పున అందించి శాలువాతో సత్కరించారు. నారశెట్టి ఉమామహేశ్వర రావుకు అవార్డు రావడం పట్ల పలువురు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేసారు.                           

మరిన్ని శీర్షికలు