Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వండి - నవ్వించండి - ..


1. విద్యార్థి ఇడ్లీ తీసుకున్నటీచర్, చట్నీ మిగిలింది

టీచర్: 5-5 ఎంత అవుతుంది?
టీచర్ ప్రశ్నకు విద్యార్థి మౌనంగా ఉంటాడు.
టీచర్: సరే, విను. నీ దగ్గర ఐదు ఇడ్లీలు ఉన్నాయి. ఆ ఐదు ఇడ్లీలను నేను తీసుకున్నాను. అప్పుడు నీ వద్ద ఏం ఉంటుంది?
విద్యార్థి: సాంబర్, చట్నీ ఉంటుంది టీచర్
మొదటి వ్యక్తి: చెట్లను ఎందుకు కొట్టి వేస్తున్నారు?
రెండో వ్యక్తి: కొత్త మొక్కలు నాటి మంచిపేరు తెచ్చుకుందామని.
***************************************************

2.అతని భార్య మాట్లాడుతోందట

టెలిఫోన్ బూత్‌లో ఓ వ్యక్తి రిసీవర్ చెవి వద్ద పట్టుకుని ఏమీ మాట్లాడడం లేదు.
మరో వ్యక్తి అతను ఫోన్ చేయడం అయిపోగానే తాను ఫోన్ చేయాలని తొందరపడుతుంటాడు.
రిసీవర్‌ను మొదటి వ్యక్తి ఎంతకి పెట్టేయకపోవడంతో రెండో వ్యక్తికి కోపం వస్తుంది. దాంతో అతను లోనికి చోరబడుతాడు.
రెండో వ్యక్తి: ఏమండీ.. ఊరికే రిసీవర్ పట్టుకున్నారు. ఏమీ మాట్లాడడం లేదు.
నెంబర్ కలవకపోతే నాకు ఇవ్వవచ్చు కదా..
నేను ఫోన్ చేసుకుని వెళ్లిపోయిన తర్వాత నువ్వు చేసుకోవచ్చు కదా..
టైం వేస్ట్ చేస్తున్నావు.
మొదటి వ్యక్తి: ఆగవయ్యా.. మొగుడా... అవతల నా భార్య మాట్లాడుతోంది.
***************************************************

3.రాకేష్: నాకు రైల్లో నిద్ర పట్టలేదురా...
సురేష్: ఎందుకు...
రాకేష్: అప్పర్ బర్త్ వచ్చింది..
సురేష్: ఎవరితోనైనా ఎక్స్‌చేంజ్ చేసుకోలేకపోయావా...
రాకేష్: చేసుకుందామంటే కింది బెర్త్‌లో ఎవరూ లేరు.
***************************************************

4.అమెకు అతను షాకిచ్చాడు ఇలా
బాయ్ ఫ్రెండ్: ప్రియా.. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను
గర్ల్ ఫ్రెండ్: ఏం.. ఎందుకు..
బాయ్ ఫ్రెండ్: ఇంట్లో వాళ్లు వద్దంటున్నారు..
గర్ల్ ఫ్రెండ్: మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు...
మీ పేరెంట్సేనా..
బాయ్ ఫ్రెండ్: కాదు... నా భార్య, నా పిల్లలు
***************************************************

5.అత్త: దేవుడు నీకు రెండు కళ్లు ఇచ్చాడు... బియ్యంలో రాళ్లు ఏరి, వండాలని తెలియదా...
కోడలు: భగవంతుడు నీకు 32 దంతాలు ఇచ్చాడు.. ఆ మాత్రం నమిలి మింగలేవా.
***************************************************

6.భార్యకు అతను ఎలా చెప్పాడు
అర్థరాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. దాంతో గాఢంగా నిద్రపోతున్న పోలీసాఫీసర్ భర్తతో భార్య సంభాషణ ఇలా సాగింది.
భార్య: ఏమండీ ఇంట్లో దొంగలు పడ్డారు, త్వరగా లేవండి..
భర్త: నేను డ్యూటీలో లేను, నన్ను లేపొద్దు.
***************************************************

7.రామారావు రెండు రోజుల పాటు ఆఫీసుకు రాలేదు. దాంతో బాస్ పిలిచి అడిగాడు.
బాస్: రెండు రోజులు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయావు...
రామారావు: మా తాతగారు చనిపోయారండీ, దాంతో ఊరెళ్లాను.
బాస్: సరే, ఇక ముందు అలా చేయకు. ఇలాంటి సందర్భాల్లో ముందే చెప్పు వెళ్లు.

మరిన్ని శీర్షికలు
foot protection  treatment in home