Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty of kashmir

ఈ సంచికలో >> శీర్షికలు >>

గోతెలుగు కథాసమీక్షలు - ..

కథ : ఫేస్ టు ఫేస్ బుక్
రచయిత్రి  కె.శ్రీలత
సమీక్ష : మాలాకుమార్ 
గోతెలుగు 80వ సంచిక!

 

ఈ మధ్యకాలం లో అంతర్జాలం లో సోషల్ నెట్ వర్క్ సైట్ లు ఎక్కువయ్యాయి.వాటన్నిటి లోనూ ఎక్కువగా ప్రాచుర్యం పొదింది ముఖపుస్తకం అనబడే ఫేస్ బుక్.ఒకప్పుడు ఎక్కువగా యువతనే ఉపయోగించేవారు.కాని ఇప్పుడు అన్ని వయసులవారూ ఉపయోగిస్తూనేఉన్నారు.దీని వలన ఎక్కడెక్కడో దేశచిదేశాలలో ఉన్నవారితో పరిచయాలు, ఆపైన స్నేహాలు కలుస్తున్నాయి.చాలా మంది దీనికి బానిసలైపోతున్నారు.అదో అలా ఫేస్ బుక్ కు పూర్తిగా అంకితమైపోయిన ఓ ఇల్లాలి కథే  కె.శ్రీలత గారు వ్రాసిన ఈ కథ "ఫేస్ టు ఫేస్ బుక్." ఇది  గో తెలుగు.కాం పత్రిక లో ప్రచురించబడినది.

కొండంత ఆస్తి,ప్రేమించే భర్తా,హాస్టల్ ఉండి చదువుకునే ఇద్దరు ,ఇంట్లో పనంతా పూర్తిచేసే నమ్మకమయిన పనివాళ్ళు ఉన్న ఇల్లాలు నీహారిక.ఆమె ఏ విషయాలనూ సీరియస్ గా తీసుకోదు.బరువు, బాధ్యతలు ఆమె దరి చేరవు.ఉదయం నిద్ర లేవగానే పది నిముషాల్లో కాలకృత్యాలు ముగించుకుని ఆపై ఇరవై నిముషాలు ప్రశాంత వాతావరణంలో మెడిటేషన్ అపైన గంటసేపు యోగా, ఏదో మొక్కుబడిగా దేవుడి పూజ ముగించుకొని లాప్ టాప్ తీసి ఫేస్ బుక్ లో కి లాగిన్ అయ్యిందంటే మళ్ళీ మధ్యాహ్నం భోజనం సమయం వరకూ నెట్ ఓపెన్ చేసి దేశం లోని ఇతర రాష్ట్రాల్లోని స్నేహితులతోనూ అలాగే వేరే దేశాల్లో వున్న తన బంధుమిత్రులందరితోనూ చాటింగ్ చేస్తూ రోజులు గడిపేస్తుంది. అది తన హాబీ.. టీవీ చూడటం.. భర్తతో కల్సి సినిమాకి కానీ... పార్క్ కి కానీ.. వెళ్ళటం అంటే ఆమెకు ఎలర్జీ.. పిల్లలతో.. భర్తతో కలిసి టూర్ కి వెళ్ళాలన్న ఆమె దృష్తీలో టైం వేస్ట్ ఎవరితోనూ పరిచయాలు చేసుకోదు... ఎవర్నీ ఇంటికి రానీయ్యదు... ఎంతసేపూ ఆ ఫేస్ బుక్ లో ఎవరెవరో పంపే మెసేజ్ లకు లైకులు కొట్టుంటూ క్రొత్త క్రొత్త  స్నేహాలు పెంచుకుంటూ.... వాళ్ళు పంపే ప్రతీ ఫోటొలను షేర్ చేసుకుని అద్భుతం గా వున్నాయంటూ కామెంట్లు పెట్టడమూ తప్ప తనకంటూ చేయడానికి కానీ... ఆలోచించడానికి కానీ ఏ పనీ పెట్టుకోదు.ఎవరున్నా  లేకున్నా తన ప్రపంచం తనది.అలా అలా రోజులు గడిపేస్తున్న నీహారిక ఓసారి ఫేస్ బుక్ ఓ ఫ్రెండ్ పెట్టిన ఫొటో లు చూసి తనకూ అలా ఏవైనా ఫొటోలు పెట్టాలనే కోరిక కలిగింది.అందుకని సాయంకాలం డ్రైవర్ లేకుండా సిటీ కి దూరంగా ఉన్న వాటర్ ఫాల్స్ కు వెళ్ళింది.తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడి,  దారిలో నిర్మానుష్యం గా ఉన్న ప్రదేశం లో కార్ ఆగిపోయింది.భర్త ఊళ్ళోలేడు.మీటింగ్స్ లల్లో ఉంటాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచుతాను అని చెప్పాడు.డ్రైవర్ కు కాల్ చేస్తే సెల్ లిఫ్ట్ చేయటం లేదు.తనకు కొన్ని వందల మంది స్నేహితులు ఆదుకునే స్నేహితులు ఫేస్బుక్ నిండా వున్నారు... కానీ ఫ్చ్ పాపం లోకల్ లో వుండి అవసరం లో ఆదుకునే స్నేహితులు మాత్రం లేరు. శాంతమ్మ లాంటి గతిలేని వారి ఫోన్ నెంబర్స్ తన దగ్గరుండవు. తన మొబైల్ లో వున్న ఫ్రెండ్స్ అందరూ హై పొజీషన్ లోని వారు... దూర ప్రాంతాల వారు..ఒకటీ అరా కార్లు తనను దాటుకుంటూ స్పీడుగా వెళుతున్నాయి. ఆ టైం లో ఎవ్వర్నో నమ్మి లిఫ్ట్ అడక్కూడదనీ ఆమె భావన.భయం తో వళ్ళంతా చెమటలు పోస్తున్నాయి.అప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి?ఏమిచేసి అక్కడి నుంచి బయటపడింది అన్నది మిగతా కథ!

ఈ ఫేస్ బుక్ కు బానిసలై ఎవరితోనూ సత్సంబంధాలు లేక ఏమి కోల్పోతున్నారో తెలుసుకోలకపోతున్నారు.ఏదైనా టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకొని లాభపొందాలి కాని దానికి బానిసలు కాకూడదు.ఈ ఫేస్ బుక్ పరిచయాలు ఏదో కాల్క్షేపానికే గాని అందరినీ దూరం చేసుకోకూడదు.అదే విషయము నిహారిక స్నేహితురాలు మానస తో "చుట్టుపక్కల వారితో.... సమాజం లోని మిగతా వారి పట్ల నీకు చాలా బలహీనమైన సంబంధాలున్నాయని ఈ ఒక్క ఫోన్ తో నాకు అవగతమైంది. ఒక్క విషయం గుర్తుంచుకో నీహారికా! ఈ నెట్ పరిచయాలు స్నేహాలు..  సోషల్ వెబ్ సైట్స్... అందులో కనిపించే సుందర దృశ్యాలు అన్నీ ఆర్టిఫీషియల్ వీ...... తాత్కాలికమైనవి. భర్తా...పిల్లలు... కుటుంబసభ్యులు..మన చుట్టు ప్రక్కవాళ్ళు వారానికి ఒక సారైనా మన ఇంటికి వచ్చి పలకరించే ఆత్మీయులు..శ్రేయోభిలాషులు వెళ్ళంతా సమాజం లో మనతో పాటు శాస్వతం గా సంబంధాలు కల్గినవారు.మనం ఏదైనా పని మొదలుపెడుతున్నప్పుడు భుజం తట్టి ప్రోత్సాహం అందించే ఆత్మీయులు ..

అలాగే విజయం సాధించినపుడు షేఖ్యాండ్ యిచ్చి కంగ్రాట్స్ తెలిపే నిజమైన స్నేహితులు లేనప్పుడు మనం ఎంత సంపాదించినా ఎంత హై పొజీషన్ లో వున్నా.. మానవ సంబంధాలు సరిగ్గా లేనప్పుడు అదంతా వృధా ప్రయాస అవుతుంది. మన చుట్టు పక్కల వారి ఆనందం లో... భాధలో పాలు పంచుకుంటూ...మనం చేయగలిగిన సాయం అందిస్తూ మనకు అవసరమైనప్పుడు వారి సహాయం అందుకుంటూ సమాజం లో మన పాత్ర గుర్తెరిగి ముందుకెళ్ళాలి... ఇకనైనా నువ్వు ఇది తెల్సుకుని ఇంతకాలంగా నువ్వు ఏది మిస్ అయ్యావో గ్రహించి అది ఆస్వాదించే ప్రయత్నం చేయి. ఎం.బీ.ఏ లో గోల్డ్ మెడల్ సాధించిన నువ్వు తుప్పుపట్టిన యంత్రం లా ఇంట్లోనే వుండడం నాకు చాలా బాధగా వుంది." ఇలా విపులంగా చెప్పించారు రచయిత్రి.చాలా కరెక్ట్ గా చెప్పారు.ఈ మధ్య చాలామంది నీహారిక లాగానే ఏదో ఒక రకంగా సమాజం తో సత్సంబంధాలు లేకుండా వారి వారి ప్రపంచం లో ఉంటున్నారు.అలాంటివారందరి కీ ఇది చక్కని సందేశము.కథ బాగుంది.

ఫేస్ బుక్ గోతి లో పడ్డ నీహారికను, స్నేహితురాలు మానస చేయి అందించి పైకి తీయటము చాలా అర్ధవంతంగా ఉందీచిత్రము.ఐనా గోతెలుగు లోని చిత్రాల గురించి ప్రత్యేకముగా చెప్పాల్సింది లేదు. మాధవ్ గారు వేసే మంచి మంచి బొమ్మలకోసమే నాలాంటి వారు కథలు పంపుతారంటే అతిశయోక్తి కాదు.

మరిన్ని శీర్షికలు
weekly horoscope 9th december to 15th december