Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvandi navvinchandi

ఈ సంచికలో >> శీర్షికలు >>

16-12-2016 నుండి 22-12-2016 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో మీ ఆలోచనలను పెద్దలతో పంచుకొనే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశమ్ ఉంది. సంతానపరమైన విషయాల్లో ఊహించని విధంగా ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. పెద్దలతో మీ ఆలచనలు పంచుకొనే ఆస్కారం ఉంది. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, దూరదృష్టిని కలిగి ఉండి, సర్దుబాటు విధానంతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది.  

 



 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులను కలుసుకుంటారు, చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడుల విషయంలో మిశ్రమఫలితాలు పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి వచ్చిన సూచలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ప్రయాణాలు వాయిదావేసుకోవడం సూచన. కుటుంబపరమైన విషయాల్లో కాస్త సర్దుబాటువిధానం కలిగి ఉండుట సూచన. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.  



మిథున రాశి :  ఈవారం మొత్తంమీద అధికారులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది, వారికి సమయం ఇవ్వడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఈ విషయంలో కాస్త అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. సోదరులతో చేసిన చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది, కాకపోతే ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చును. గతంలో మీకు రావాల్సిన ధనమ్ కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. కొంతస్పష్టత లేకపోవడం వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట సూచన.  

 



కర్కాటక రాశి :   ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. మీ మాటతీరు మూలాన నూతన సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. దూరప్రదేశప్రయాణాలు అనుకోకుండా వాయిదాపడే అవకాశం ఉంది. ఆత్మీయుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన వాహనములు కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధచేయకండి. 


 సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో పనిఒత్తిడి ఉంటుంది, ఏమాత్రం ప్రణాళిక లేకపోయిన ఇబ్బందులు కలుగుతాయి. అధికారులతో కలిసి నూతన చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నిర్ణయాత్మకమైన నిర్ణయాల దిశగా ముందుకు సాగుతారు. మానసికంగా మొదటలో ఒత్తిడిని కలిగి ఉంటారు. దృఢమైన ఆలోచనలు కలిగి ఉండుట సూచన. గతంలో మీరు తీసుకున్న మొండినిర్ణయాలు మీకు కొద్దిగా లబ్దిని కలిగించేవిగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ పరమైన విషయాల్లో నిదానంగా ఉండుట సూచన. జీవితభాగస్వామితో ఊహించని విధంగా మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, ప్రయత్నం సానుకూలపడుతాయి.   


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల నుండి ఆశించిన మేర సహకారం లబ్దిని  పొందుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతబలపడే అవకాశం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు సంతృప్తికరమైన ఫలితాలు ఇస్తాయి. మిత్రులతో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం కలదు, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. 

 


తులా రాశి : ఈరోజు మీరు ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం ఆశ్రద్ధ్దతీసుకోకండి. భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. అధికారులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారై సూచనల మేర ముందుకు వెళ్ళండి, మంచిది. కుటుంబపరమైన విషయాల్లో కుటుంబపెద్దల నుండి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సర్దుబాటు విధానం మంచిది.  

 



వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద అనవసరమైన చర్చలకు అవకాశం ఉంది, సమయాన్ని వృధాకాకుండా జాగ్రత్త పడటం సూచన. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, నూతన పరిచయాలకు ఆస్కారం కలదు. చేపట్టిన పనులలో లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న బంధువుల నుండి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడుల కోసం చేయుప్రయత్నాలు కలిసి వస్తాయి. దూరబంధువులను కలుసుకునే అవకాశం ఉంది. వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత వరకు చర్చలకు అవకాశం ఇవ్వకపోవడం సూచన. 



ధనస్సు రాశి : ఈ వారం మొత్తంమీద పెద్దలతో కలిసి చేసిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాల కన్నా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. ముఖ్యంగా స్త్రీ పరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో సర్దుబాటు విధానం మంచిది. జీవితభగస్వామి ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి, ఈ విషయంలో గతకొంతకలాంగా ఎదురుచూస్తున్న ఫలితాలు వస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన మరింత బలపడే ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. 



మకర రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వారి సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే హైరానా పడే ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చుల వలన ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బదులు తప్పకపోవచ్చును. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యక్రమాల గురుంచి చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. అనుకోని అనారోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట సూచన. మధ్యవర్తిత్వం పనికిరాదు, మాటఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.  

 


కుంభ రాశి : ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు చేయుటకు ఆసక్తిని కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. కుటుంబంలో సభ్యుల అలాగే బంధువుల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. దూరప్రదేశప్రయాణాలు చెయవలసి రావోచ్చును. మానసికపరమైన ఒత్తిడి ఉండే అవాశం ఉంది. వృత్తిపరమైన విషయాల్లో బాగాఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. స్త్రీ పరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. నూతన ఓడబండికలు చేసే సమయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు, అనుభవజ్ఞుల సూచనలు పాటించుట మంచిది.   

 



మీన రాశి : ఈవారం మొత్తంమీద సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదాపడే అవకాశము ఉంది. పెద్దలతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వాహనముల విలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. నూతన వాహనములు కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. జీవితభాగస్వామి నుండి ఆశించిన విధంగా సహకారం లభిస్తుంది, విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి.  

మరిన్ని శీర్షికలు
story review