Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
foot protection  treatment in home

ఈ సంచికలో >> శీర్షికలు >>

"దేశము నా కిచ్చిన సందేశము" శ్రీ బుచ్చిబాబు గారి కథ సమీక్ష - అంబడిపూడి శ్యామసుందర రావు

desdamu nakicchina sandesamu story review
బుచ్చిబాబు గా ప్రసిద్ధి చెందిన శ్రీ శివరాజు వెంకట సుబ్బారావుగారు  తెలుగు సాహితి ప్రపంచములో సుస్థిర స్థానము సంపాదించుకొన్న ప్రముఖ నవలా,కదా,నాటక రచయిత . బుచ్చిబాబు గారి పేరు చెప్పగానే పాఠకులకు గుర్తు వచ్చేది అయన నవల "చివరకు మిగిలేది"అనే నవల. ఈ నవల పై కాత్యాయని అనే ఆవిడ పరిశోధనాత్మక వ్యాసాన్ని సమర్పించి కాకతీయ విశ్వ విద్యాలయము నుండి పి.హెచ్ డి ని పొందారు. ఈ నవల ఇంగ్లిష్ లో కూడా అనువదింపబడింది బుచ్చిబాబు గారు జూన్ 1916లో ఏలూరులో జన్మించారు 1938లో ఆంధ్రా
యూనివర్సిటీ లో బి. ఏ డిగ్రీ ,1942లో మద్రాసు యూనివర్సిటీ నుండి ఎమ్ . ఏ డిగ్రీని పొందారు. అనంతపురము, వాల్తేరులలో ఆంగ్ల భాషా అధ్యాపకుడిగా పనిచేసి 1945లో ఆకాశవాణిలో ప్రోగ్రామ్ అసిస్టెంట్ గా చేరారు. విద్యార్థి దశనుండి రచనా వ్యాసంగము ప్రారంభించాడు. రచనా వ్యాసంగముతో పాటు చిత్రలేఖనములోను రంగ స్థలము లోను తన అభిమానాన్ని చూపి ప్రావీణ్యతను గడించాడు .

ఈయన రచనలు అన్ని సంఘముతో ముడిపడిన సంఘర్షణలే.వ్యక్తులను కాదు వాళ్లలోని బలహీనతలను ద్వేషించాలి అన్న సందేశాన్ని ఈయన కధలు ఇస్తాయి  బుచ్చిబాబు గారు స్వతాహాగా సౌమ్యుడు మృదుభాషి, తన రచన ఆధారము గానే మల్లీశ్వరి సినిమా తీసినా ఆ కధ నాది అని కోర్ట్ కు ఎక్కి రభస చేయని మంచివాడు బుచ్చిబాబు . ఈయనపై ప్రముఖ ఇంగ్లీష్ రచయితలు సోమర్ సెట్  మామ్, ఓ హేన్రి  వంటి వారి ప్రభావము ఉంది. ప్రముఖ చిత్రకారుడు బాపుగారు ఈయన అన్నగారి కుమారుడు. వీరి శ్రీమతి సుబ్బలక్ష్మి గారుకూడా మంచి రచయిత్రి.ఆవిడ ఈ సంవత్సరము జూన్ లో బుచ్చిబాబుగారిశతజయంతి ఉత్సవాలను నిర్వహించారు.   యాభై ఒక్క సంవత్సరాల వయస్సులోనే బుచ్చిబాబుగారు అనంతలోకాలకు వెళ్లి పోయారు కానీ అయన  రచనలు నేటికీ నిత్యనూతనంగా పాఠకులచే ఆదరింపబడుతున్నాయి అందువల్లే తెలుగు సాహితి జగత్తులో అయన స్థానము సుస్థిరం.అయనరచనలలో , ప్రస్తుతము "దేశము నా కిచ్చిన సందేశము"కథను గురించి కొంత చెప్పుకుందాము.

ఈ కథ చాలా చమత్కార ప్రదమైనది. ఇందులో బుచ్చిబాబుగారి రచనా నైపుణ్యము హెచ్చు.ఉద్యోగి జీవితములో  ఉద్యోగికి ఎదురయే ప్రశ్న  జీతము గురించి ,ఆర్ధిక విషయము అవటం చేత, ప్రశ్నఒక్కటే అయినా ,అడిగేవాళ్ళు అనేకులు అయినప్పటికీ  రచయిత కథానాయకుడు తో  ఈ ప్రశ్నకు సూటిగా సమాధానము చెప్పించకుండా చిత్ర విచిత్రంగాసమాధానాలు చెపుతూ చాలా తెలివిగా తప్పించుకుంటూ ఉంటాడు. జవాబులివ్వటములో రచయిత చూపించే నేర్పు అమోఘము అద్భుతావహము . కదా ప్రారంభములో కథానాయకుడిని పరీక్ష ఏమైంది అని అడుగుతారు "పోయింది" అని సమాధానము ఇస్తే," నాటకాలు సంగీతాలు ఆటలు పెట్టుకుంటే చదువులొస్తాయా" అని
ఎత్తిపొడుపు మాటలు. కథానాయకుడు అప్పటికి యువక ఆవేశముతో తానూ పరీక్ష పాస్ అవకపోతే దేశానికి ఏమి అనర్ధము వస్తుందని అడుగుతాడు దానికి ప్రశ్న అడిగిన పెద్దమనిషి ,"దేశానికి ఏమి హాయిగానే ఉంటుంది పరీక్ష పాస్ అవుతే  నాలుగు రాళ్లు  గడించుకుంటావు మీ నాన్నను సుఖపెడతావు పెళ్ళానికి నగలు చేయించుకుంటావు",అని ఉత్తముడు,స్వార్ధ రహితుడు, శ్రేయోభిలాషి సందేశము
ఇచ్చి వెళ్ళిపోతాడు. నాలుగు రాళ్లతోనే ఇన్ని చేయవచ్చా అని ఆలోచిస్తూ క్లబ్బుకు వెళతాడు క్లబ్బులో తప్పిన వాళ్ళు పాస్ అయినా స్నేహితులందరిని స్వార్ధపరులుగా భావించి వాళ్లకు ఉద్యోగాలు రావని తీర్మానించుకుంటారు.ఇంతలో కధానాయకుడి తండ్రి స్నేహితుడు" పరీక్ష తప్పవుటాగా" అని ఆ సానుభూతి," కలెక్టర్ కావలసినవాడివి తప్పటమేమిటీ "అని ఊరడింపుమాటలు "ఈసారైనా బాగా చదివి పాస్ అవ్వు" అని ఉచిత సలహా ఇచ్చి వెళతాడు.

మొత్తానికి మన కథానాయకుడు పరీక్షలు పాస్ అయి ఆ మహానుభావుడి మాట పుణ్యమా అని నాలుగు రాళ్లు గడించే స్థాయికి చేరుకుంటాడు. అప్పుడు మొదట్లో పరామర్శించిన శ్రేయోభిలాషి, ఉత్తముడితో ప్రశ్నల పర్వము ప్రారంభమవుతుంది సంఘము కథానాయకుడిని ఆ ఉత్తమ పురుషుడి ద్వారా అడిగిన ప్రశ్న,"అయితే అబ్బాయి నీకేమిస్తారు", "ఏవో నాలుగు రాళ్లు",కధానాయకుడి జవాబు ,"అసలు ఎంతిస్తారో చెబుదు ఉద్యోగమూ చేస్తున్నావు కాబట్టి ఎన్ని వెటకారము మాటలైనా అంటావు" అని పెద్దమనిషి శతవిధాలా జవాబు రాబట్టడానికి ప్రయత్నిస్తాడు ఈ ప్రశ్న వెనుక మన జాతీయత,నాగరికత,సంస్కారము దాగి ఉన్నాయి." నాలుగురాళ్లు అంటే నాలుగు రూపాయలా, గంటకా వారానికా" లాంటి ప్రశ్నలతో జవాబు రాబట్టానికి ప్రయత్నించి ఆఖరికి ,"చంపక చెబుదు"అని బ్రతిమాలుతాడు ఈ సందేహము ఎలాంటిది అంటే సందేహము తీరకపోతే ప్రాణము కూడా  తీసేస్తుంది కాబట్టి అయన చస్తే హత్య చేసిన వాడిని అవుతానని భయముతో కొద్దిగా తెలివి ఉపయోగించి ,"నాలుగు అంకెలు గల రెండంకెల సంఖ్య ",అని జవాబిస్తాడు, వెంటనే ఆవ్యక్తి,'తొంభై నాలుగా"అని
ప్రశ్నిస్తాడు దానికి కధానాయకుడు "నలభై తొమ్మిది ఎందుకు కాకూడదు "అని ఎదురు ప్రశ్న వేస్తాడు దానికి ఆ పెద్ద మనిషి," ఇంత చదువు చదివినా కిళ్ళీ కొట్టు వాడి సంపాదన కన్నా తక్కువ", అని సానుభూతి వాక్యాలు పలికి ముందు ముందు జీతము పెరగవచ్చు అని చెప్పి చల్లగా జారుకుంటాడు ఇంటికి వచ్చి భోజనాల దగ్గర కూర్చుంటే  పిల్ల నిచ్చిన మామగారు ,"  ఎంత ఇస్తారేమిటి "అని ప్రశ్నిస్తాడు  కోపము వచ్చిన "మీకు తెలుసుగా" అని బింకంగా సమాధానము ఇస్తాడు . దానికి మామగారు విచిత్రముగా నవ్వి ఇంక్రిమెంట్ ఎంత అని అదైనా చెప్పిద్దామని ప్రయత్నము చేసాడు. కానీ మన కథానాయకుడు గడుసుగా,'వచ్చే సంవత్సరానికి ప్రొబేషన్ పూర్తి అవుతుంది ",అంటాడు. సాయంత్రము క్లబ్ కి వెళితే ఒక స్నేహితుడు ,"ఎరా బ్రదర్ ఎంత డ్రా చేస్తున్నావురా?"అని చనువుగా అడుగుతాడు. " నువ్వెంత డ్రా
చేస్తున్నావో నేనూ అంతే " అన్న సమాధానము విని ఆ స్నేహితుడు ,"మనము ఇంకా డ్రాయింగ్ దాకా రాలేదు "అని నవ్వుతాడు , "అయితే నువ్వు డ్రా చేయడము మొదలెట్టినప్పుడు ఏంతో అంత"ఈ సమాధాన నికి అదిరి పడ్డ స్నేహితుడు మెల్లగా జారుకుంటాడు.

తన గురించి తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉండగా ఈ జీతము గురించి ఎందుకు అందరు పదే పదే ఈ ప్రశ్న అడుగుతారో అస్సలు అర్ధము కాదు మన కథానాయకుడికి , తానే ఎదురు పడిన వ్యక్తిని ఈ ప్రశ్న అడిగితె ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా వస్తుంది. ఇంతలో తాశీల్దార్ రాజారావుగారు ఎదురై ,"ఉద్యోగమూ దొరికిందిటగా ఎంతిస్తారు "అని అడుగుతాడు. " మొదట్లో అందరికి ఇచ్చినట్లే నాకు ఇస్తారు
"అని జవాబిస్తాడు "ఇంచుమించు వంద దాకా అన్నా వస్తుందా"అని అంటే ," రిటైర్ అయ్యే నాటికి రెండు వందల దాకా వెళుతుంది లెండి మరి మీకో? అని ఎదురు ప్రశ్న వేస్తాడు జవాబు చెప్పకుండానే అయన వెళ్ళిపోతాడు. మూడేళ్ళలో రెండు వందల ఇరవై మూడుసార్లుఈ ప్రశ్న అడగటము జరిగింది కానీ ఎవరికీ సూటిగా సమాధానము చెప్పకుండా దాటేశాడు మన కథానాయకుడు. ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు దూరపు బంధువు క్షేమ సమాచారాలు అడిగి ఇప్పుడు ఎంత యిస్తున్నారని అడుగుతాడు ఈ విధముగా అడిగినవాళ్లే  మళ్ళా అడుగుతూ పోతుంటే
దీనికి అంతుందా ?, ఈ ధోరణీ తప్పించటానికి ఇతర విషయాల గురించి దూరపు బంధువును ప్రశ్నలు అడుగుతాడు పెళ్లిలో పదిమంది కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతుండగా ఒక పెద్దమనిషి తన పక్కన ఉన్నావ్యక్తి గురించి ఆరా తీసి ఏమి చేస్తున్నావు అని అడిగి ఎంతిస్తున్నారు అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి ఎనభై అని సమాధానము ఇస్తాడు "మావాళ్ల తాలూకు కుర్రాడు మీ దాంట్లోనే  పనిచేస్తాడు నలభై అని చెప్పాడే ",అని ఆ పెద్దమనిషి తన పక్కనున్న వ్యక్తిని మోసగాడిగా అసత్య వాడిగా నలుగురిలో ఋజువుచేసి విజయ
గర్వముతో మన కధానాయకుడి వైపు తిరిగి "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే"అంటూ మొదలుపెడతాడు "అవునవును మీకు నా విషయము అంతా తెలుసు గుర్తుకు తెచ్చుకోండి"అని మెత్తగా చురక వేస్తాడు ఇప్పుడు ఏమి చేస్తున్నారు మీకేమిస్తున్నారు లాంటి రొటీన్ ప్రశ్నలు ఎదురవుతాయి కథానాయకుడు ఆ పెద్దమనిషి రిటైర్ అయ్యాడని తెలుసుకొని పెన్షన్ ఎంత అని ఆడుతాడు ఈ విధమైన
ఎదురు ప్రశ్నలు ఊహించని పెద్దమనిషి "ఎదో పెద్దవాణ్ణి అడిగాను చంపక చెప్పవయ్యా "అని బ్రతిమాలుతాడు అప్పటికి లొంగని మన కథానాయకుడు అనుభవజ్ఞులు మీరే చెప్పండి అని తప్పుకుంటాడు చూస్తున్న సభికులు విస్తుపోతారు.

పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఎక్కువజీతాలు తీసుకొనే హోదాకలిగిన వారిని ఎవ్వరు ఈ  ప్రశ్నలు వెయ్యరు ఎంతసేపు మధ్యతరగతి గుమాస్తా ఉద్యోగాలు చేసే వారికే ఈ ప్రశ్నలు ఎదురవుతాయి.అవతలి వారి జీతము తెలుసుకొని వారికో విలువకట్టేసి (జీతాన్ని బట్టి)సంఘములో ఒక స్థానము ఇచ్చేసి మనము నిశ్చింతగా ఉంటాము ఆధునిక యుగములో జీతాల మతము లేవదీశారు పై అధికారి క్రింద అధికారి
మతప్రచారకులు ఇచ్చేవాడు దైవము అదెంతో తెలుసుకునే వారు భక్తులు, జీతము లేనివారు అస్పృస్యులు ఈ విధముగా సమాధానపడటమే అని రచయిత భావిస్తాడు. ఈ విధముగా గడిచిన మూడేళ్ళలో ఉద్యోగమూ పెద్దది అయింది జీతము (ఎవరికీ ఏంతో చెప్పకపోయినా) మూడింతలైంది. జీతము గురించి అడిగేవారు సంఖ్య కూడా పెరిగింది. తక్కువ జీతము అప్పుడు చెప్పటానికి  మొహమాటపడిన ఇప్పుడు జీతము పెరిగినాక చెప్పవచ్చు కదా అని అంటూవుంటారు దానికి సమాధానము ఇంకా ఎక్కువజీతాలు తీసుకొనేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. స్థితిమంతుడు అయినా బాల్య స్నేహితుడు బజారులో కనిపించి కథానాయకుడిని మామూలు క్షేమ సమాచారాలు అడుగుతాడు.జీతము గురించి అడగనందుకు మన కథానాయకుడు సంతోషిస్తాడు పిల్లలు ఒకళ్ళా ఇద్దరా అని అడిగి ఇంటికి తీసుకొనివెళతాడు. బాల్య స్నేహితుడి భార్య ఒకప్పుడు కథానాయకుడికి ఇచ్చి పెళ్ళిచేద్దాము అనుకున్నారు కానీ తగిన అస్తి పాస్తులు లేవని విరమించుకున్నారు.ఆవిడ అతిధి సత్కారాలు పరామర్శలు అయినాక ," ఎంతిస్తారు"అని అడిగేసరికి మన కథానాయకుడికి మతిపోతుంది. "ఏవో రోజులు గడుస్తాయి"అని చమత్కారంగా జవాబిస్తాడు. " నెలకింతా అనిలేదా"అని ఆవిడ రెట్టించిన సమాధానము దొరకదు
తరువాత బాల్య స్నేహితుడితో తన జీతము గురించి చర్చ జరిగినా ఆ స్నేహితుడికి  దొరకదు . చివరికి ఆ  బాల్య స్నేహితుడు సతిసమేతముగా కధానాయకుడి ఇంటికి వెళ్లి అయన భార్యను చూచి కొంత తేరుకొని వెళ్ళిపోయాడు.

మరో మూడు సంవత్సరాలకు జీతము మూడింతలయింది సమకాలీకులకు కధానాయకుడి జీతము ఏంతో తెలిసి పోయింది అయినప్పటికీ అలవాటు చొప్పున జీతము ఎంత అని  అడిగేవాళ్ళు లేకపోలేదు. పాపము ఇచ్చేటందుకు మరో సందేశము లేదు. జీతము ఎంత ,ఇంక్రిమెంట్ వచ్చిందా, రిటైర్ అయితే పెన్షన్ ఎంత ఇవే వారు పాడుకొనే భావ గీతము. ఈ జీతము ఎంతా అని అడగటము కూడా ఒక కళ కొంతమంది ప్రశ్నను సూటిగా అడగకుండా డొంక తిరుగుడుగా అడుగుతారు.రైల్లో ప్రయాణము చేస్తున్నప్పుడు కలిసిన  స్నేహితుడు ఇద్దరికీ తెలిసిన మరో స్నేహితుడి గురించి ప్రస్తావన తెచ్చి అతని పరిస్థితి మీద సానుభూతి చూపించి నువ్వే మాత్రము ఇన్స్యూరెన్స్ చేశావు అని కథానాయకుడిని అడుగుతాడు ఏమిచేయలేదని సమాధానము చెపితే  బోలెడు ఆశ్చర్యపడి బ్యాంక్ బ్యాలన్స్ గురించి అడిగి ఇంకా ఆశ్చర్య
పోతాడు. మరిజీతమంతా ఏమిచేస్తున్నావు గుర్రపు పందేలు లాంటివి ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తాడు. 

నాగరికుల మార్గము ఇది ,మొహాన పేడ నీళ్లు చల్లరు అందులో కాస్త పన్నీరు కలిపి మరీ చల్లుతారు కొత్త ఊరు చేరిన కథానాయకుడికి జబ్బుచేస్తే డాక్టరును కలుస్తాడు ఆ డాక్టరు ,"మీరు ఉరికి కొత్తా "అని అడిగి ఫలానా అని తెలుసుకున్నాక "ఏమిస్తారు"అని అడుగుతాడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పి బిల్లు కట్టకపోయినా ఆయనకు చింతలేదు. "బిల్లు పంపండి" అనిచెప్పి వచ్చేస్తాడు. వీటన్నిటికీ పరిష్కారము సన్యాసము పుచ్చుకోవాటమే అనిపించింది. భార్యకు కూడా మనసు సరిగా లేకపోవటంవల్ల ఒక స్వాములవారి గురించి విని  ఆయనను దర్శించుకోవటానికి తద్వారా ప్రశాంతత పొందవచ్చన్న ఆశతో  భార్యతో సహా  వెళతాడు. ఆ స్వాములవారు ఎక్కడినుంచి వచ్చింది ఏమిచేస్తుంది అడుగగా వినయముగా సమాధానాలు చెపుతాడు మన కథానాయకుడు. "ఏమిస్తారు"అన్న స్వాములవారి ప్రశ్నకు ఒక్కసారి కథానాయకుడు స్తంభించి పోతాడు చనిపోయే అవకాశము ఉంటె అప్పటికప్పుడు చచ్చి పోదామని అనుకుంటాడు . ఈ అనుభవము అతనికి జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది సత్యాన్ని తెలుసుకుంటాడు ఆత్మ శుద్ధి పొందుతాడు సంశాయాలన్ని నశిస్తాయి అదీ ఈ దేశము తనకిచ్చిన సందేశముగా గ్రహిస్తాడు. ఫలితముగా  ఉద్యోగ విరమణ చేసి భార్యతో గోదావరి ఒడ్డున ఒక చిన్న పాక వేసుకొని అవును పెంచుకుంటూ ఎవరితో సంబంధము  లేకుండా  ప్రశాంతంగా జీవించటము ప్రారంభిస్తాడు.
మరిన్ని శీర్షికలు
banana tree