Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
types of pains treatment

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారి కధ - అంబడిపూడి శ్యామసుందర రావు

sampenga puvvu story review

శ్రీ త్రిపురనేని గోపీచంద్,కవి సంఘ సంస్కర్త అయిన కవిరాజు రామస్వామి చౌదరిగారి కుమారుడు. జననము సెప్టెంబర్ 8,1910, మరణము నవంబర్ 2,1962. చదివింది బి.ఎల్ అయినా న్యాయ వాద వృత్తిలో ప్రవేశించలేదు. ఎమ్. ఎన్.రాయ్ గారి రాడికల్ హ్యూమనిజం వలన ప్రభావితుడై రాడికల్ హ్యుమానిస్ట్ గా అవతారమెత్తాడు రాడికల్ డెమొక్రటిక్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్  శాఖకు సెక్రటరీగా పనిచేశాడు. ఆకాలంలోనే మార్క్సిజమును బాగా గ్రహించనవాడు. కధలు నాటికలు, నవలలు  ,వ్యాసములు,రేడియో నాటికలు అనేకము వ్రాసినవాడు. రైతు
బిడ్డ గృహప్రవేశము వంటి సినిమాలకు సంభాషణ రచయిత గాను,లక్షమ్మ,ప్రియురాలు వంటి సినిమాలకు దర్శకుడిగానూ పనిచేసినా బహుముఖ మేధావి.ఈయన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వములో డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ గా పనిచేశారు    ఈయన రచనలు సునిశిత హాస్యముతో కూడీఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి. ఈయన నవల "పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ"  సాహిత్య అకాడమీ అవార్డు ను గెలుచుకుంది." అసమర్ధుని జీవిత యాత్ర "నవల బహుశా తెలుగులోని మొదటి మానసిక విశ్లేషణకు సంబంధిచిన నవల అని చెప్పవచ్చు ఈ నవలను పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలకు అప్షనల్ సబ్జెక్ట్ తెలుగు సాహిత్యము సిలబస్ లో చేర్చబడింది.ఈయన
గౌరవార్థము శతజయంతి ఉత్సవాలప్పుడు కేంద్ర ప్రభుత్వము పోస్టల్ స్టామ్పు విడుదల చేసింది.

ప్రస్తుతము ఆయన కధ "సంపెంగ పువ్వు"గురించి ముచ్చటించుకుందాము ఒక స్త్రీ బాగా చదువుకొని నవీన విధానము లో ముందడుగు వేసి ఉత్సాహముగా సాంఘిక వ్యవహారాలు నడుపుతూ ఉంటె పట్టణాలలో ,పెద్ద నగరాలలో ఆమె నడవడిని హర్షిస్తారు కానీ పల్లె కాకుండా పట్టణము కాకుండా ఉండే చిన్న ఊళ్లకు వచ్చిమగవాళ్ళతో చనువుగా ఉండి వెళ్ళిపోతే ఏర్పడే తగవులను ఈకధలో రచయిత చాలా చక్కగా వివరిస్తాడు. ఆమె మీద అభిమానముగల వ్యక్తులు ఒక్కొక్క స్థితిలో ఎలా ప్రవర్తిస్తారు. ఈ తెలిసిన ఆమె ఏమిచేస్తుంది అన్న విషయాన్ని సంపెంగ పువ్వులో రచయిత గుబాళిస్తాడు.

శాస్త్రి అనే  స్నేహితుడితో బొంబాయి నుంచి వస్తున్నా శాస్త్రి స్నేహితురాలిని రిసీవ్ చేసుకోవటానికి రచయితకూడా రైల్వే స్టేషన్ కు
వస్తాడు. స్నేహితుడు శాస్త్రి ఆ వచ్చే ఆవిడను గూర్చి చెపుతూ "బలే మనిషి"అని చెపుతూఉంటాడు అటువంటి  ఆడమనిషి ప్రస్తుతము  మన సంఘములో ఉండరని . ఉంటె గింటే రష్యా లాంటి దేశములో ఉండవచ్చు అని చెబుతూ ఉంటాడు.ఆవిడ భర్తను " కామేశ్వరుడు" అని పేరు  పిలుస్తుందని ,ఆవిడకు ఒక మగపిల్లవాడు, ముగ్గురు ఆడపిల్లలని చెబుతాడు. సాగుదారణ ఆడవాళ్లకు మల్లే  గొప్పగా భావించుకుంటున్న
భలే మనిషికి కూడా పిల్లలు అన్న నిజాన్ని రచయిత భరించలేకపోతాడు. వారి నిరీక్షణలో రైలు రావటము ఆవిడ మూడో  తరగతినుండి దిగటం ఇద్దరు చూస్తారు. వెళ్లి రిసీవ్ చేసుకుంటారు. ఆవిడ ఎప్పుడు మూడో తరగతిలోనే ప్రయాణము చేయటానికి ఇష్ట పడుతుందని శాస్త్రి చెబుతాడు ఓవర్ కోట్ వేసుకున్న స్త్రీ కి శాస్త్రి రచయితను తన స్నేహితుడు శరత్ చంద్రభాబు అని కధలు వ్రాస్తుంటాడని ఆవిడకు పరిచయము చేస్తాడు. "మీ కదలూ చదివాను బాగుంటాయి"అని కితాబు కూడా ఆవిడా ఇస్తుంది ఆవిడ శాస్త్రి ఇంట్లోనే బస చేస్తుంది.
మర్నాడు ఆవిడను కలవటానికి వెళదామా వద్దా అన్న ఆలోచనలో ఉండగా శాస్త్రి వచ్చిఆవిడే తనను పిలుచుకు రమ్మంది అని శాస్త్రి చెప్పగా "ఎందుకు"అని బింకంగా ప్రశ్నించినప్పటికీ శాస్త్రితో పాటు ఆవిడను కలవటానికి శాస్త్రి ఇంటికి చేరుతాడు అప్పటికే ఇతర స్నేహితులు ఉళ్లోని కుర్రకారు కొంతమంది వచ్చి ఆవిడతో కబుర్లు చెపుతున్నారు.

ఆవిడ తన అనుభవాలను కధలు కధలుగా చెపుతు చివరికి తనకున్న అనుభవంలో పదోవంతు కూడా ఎవరికీ లేదని చెప్పేసరికి అందరికి అంగీకరించ తప్పలేదు. కాబట్టి మీ అందరికి తల్లిలాంటిదాన్ని అనేసరికి కొందరు తెల్లబోయారు, కొందరు సిగ్గుపడ్డారు ,కొందరు వెకిలిగా నవ్వారు. ఆమె అన్ని విషయాలమీద (సెక్స్ మీద కూడా ) ఫ్రీగా మాట్లాడుతుంటే కిక్కురుమనకుండా కుర్రాళ్ళు ఊ కొట్టటంకూడా మానేసి వింటున్నారు కొంచెముసేపు చర్చల అనంతరము ఆవిడ అందరితోపాటు కాఫీ హోటల్ కు బయలుదేరింది. వీళ్ళు దారిన వెళుతుంటే జనము
విచిత్రముగా చూస్తూ హేళనగా మాట్లాడుకోవటం వీళ్ళ చెవిన పడ్డాయి.కానీ వాటిని ఆవిడ ఏ మాత్రము పట్టించుకోలేదు. సాయంత్రము పార్కుకి వెళ్లినా ఇదే పరిస్థితి మ్యూజియంలో వింత వస్తువుల్ని చూసినట్లు జనము వీళ్ళను చూడటము ఇంకో విశేషము ఏమిటి అంటే ఆవిడ  ఆడవాళ్ళతో మాట్లాడటానికి బాగా సిగ్గుపడేది. ఎందుకంటే ఆడవాళ్లు రొటీన్  గా వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ఆవిడకు ఇబ్బంది కాబట్టి. భోజనాలు అయినాక రాత్రి నడిచి సినిమాకు పోదామని రచయితతో బయలుదేరుతుంది నడుస్తూ,"మీ వూరు చాలా వెనక బడి వుంది వూరు అంటే ఊళ్లోని మనుషులు మీరు ఈ వూళ్ళో ఎలా బ్రతుతున్నారో ఒకరితో మాట్లాడితే మరొకరికి కోపము ఈర్ష్య,వూళ్ళో వాళ్లకు అన్ని ప్రిమిటివ్ లక్షణాలే ప్రతి భార్య తన భర్తని ఇతర స్త్రీల నుండి కాపాడుకోవటమే తన ధర్మము అన్నట్లుగా నటిస్తుంది మీరంతా
మాంధాత యుగములో ఉన్నారు,"అని ఆవిడా తన అభిప్రాయాలను రచయితతో పంచుకుంటుంది. ఆ మాటలు యదార్ధాలని తెలిసినా రచయిత ఏమి  మాట్లాడలేకపోతాడు,"మీరుచాలా మందికంటే తెలివిగలవాళ్ళుఅందుకని మిమ్మల్ని చూస్తూ ఉంటె నాకు ముచ్చటగా ఉంది కానీ మీ చుట్టు ఉన్నసంఘము వల్ల ఇక్కడ ఉండి చెడిపోతున్నారు మీరు ఇక్కడ ఒక స్త్రీల క్లబ్బు ఏర్పాటుచేసి కొంచము కలిసి  మెలిసి తిరిగేటట్లు చేస్తే ఈ సమాజము  మారుతుంది," అని రచయితకు సలహా ఇస్తుంది ఆవిడ. ఆమె మాటలకు సమాధానము చెప్పకుండా రచయిత ఆలోచనలో పడతాడు ఇంటికి వచ్చినాక ఆవిడ  తనకు చార్లెస్ బోయర్ (హాలీవుడ్ నటుడు).తన భర్తకు గ్రేటాగార్బో(హాలీవుడ్ నటి) ఇష్టమని చెపుతుంది. ఆ తరువాత ," ఇక నేను బొంబాయి వెళ్ళిపోతాను నేను ఉండలేక పోతున్నాను మీరంతా ప్రిమిటివ్ పీపుల్
నాలుగు వందల ఎల్లా క్రిందటి జీవితాన్ని గడుపుతున్నారు రేపే బొంబాయి వెళ్ళిపోతాను,"అని ఆవిడా తన నిర్ణయాన్నితెలుపుతుంది రచయితకు ఆవిడా ఇంకా కొన్నాళ్ళు ఉంటె బావుండు అనిపిస్తుంది అదేమాట ఆవిడతో అన్నా ఆవిడా ఒప్పుకోదు మర్నాడు ఆవిడను స్నేహితులు అందరు రైలు ఎక్కిస్తారు. ఆవిడ పరిచయము రచయితా జీవితాన్నే మార్చెసింది మనిషిలో హుషారు ఎక్కువ అయ్యింది.
కధలు వ్రాయాలని ఉపన్యాసాలు ఇవ్వాలని పది మంది మెప్పు పొందాలన్న అపేక్ష కలిగింది ,అన్నింటికన్నా పెద్ద మార్పు వీలు చిక్కినప్పుడల్లా శుభ్రముగా తోముకోవటము,అందముగా ఆకర్షీణీయము కనిపించాలి అన్న ఆలోచన, అలాగే అడా మగ కలిసి తిరిగితే పాడైపోతారన్న అపోహ  తొలగిపోవటము వంటి మార్పులు రచయిత సంభవించాయి.

ఒకరోజు ఆవిడ గురించి స్నేహితులతో ముచ్చటిద్దామని శాస్త్రి ఇంటికి రచయిత వెళతాడు. అప్పటికే శాస్త్రి ఇంట్లో మిగతా స్నేహితులందరూ చేరతారు.వాళ్ళు అప్పటికే ఆవిడా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆవిడను బొంబాయినుంచి ఒకసారి పిలిపించి ఆవిడ ఆధ్వర్యము లో మహిళా సంఘాన్ని ఏర్పాటుచేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు స్నేహితులు చెపుతారు దానికి రచయితను ఆవిడకు ఉత్తరము వ్రాయమంటారు.  అంతవరకూ బాగానే ఉంటుంది ఆతరువాత స్నేహితులు తలా ఒక మాట రచయితకు ఆవిడకు గల స్నేహాన్నివ్యంగముగా హేళనగా మాట్లడుతారు ఆ మాటలకు మిగిలినవాళ్లు విషపు నవ్వులు నవ్వుకుంటుంటారు.

ఇవి విన్న రచయిత కొద్దిగా బాధతో ఇంకా చర్చ ఆపమంటాడు. కానీ శాస్త్రి ," వాళ్ళు అన్న దానిలో తప్పేముంది మీఇద్దరు సినిమాలకు తిరగ లేదా నువ్వంటే ఆవిడకు మా అందరికన్నా ఇష్టము కాదా ? మగ అడ అన్నాక కలిసి తిరగటము మొదలు పెట్టినాక "అని అర్ధోక్తిలో ఆపుతాడు రచయిత శాస్త్రిని ఆపమని గద్దిస్తాడు కానీ శాస్త్రి ఆవిడేమన్నానంగనాచా అని కామెంట్ చేస్తాడు రచయితకు కోపము ఎక్కువ అయినకొద్దీ శాస్త్రికి చిలిపితనం ఎక్కువ అవుతుంది. ఇక పెరుగుతున్న కోపాన్ని ఆపుకోలేక రచయితా శాస్త్రి పై పిడి గుద్దులు కురిపిస్తాడు మిగిలిన స్నేహితులు శాస్త్రిని రచయిత బారి నుండి కాపాడుతారు శాస్త్రి,"నీకు పిచ్చెక్కింది",అని అంటాడు. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి తిరిగినంత మాత్రాన ఆ స్త్రీ చెడిపోయినట్లు భావించే మనుషులకుతగిన బుద్ధి చెప్పాను అన్న భావన రచయితకు తృప్తినిస్తుంది, సంతోషము కలుగుతుంది. ఈ విధముగా కొంతమంది మనుషులు ఎంత నీచముగా ఆలోచిస్తారో  ఆవిడకు తెలిస్తే ఆవిడ మనస్సు ఎంత భాధపడుతుందో అన్న ఆలోచనతో రచయితా ఆవిడకు ఈ విషయాలు ఏవి వ్రాయకూడదని నిర్ణయించుకుంటాడు ఈ  సంఘటన జరిగిన వారానికి ఆవిడ దగ్గరనుంచి రచయితకు ఉత్తరము వస్తుంది శాస్త్రి జరిగిన విషయాన్ని ఉత్తరము ద్వారా తెలియజేయటమే ఈ ఉత్తరానికి కారణము. "ఇవ్వాలే  శాస్త్రిదగ్గరనుంచి  ఉత్తరము వచ్చింది.ఆ ఉత్తరంలో అయన ఏమి దాచకుండా జరిగిన విషయాలను పూర్తిగా వ్రాసాడు అతడేమి అబద్దాలు వ్రాయలేదు తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఏమి ప్రయత్నము చేయలేదు అతని ఉత్తరము చదువుతుంటే ఒక అపరాధ పరిశోధక నవల చదువుతున్నట్లుంది. మీరు నా హానర్ డిఫెండ్ చేయటానికైనా శాస్త్రితో పోట్లాడింది నిజంగా అ దృశ్యము ఊహించుకుంటే నాకు సినిమాల్లోని స్టెంట్ క్వీన్ నాడియా  మీద అభిమానము పెరిగింది మీరు చూపించిన పరాక్రమాన్ని స్వయముగా వచ్చి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉంది,

కానీ మిమ్మల్ని ఒక్కమాట అడగాలనిపిస్తుంది దానికి  మీరు సవ్యముగా జవాబు చెపితే మీ ముందు వాలి నా కృతజ్ఞతలు తెలిపే సీన్
యాక్టు చేసి  నేను నంగనాచి ఆని మీకెట్లా తెలిసింది?మీరు నన్ను గురించి అలా అనుకోవటానికి  నా మాటలు గాని చేష్టలు గాని అటువంటి అవకాశాలు కల్పించాయా?ఎందుకంటే నేను నంగనాచిని కాను శాస్త్రి నిజమే చెప్పాడునాకు నాగనాచిని కావాలనే అపేక్ష కూడాలేడుమీరు నన్ను అపార్థము  చేసుకోవద్దు ఉన్న సంగతి ఉన్నట్టుగా చెపుతున్నాను మీరు చూపించిన పరాక్రమానికి నాకు ఒక అనుమానము వస్తుంది.అది ఆడవాళ్లను రక్షించే భాద్యత పురుషులదే అన్నట్టుగా మీరు ప్రవర్తించారని. ఇది స్త్రీ పురుషుడి అష్టి అనే అభిప్రాయానికి
దగ్గరగా ఉంది. మీకు శాస్త్రి లాంటి వాళ్లకు ఈ విషయములో తేడా ఏమిలేదు. మీ ప్రవర్తన వేరు మీ రచనలు వేరుగా ఉన్నాయి. సాధారణ రచయితలలో ఉండే బలాలు,బలహీనతలు ఉద్రేకాలు అన్ని మీలో ఉన్నాయి. మీరు మారాలి  మీలో ఇన్ని బలహీనతలు ఉన్నా మీరంటే నాకు ఇష్టము అందుకే మిమ్మల్ని బాగుచేయాలన్న కోరిక నాలో బలంగా ఉంది.మీరు లేడి క్లబ్ స్థాపించి దానికి మీరే సెక్రెటరీగా ఉండి
 నడిపించండి ఇక సెలవు నేను మనసు ఇచ్చి రాయదలచుకున్నదంతా రాశాను నచ్చాలని నాకోరిక సంపెంగ పువ్వు కేవలము వాసన చుట్టానికేనా  ఇట్లు ,మీ ----  గమనిక :- శాస్త్రి ఉత్తరాన్ని కామేశ్వరుడు (భర్త )చూసి పడి పడి నవ్వాడు.

ఆ ఉత్తరము చూసినప్పటినించి కామేశ్వరుడికి మీమీద చాలా ప్రేమ కుదిరింది. ఈ ఉత్తరము చదువుకున్న రచయిత ఏమయ్యాడో తెలుసుకోవాలని ఉందా? - నెల రోజులు ఖాయిలా ( జబ్బు)  పడ్డాడు.

మరిన్ని శీర్షికలు
tamarind tree