Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vinayak act  in kaidi no 150 movie

ఈ సంచికలో >> సినిమా >>

ఆ సినిమాకి అనుష్క గ్లామరే అట్రాక్షన్‌

anushka act singam 3  in glamour roal...

అనుష్క అంటే క్యూట్‌ క్యూట్‌ అందం. ఆ పై కుర్రకారుకి కావల్సినంత గ్లామర్‌ లుక్‌. అయితే 'అరుంధతి' సినిమాకి ముందు అనుష్క, 'అరుంధతి'కి తరువాతి అనుష్క అని రెండు పార్ట్‌లుగా అనుష్క సినీ గ్లామర్‌ లైఫ్‌ని లెక్క వేయచ్చు. 'అంత వరకూ గ్లామర్‌ విషయంలో అస్సలు వెనుకాడని ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత కొంచెం డోస్‌ తగ్గించింది. అందుకు ఆ సినిమా తర్వాత స్వీటీ బ్యూటీకి పెరిగిన ఇమేజ్‌ అలాంటిది. అయితే చాలా కాలం తర్వాత అనుష్క మళ్లీ గ్లామర్‌ ముసుగు వేసుకోనుందట. అది కూడా సూర్య హీరోగా వస్తోన్న 'సింగం 3' సినిమాలో. ఇంతవరకూ వచ్చిన 'సింగం' సిరీస్‌ అన్నింట్లోనూ అనుష్క ఫుల్‌ డోస్‌ గ్లామర్‌ ఒలకపోసింది.

అంతకు మించిన గ్లామర్‌ని ఇప్పుడు 'సింగం 3'లో చూపించబోతోందట. ప్రస్తుతం స్వీటీ 'బాహుబలి ది కన్‌క్లూజన్‌'లో హుందా అయిన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కి పోటీగా కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు చేసేస్తుందట వీరనారిలా. ఇది కాక నాగార్జున హీరోగా, రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో భక్తి రస చిత్రం 'నమో వేంకటేశాయ'లో సాంప్రదాయ దుస్తుల్లో 'ఈశ్వరమ్మ'గా శ్రీనివాసుడి భక్తిలో మునిగి తేలనుంది. ఇదే తరుణంలో 'సింగం 3'కి తన హాట్‌ హాట్‌ అందాల స్కిన్‌ షో చేయనుందట. 'సైజ్‌ జీరో' సినిమాలో బొద్దు అందాల అనుష్కని చూసిన తర్వాత నాజూకు అందాల అనుష్కని చూసేది ఈ సినిమాల్లోనే. అందుకే అనుష్క అందాల్ని తిలకించేందుకు ఆమె అభిమానులు ఎంతగానో ఆశక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే 'సింగం 3'తో వచ్చి, ఆ తర్వాత 'ఓం నమో వేంకటేశాయ'తో మన ముందుకు రానుంది అనుష్క

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam