Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
.tollywood

ఈ సంచికలో >> సినిమా >>

చిరంజీవి, వినాయక్‌ 'ఠాగూర్‌' సెంటిమెంట్‌

vinayak act  in kaidi no 150 movie

మామూలుగా చిరంజీవి యాక్షన్‌ చెబితే చిరు నటించాలి. కానీ ఇప్పుడు రివర్స్‌ అయ్యింది. వినాయక్‌ డైరెక్షన్‌లో చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం 150' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వినాయక్‌ ఓ చిన్న రోల్‌లో కనిపిస్తాడట. ఆ సీన్‌కి చిరంజీవి డైరెక్షన్‌ చేస్తున్నారట. గతంలో 'ఠాగూర్‌' సినిమాలో కూడా ఓ సీన్‌లో వినాయక్‌ ప్రత్యక్షమవుతాడు. అలాగే ఓ కీలక సన్నివేశంలో ఈ సినిమాలో కూడా వినాయక్‌ తళుక్కుమని మెరుస్తాడు. చిరు డైరెక్షన్‌లో నటించే అరుదైన అవకాశం తనకి మాత్రమే దక్కిందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు. 'ఠాగూర్‌' సినిమా పెద్ద విజయం సాధించడంతో, ఆ సెంటిమెంట్‌ని చిరంజీవి ఫాలో అవుతున్నారని అనుకోవచ్చు.

సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోగా సెటిలైన తర్వాత సునీల్‌ తొలిసారిగా ఈ సినిమాతో మళ్లీ కామెడియన్‌గా గెటప్‌ మార్చనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌లో ఈ సినిమా పాటలు అదిరిపోనున్నాయి. ఈ నెల్లోనే ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి. విజయవాడలో ఈ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే యోచనలో ఉన్నారట. అన్నట్లు చిరంజీవి 151వ సినిమా కూడా సంక్రాంతికి పట్టాలెక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు దాదాపు ఖరారైనట్లే అని సమాచారమ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
anushka act singam 3  in glamour roal...