Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
story review

ఈ సంచికలో >> శీర్షికలు >>

వివిధ రకాల నొప్పుల నివారణకు తీసుకోవలసిన ఆహారాలు -పానీయాలు :- - అంబడిపూడి శ్యామసుందర రావు

types of pains treatment

మనిషి అన్నాక ఎదో ఒక రకము నొప్పితో భాధ పడటము సహజము ఆ నొప్పులు తగ్గటానికి బజారులో దొరికే రకరకాల మాత్రలు వాడటం అంతకన్నా నేడు సహజమయిపోయింది ఈ నొప్పుల నివారణకు వాడే మాత్రలు నొప్పికి తాత్కాలిక ఉపశమనాన్ని కలుగజేసి శరీరానికి హాని చేస్తాయని డాక్టర్లే చెపుతున్నారు.అందువల్ల ఎక్కువ పెయిన్ కిల్లర్ మాత్రలను వాడటం అలవాటు చేసుకోవద్దు అని అందరు సలహా ఇస్తారు. కాబట్టి నొప్పిప్రారంభ దశలో ఉన్నప్పుడు  నొప్పి నివారణకు మనకు ప్రకృతి ప్రసాదించిన రకరకాల సహజ పెయిన్ కిల్లర్సును వాడి నొప్పినుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ విధముగా నొప్పులను తగ్గించే సహజమైన పదార్ధాలను కొన్నింటి గురించి తెలుసుకుందాము
1. కండరాల నొప్పిని తగ్గించే అల్లము :- డేనిష్ పరిశోధకులు ఈ మధ్య చేసిన పరిశోధనలలో అల్లము కండరాల నొప్పిని,జాయింట్ నొప్పులను,కండరాల వాపును బిగుతును తగ్గిస్తాయని కనుగొన్నారు. అల్లములోని "జింజరాల్ "అనే పదార్ధనికి నొప్పిని తగ్గించే హార్మోన్లను ఉత్పత్తిచేసే గుణము ఉన్నది.ఒక చెంచా ఎండబెట్టిన అల్లము రసము లేదా రెండు చెంచాల తాజా అల్లము రసము రోజు రెండు నెలల పాటు తీసుకుంటే మంచి ఫలితము కనిపిస్తుంది .

2.పంటి నొప్పిని తగ్గించే లవంగాలు :-  పొడిచేసి లవంగాలు పంటినొప్పికి  జింజివైటిస్ అనే దంతాల వ్యాధికి పురాతన కాలము నుంచి మన పెద్దలుపాటించే మంచి గృహ చిట్కా వైద్యము.క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలులవంగాలనుండి యుజినాల్ అనే ముఖ్య కారకాన్ని వేరుచేసి పంటి నొప్పిని తగ్గించేది ఇదేనని నిర్ధారణ చేశారు ఇదినొప్పిని తగ్గించే ఎనస్తీషియా లాగా పనిచేస్తుంది ఒక పావు చెంచా లవంగాల పొడి రోజు తీసుకుంటే గుండె ఆరోగ్యం బాగుంటుంది రక్తములో గ్లూకోజ్ స్థాయిలను క్రమపరచటంలో తోడ్పడుతుందని,కొలెస్ట్రాల్ శాతాన్ని మూడు వారాలలో లవంగాలు తగ్గిస్తాయాని శాస్త్రవేత్తలు చెపుతున్నారు

3. చెవి పోటును తగ్గించే వెల్లుల్లి :- సహజమైన యాంటీ బయోటిక్ వెల్లుల్లి దీనికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉన్నాయి మెక్సికో స్కూల్ అఫ్ మెడిసన్ పరిశోధకులు రెండు చుక్కల వెచ్చటి వెల్లుల్లి నూనె చెవి పోటును తగ్గిస్తుందని కనుగున్నారు అంతే కాకుండా ఐదు రోజులు వాడితే చెవిలోని ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుందని చెపుతున్నారు వెల్లుల్లి లోని సెలీనియమ్ జెర్మనీయం సల్ఫర్ వంటి ధాతువులు చాలారకాల బ్యాక్టీరియాలకు హానిచేస్తాయి.వెల్లుల్లి నూనె చేయటానికి మూడు వెల్లుల్లి పాయలను ఒక అర కప్పు ఆలివ్ నూనె లో రెండు మూడు నిముషాలు నెమ్మదిగా వేడిచేసి వడపోసి గోరువెచ్చని నూనెను చెవిపోటుకు వాడాలి ఈవిధముగా తయారుచేసిన నూనెను ఫ్రిజ్
లో ఉంచి రెండు వారాల వరకు వాడుకోవచ్చు.

4. తలనొప్పి,కీళ్ల నొప్పులను తగ్గించే చెర్రీ(ఒక తరహా ఎర్రటి పండ్లు) పండ్లు :-రోజు ఓకే చిన్న కప్పు చెర్రీ పండ్లు తింటే  దీర్ఘ కాలంగా
తలనొప్పి,కీళ్లనొప్పులతో భాధ పడేవారికి ఉపశమనము కలుగుతుంని మిచిగన్ స్టేట్  యూనివర్సిటీ వారు కనుగొన్నారు. చెర్రీ పండ్లు ఎర్రగా ఉండటానికి వాటిలోని యాంథోసయానిన్ అనే వర్ణ ద్రవ్యము కారణము ఇది ఇబుప్రోఫెన్ లేదా యాస్ప్రిన్ వంటి యాంటీ ఇన్ఫలమేటరీ పదార్ధాలకన్నా పది రెట్లు శక్తి వంతమైనది. యాంథోసయానిన్ నొప్పిని వాపును కలుగజేసే ఎంజైములను నిస్తేజము చేస్తుంది రోజు ఇరవై చెర్రీలు తింటే మంచిది అని శాస్త్రవేత్తలు చెపుతున్నారు

5. దీర్ఘకాలిక నొప్పులను తగ్గించే పసుపు :-ఇబృఫెన్ ఆస్ప్రిన్ నాప్రాక్సిన్ వంటి నొప్పులను నివారించే మందుల కన్నా పసుపు మూడు రేట్లు
శక్తి వంతమైనది ఆర్థరైటిస్ ఫైబ్రోమియాల్జియా వంటి వ్యాధులతో భాధ పడేవారికి దాదాపు యాభై శాతము ఉపశమనాన్ని కలుగజేస్తుందని కార్నెల్ యూనివర్సిటీ వారు తెలియజేసారు. పసుపులోని కర్క్యుమిన్ అనే రసాయనం నొప్పికి కారణమైన ఎంజైములను పనిచేయకుండా చేస్తుంది ఒక పావు చెంచా పసుపు రోజు తీసుకుంటే దీర్ఘకాలిక నొప్పుల విషయములో మంచి ఫలితము కనిపిస్తుంది.

6.అజీర్తిని తగ్గించే పైనాపిల్ :- పైనాపిల్ లో ప్రోటీన్లను విచ్చినముచేసే ఎంజైములు అధికముగా ఉంటాయి ఈ ఎంజైములు జీర్ణక్రియకు తోడ్పడతాయి.ఫలితముగా జీర్ణక్రియ వేగవంతమవటమే కాకుండా కడుపునొప్పిని గ్యాస్ వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తుంది స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రోజు ఒక కప్పు పైనాపిల్ రసము అజీర్తి వల్ల కలిగే కడుపునొప్పిని మూడు రోజుల్లో తగ్గిస్తుందని కనుగొన్నారు.

7.మైగ్రేయిన్ ను తగ్గించే కాఫీ :-దీర్ఘకాలిక తలనొప్పి లేదా మైగ్రేయిన్ తో భాధపడేవారుకాఫీ త్రాగటం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు. కాఫీ లోని  కెఫిన్ అనే ఆల్కలాయిడ్ కడుపులోని లోపలి పొర మందులను గ్రహించే శక్తిని వృద్ధిచేస్తుంది తలనొప్పికి తీసుకొనే మందుల పని సామర్ధ్యాన్ని 40% వరకు పెంచుతుంది ఫలితముగా తక్కువ మందులు వాడి మంచి ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి తలనొప్పికి వాడే మందులను తప్పనిసరిగా ఒక కప్పు కాఫీతో తీసుకోవాలి,

8. ఛాతీ నొప్పిని తగ్గించే అవిశె గింజలు :- అవిసె గింజలలోని ఫైటో ఈస్ట్రోజెన్ అనే సమ్మేళనము  ఆడవారిలో ఈస్ట్రోజెన్ స్థాయిలలో వచ్చే
మార్పులను నిరోధిస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలలో వచ్చే మార్పులు చాతీ నొప్పికి కారణమవుతాయి. సుమారు మూడు చెంచాల అవిశె గింజలను రోజు వారి  ఆహారానికి కలిపితే ఛాతీ నొప్పి సుమారు 12 వారాలలో తగ్గుతుంది .

9. బిగబట్టిన కండరాలనొప్పిని తగ్గించే టమోటా రసము:-మన శరీరానికి సరిపడా పొటాషియం లభ్యము కానప్పుడు లేదా ఎక్కువ చెమట ద్వారా పొటాషియమ్  ను కోల్పోయినప్పుడు కండరాలు బిగు సు కుంటాయి కండరాల ఆరోగ్యానికి పొటాషియం చాలా అవసరము క్యాలిఫోర్నియా యూనివర్సిటీ వారి పరిశోధనలు రోజు ఒక కప్పు .

టమోటా రసము త్రాగటం వల్ల  బిగుసుకున్న కండరాలు సడలిస్తాయి మళ్ళా తరచుగా కండరాలు బిగుసుకోవు .

10. నోటికి సంబంధిచిన ఇన్ ఫెక్షన్ ను తగ్గించే తేనె :-దుబాయి లోని సెంటర్ ఫర్ హెల్త్ వారు నోటిలోని పండ్లను ,నోటికి సంబంధిచిన ఇన్ ఫెక్షన్ లను నివారించటానికి తేనెను వాడమని సిఫార్సు చేస్తారు. వైరస్ ను నాశనము చేసే యాంటీ ఇన్ఫలమేటరీ ఎంజైమ్స్ తేనెలో ఉన్నాయి. తేనెను నోటిలోని పండ్ల పై నేరుగా రోజుకు నాలుగు సార్లు పుత గా పూస్తే మంచి ఫలితము కనిపిస్తుంది. మిగిలిన రసాయనాలతో చేసిన ఆయింట్ మెంట్ల కన్నా తేనే బాగా పనిచేస్తుంది.

11.సైనస్ నొప్పిని తగ్గించే హార్స్ రాడిష్ దుంప (ఒక రకము ముల్లంగి దుంప):-   సైనసైటిస్  వ్యాధి పుర్రెలోని నాసికా రంధ్రాలు ఇన్ ఫెక్షన్
వల్ల పూడుకుపోవటంవల్ల వస్తుంది దీనివల్ల తీవ్రమైన తలనొప్పిఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది వంటి  లక్షణాలతో చాలా మంది భాధపడుతుంటారు హార్స్ రాడిష్ తినటంవల్ల సైనస్ కురక్త ప్రసరణ పెరిగి ఇన్ ఫెక్షన్ వల్ల ఏర్పడ్డ అడ్డంకులు సైనస్  తొలగించబడతాయి  జర్మన్ పరిశోధకులు కనుగొన్నారు.  సైనసైటిస్ వ్యాధి లక్షణాలు కనిపంచినప్పుడు రోజు కొన్నాళ్ళ పాటు హార్స్ రాడిష్ తింటే ఫలితము కనిపిస్తుంది.

12. గాయాల ఫలితముగా వచ్చే నొప్పులను తగ్గించే నీరు :-మనము బ్రతకాలి అంటే నీరు చాలా అవసరము అన్నది జగమెరిగిన సత్యము మాన్ హట్టన్  కాలేజీ న్యూయార్క్ లోని పరిశోధకులు , నీరు గాయాల ఫలితముగా వచ్చే నొప్పుల నుండి త్వరగా ఉపశమనాన్ని ఇస్తుందని కనుగొన్నారు. గాయాలవల్ల శరీరములోని కణజాలం దెబ్బతిన్నప్పుడు హిస్టమైన్ అనే పదార్ధము ఉత్పత్తి అయి నొప్పిని కలుగజేస్తాయి కానీ నీరు ఈ హిస్టమైన్ ను పలుచన చేసి నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. శరీరములోని కార్టిలేజ్ కణజాలానికి  నీరు అవసరము అంతేకాకుండా నీరు ఎముకల మధ్య లుబ్రికెంట్ గా పనిచేస్తుంది, కాబట్టి జాయింట్ పెయిన్స్ ను నిరోధిస్తుంది అని డాక్టర్లు చెపుతారు. అందుకనే రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి అని డాక్టర్లు సలహా ఇస్తారు.

13. వీపు నొప్పులను తగ్గించే ద్రాక్ష:- ఓహియో యూనివర్సిటీ వారి అధ్యాయనము  ప్రకారము ఒక కప్పు తాజా ద్రాక్ష పండ్ల రసము వీపు భాగములోని దెబ్బతిన్న కణాజాలానికి రక్త ప్రసరణను అధికముచేస్తుంది. మన వెన్నెముక రక్తములోని ఆక్సిజన్,  పోషకాలమీద ఎక్కువ ఆధారపడుతుంది కాబట్టి వెన్నెముకకు రక్తప్రసరణ పెరిగితే సహజముగానే వీపు లేదా వెన్నెముక నొప్పి తగ్గుతుంది.

14. కండరాల నొప్పిని తగ్గించే పుదీనా(మింట్) ఆకులు:- సరిగా కూర్చోకపోవటం లేదా  సరిగా నుంచోకపోవటం వల్ల కండరాలపై అనవసరమైన ఒత్తిడి కలిగి కండరాల నొప్పులు ప్రారంభమవుతాయి. అప్పుడు పాదిచుక్కల పుదీనా నూనె ను వేడి నీటికి కలిపి స్నానంచేస్తే కండరాల నొప్పినుంచి ఉపశమనము కలుగుతుంది. ఇది మాములుగా వాడే నొప్పినివారణ మందులకన్నా 25% అధికముగా  ఇస్తుంది. వేడినీరు కండరాల సడలింపుకు పుదీనా నూనె నొప్పిని తగ్గించే నాడీవ్యవస్థకు  సహాయపడుతుంది

15. కాలిగోళ్ళ నొప్పులను తగ్గించే ఉప్పు:- సాధారణముగా చాలా మంది కాళీ గోళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల నొప్పితో తరచుగా భాధ పడుతుంటారు అటువంటప్పుడు కొద్దిగా ఉప్పుకలిపిన నీటిలో కాళ్ళను గోళ్లు పూర్తిగా నీటిలో మునిగేటట్లు కొంచెము సేపు ఉంచితే గోళ్ళ మధ్య ఉండే ఇన్ఫెక్షన్ పోతుంది నొప్పి తగ్గుతుంది . ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటె రోజుకు రెండు సార్లు ఈరకంగా చేస్తే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుంది. ఇంతే కాకుండా ఉప్పు జింజివైటిస్ అనే దంత వ్యాధిని తగ్గించటానికి కూడా ఉపయోగపడుతుంది.కొద్దిగా ఉప్పు కలిపినా నీటిని పుక్కిలిస్తే మంచి ఫలితము ఉంటుంది. అదేవిధముగా గొంతు నొప్పితో భాధపడేవారు కూడా ఉప్పినీటిని పుక్కిలిస్తే ఉపశమనము పొందుతారు.

16. ఎండోమెట్రియాసిస్ ను తగ్గించే ఓట్స్ ధాన్యము :-ఆడవారిలో సాధారణముగా గర్భాశయము లోపలి వైపు పెరగవలసిన కణజాలం కొన్ని సందర్భాలలో బయటివైపు పెరగటాన్ని ఎండోమెట్రియాసిస్ అంటారు దీనివల్ల పీరియడ్స్ సమయాలలో తీవ్రమైన నొప్పికి లోనవుతారు. ఓట్స్ లోఇన్ఫ్లేషన్ ను కలుగజేసే  గ్లూటెన్ అనే పదార్ధము ఉండదు కాబట్టి ఆహారములో ఓట్స్ అధికముగా ఉండేటట్లు చూసుకుంటే దాదాపు 60% నొప్పి సుమారు ఆరు వారాలలో తగ్గిపోయే అవకాశము ఉంది.

17. కడుపు నొప్పిని తగ్గించే చేప :-అజీర్తి, ఆహారనాళములో ఆహారము కదలికలో ఇబ్బందులు,ఎంటైరైటిస్ వంటి జీర్ణకోశ ఇబ్బందులను చేపలను ఆహారముగా తీసుకోవటము ద్వారా తగ్గించుకోవచ్చు. చేపలలోని ఒమేగా -3  అనే క్రొవ్వు ఆమ్లము జీర్ణాశయ కండరల కదలికలో ఇబ్బందులను తగ్గిస్తుంది. అందుకే డాక్టర్లు ఇచ్చే మందులలో కూడా ఒమేగా-3 ఉంటుంది. ఈ క్రొవ్వు ఆమ్లాలకు గల యాంటీ ఇంఫలమేటరీ గుణాల వల్ల  జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయటానికి దోహదపడతాయి.

18.PMS(పోస్ట్ మెనుస్ట్రల్ సిండ్రోమ్) ను తగ్గించే యోగర్ట్ (పాలను పులియబెట్టి తయారుచేసే పెరుగులాంటి పదార్ధము):-దాదాపు 80% మంది  ఆడవారు బహిస్టు సమయాలలో లేదా  బహిస్టు కు ముందు నొప్పితో భాధపడుతుంతయారు. బహిష్టు సమయాలలో విడుదల ఆయె హార్మోనులు నాది వ్యవస్థపై ప్రభావాన్నిచూపి ఈ రకమైన నొప్పికి కారణమవుతాయి. కొలంబియా యూనివర్సిటీ వారి అధ్యయనంలో రోజు
రెండు సార్లు యోగర్ట్ తీసుకుంటే ఈ నొప్పి దాదాపు 50% తగ్గుతుంది యోగర్ట్ లోని క్యాల్షియమ్ నాడీవ్యవస్థకు ఉపశమనాన్ని కలుగజేసి నొప్పులనుండి ఆడవారికి ఉపశమనాన్ని కలుగజేస్తుంది.

19. యాసిడ్ రిఫ్లక్స్ ను తగ్గించే యాపిల్ సిడార్ వెనిగర్(యాపిల్ పళ్ళను పులియబెట్టి తయారుచేసే పానీయము):-ఈ వెనిగర్లోని ముఖ్య పదార్ధాలు మ్యాలియాక్ ఆమ్లము, టార్టారిక్ ఆమ్లము యాసిడ్ రిఫ్లక్స్ ను నయము చేస్తాయి ఇవి జీర్ణక్రియను వేగవంతము చేసి శరీరములోని మాంసకృత్తులు క్రొవ్వులను విచ్చిన్నము చేస్తాయి ఫలితముగా అంలాలు ఎక్కువగా  అవవు.  రోజు ఒక చెంచా
యాపిల్ సిడర్ వెనిగర్ ను ఒక కప్పు నీటిలో కలిపి తీసుకుంటే ఇరవై నాలుగు గంటలలో ఈ యాసిడ్ రిఫ్లక్స్  తగ్గుతుంది.

మరిన్ని శీర్షికలు
sampenga puvvu story review