Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌కి విలన్‌గా యువ హీరో!

mahesh VS s.j.surya

మురుగదాస్‌ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ నటిస్తున్న సినిమాకి 'సంభవామి' టైటిల్‌ కన్‌ఫామ్‌ చేశారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎస్‌జె సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఎస్‌జె సూర్య దర్శకత్వంలో మహేష్‌ హీరోగా గతంలో 'నాని' అనే సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ డైరెక్టరే, మహేష్‌కి విలన్‌గా తెరపై గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. ఇంకో వైపున ఈ సినిమా కోసం ఇంకో విలన్‌ని దించుతున్నాడట దర్శకుడు మురుగదాస్‌. తమిళ హీరో భరత్‌ని, మహేష్‌ సినిమాకి మరో విలన్‌గా పరిచయం చేయబోతున్నాడని సమాచారమ్‌. ఈ యంగ్‌ హీరో తెలుగు ప్రేక్షకులకు హీరోగా 'యువ సేన' సినిమాలో నటించాడు. తమిళ నటులు తెలుగు హీరోలకి విలన్‌గా నటించడం కొత్త కాదు.

తమిళ హీరో ఆర్య తెలుగులో 'వరుడు' సినిమా కోసం విలన్‌గా మారాడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రమది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో తమిళ్‌ విలన్‌ల హవా నడుస్తోంది. తాజాగా విడుదలైన 'ధృవ' సినిమాలో తమిళ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో అరవింద్‌ స్వామి విలన్‌గా నటించాడు. టాలీవుడ్‌కి తమిళ్‌ విలన్‌ ఫేవర్‌ ఫ్రెష్‌ ఫీల్‌నే కాకుండా, సక్సెస్‌ని కూడా తెచ్చిపెడుతోంది. సో ఇలా ఇకపై కూడా ఈ తమిళ్‌ విలనిజం కంటిన్యూ అయ్యేలానే ఉంది. ఇక 'సంభవామి' విషయానికొస్తే హీరోగానే కాకుండా విలన్‌గా కూడా మెప్పించగల సత్తా భరత్‌లో ఉంది. నెగిటివ్‌ లుక్స్‌తో అదరగొట్టే కెపాసిటీ ఉన్న యంగ్‌ అండ్‌ డైనమిక్‌ భరత్‌. ఈ కాంబినేషన్‌తో ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా ఫాలోయింగ్‌ పెరగనుంది 'సంభవామి' సినిమాకి. 

మరిన్ని సినిమా కబుర్లు
anupama got lucky chanse