Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sampenga puvvu story review

ఈ సంచికలో >> శీర్షికలు >>

‘యమదూతిక ‘- అనే చింత చెట్టు. - హైమాశ్రీనివాస్.

tamarind tree

"అమ్మాయ్! అరుణా! కాస్త పాత చింతకాయ పచ్చడి ఉంటే పెట్టమ్మా! తాతగారికి జ్వరం వచ్చి నిమ్మళించింది.  ఈరోజు పత్యము పెడదామనుకుంటున్నానమ్మా! నోటికి రుచిగా ఉంటుందని  చింత కాయ పచ్చడి,మెంతు లేసి చేద్దామనుకుంటున్నాను. నీకూ తెచ్చి స్తాలే"అంటూ పక్కింటి పార్వతమ్మ బామ్మగారు అడగ్గానే " దాందేముంది , బామ్మగారూ ! మాఅమ్మ తెచ్చి ఇచ్చిన చింత కాయ తొక్కు అలాగే ఉంది. నాకు చేయనే సమయం చిక్కట్లేదు. తాతగారి పుణ్యమాని నాకూ మీ చేతి పచ్చడితో చవిచెడి ఉన్న నోటికి కాస్తంత రుచి తెలుస్తుంది. మా వారికీ చాలా ఇష్టం " అంటూ ఒక గిన్నె నిండా ఇచ్చింది. " అమ్మాయ్ ! మధ్యాహ్నం ఉంటావు గా ఈరోజు ఆదివారమేగా ! ఉత్తన్నం వండుకో, నేను ఉదయా న్నే కూరలమ్మి వద్ద చింత చిగురు కొన్నాను. కాస్తంత చింత చిగురు పొడీ, మరికాస్త , చింత చిగురు వేసి కందిపప్పూ చేస్తున్నాను. మినప వడియాలూ, అప్పడాలూకూడా వేయిద్దా మనుకుంటున్నాను. మరేమీ వండుకోకు. పచ్చానికి ఎన్నున్నా పాతచింత కాయ తొక్కు దొరుకుతుందా చెప్పు, వస్తానమ్మాయ్! తాతగారు పెందలడే కాస్తంత ఎంగిలి పడతారేమో!మూడ్రోజులైందమ్మా అన్నం తిని." అంటూ వెళ్ళారావిడ. 

ఎన్నున్నా పాతచింత కాయ పచ్చ డి రు చే వేరు. పత్యానికీ అదే ముఖ్యం. పాతచింత కాయపచ్చడని  పాత వాళ్ళను అదే ముస లోళ్ళను పక్కకు తొక్కేస్తారు. వారి అనుభవంతో చెప్పే మాటా, పాత చింతకాయ పచ్చడి ఆరోగ్య రహస్యమూ ఈరోజుల్లో ఎవ్వరికీ పట్టవు. నవీనం కదా అంతానూ.!

‘చింత’కు చాలా పర్యాయపదాలున్నాయి తెలుగులో.ఆమ్లీ,ఆంలీక, చించ, చుండము, చుక్ర, చుక్రిక, తింతిడము, తింతిడి, తింతి లీకము, తింత్రిణి, యమదూతిక ఇలా ఉన్నాయి అనేక పేర్లు.సంస్కృతంలో ‘చించ’ అంటారు. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అని కూడా అంటారు. ఇది ‘ఫాబేసి ‘కుటుంబంలో ,’సిసాల్పినాయిడే ‘ఉప కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ‘టామరిండస్ ఇండికా’.చింతపండును మనం ఆంగ్లంలో ‘ట్యామరిండ్ ‘అంటాం కదా!

చింత చెట్టు మొత్తం మనకు ఎంతో ఉపయోగిస్తుంది. వేసవికి ముందే చింత చిగురు వస్తుంది , దాంతో చింత చిగురుపొడీ ఉల్లి పాయ వేసి ,వెల్లుల్లి వేసీ చేస్తారు. కమ్మని వాసనతో నోరూరి ఆకలి పుట్టుకొస్తుంది.చింత పూలు పిందెలై నపుడు,ఆచింత పిందెల తోనూ పచ్చడి, పప్పు చేస్తారు , చింత చిగురుతో చేసినట్లే.ఆపిందెలు పెరిగి పెద్దవై చింత కాయలు, అవి ముదిరి పండాక చింత పండ్లు  కోసి ఎండ వేసి మార్కెట్లో మనకు అన్నికాలాల్లో పులుసు, చారు, పచ్చడి, పులిహోర ఇంకా అనేక కూరల్లోకి వంట గదిలో రాణిలా చేరుతుంది చింతపండు.చింతలు తీర్చే చింత ఇది.ఇది వంటగదిలో ఉంటే గృహిణీ దాంతో ఏదో ఒకవంటకంఇట్టేచేసేస్తుంది. 

నేడు ప్రపంచ స్థాయిలో చింతపండు తెలీని దేశమే లేదు. అదిలేనీ వంటగదే ఉండదు. ఇది పెద్ద వ్యాపార పంటగా ఉత్పత్తి చేయ డం జరుగు తున్నది. ప్రపంచ వ్యాప్తంగా నేడు వంటకాల్లో అంతా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతున్నది.  చింత చిగురు సమయంలో చెట్టు పచ్చగా కనువిందుగా ఉంటుంది.పూలు పూచి నపుడూ పచ్చగా ఎర్రగా నిండుగా పూలతో పెద్ద ముత్తైదువులా ఉంటుంది. పిందెల సమయంలో అదో అందం , పిందెలు కాయలై క్రిందకు వేలాడుతుంటే చిన్న కొడవళ్ళలా పచ్చ గా ,అవిపండాక ఆపండ్లు గుల్లబారి కాస్తంత ఎర్రగా నిండా ఉంటే ఇంటినిండా పిల్లలున్న గృహిణిలా ఉంటుంది చింతచెట్టు. దీనిగాలి చల్లగా ఉంటుంది. పండ్లు కాస్తంత ఎరుపుతో కూడి ఉంటాయి.చింత పండ్లను సాంప్రదాయ ఔషధాలు మరియు మెటల్ పోలిష్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. చింత చెక్కను వడ్రంగం పనుల్లో, కొన్ని రకాల కొయ్య వస్తువులు చేయను వాడుతారు.

ఈ చింత చెట్టు అధిక ఉపయోగాలను గమనించి ప్రస్తుతం దీన్ని అధికంగా వ్యాపారపంటలా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ,ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు.పూర్వం అడవుల్లో , గ్రామ ప్రాతల్లో మాత్రమే ఉండేవి. రహదారులకు ఇరు వైపులా వీటిని ప్రయాణీకులకు నీడ నివ్వను వేసేవారు. చింతచెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. వేసవికాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తుంది. ఇది బాగా ఎత్తుగా పెరిగే వృక్షం, లావైన కాండం, నల్లటి బెరడు కలిగి  వుంటుంది.చిన్న చిన్న ఆకులు గుత్తులుగా వుంటాయి. పూలు మూడు రెక్కలతో పసుపు రంగులో  ఉంటాయి దీని కాయలు పొడవుగా ,మందం గా, పసుపుకూడిన గోధుమ రంగులో వుంటాయి,రుచి పుల్లగా వుంటుంది. రోటి పచ్చడిగానూ  ,ఊరగాయగా నూ ,కూరల్లోను దీన్ని ఉపయోగిస్తారు.దీని చెక్క వ్యవసాయ పనిముట్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.సాంప్రదాయక అద్ద కాలలో పసు పు రంగు కోసం దీని ఆకులు వాడుతారు. దక్షిణ భారత దేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకా ల పులుసులు, పచ్చడిలో చింతపండు రసం పుల్లని రుచి నిస్తుంది.
తెలుగు భాషలో చింత పదానికి వివిధ పద ప్రయోగాలున్నాయి. చింత అంటే వగపు, తలంపు,బాధ, వ్యాకులము ఇలా మొదలై న అర్ధాల్లో వాడతారు.పెంకుతో వున్న చింతపండును చింతగుల్ల అనీ,కాయని చింతకాయ అని,పండును చింతపండు అని అంటా రు. చింతనాగు ఒక విషసర్పం . దీని శరీరం మీద చింతపువ్వు మాదిరి గుర్తులుంటాయి.అందుకనే ఆపేరుతో పిలుస్తారు. ఫిలిప్పైన్స్లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు. చింతపండు పులుసు పుల్లగా ఉంటుందికనుక చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు.దీనిని కూరల్లోనూ, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో అధికంగా వాడుతున్నారు. ఆసియాలో చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేచ్చేందుకై వాడుతున్నారు. ఈజిప్టులో చింత పండు రసం చల్లని పానీయంగా త్రాగుతారు.థాయిలాండ్ లో ఒకరకం తియ్యని చింత పండును ఇష్టంగా తింటారు.

చింత పిక్కలు అంటే చింత గింజలను బిస్కట్ ల తయారీలో వాడుతున్నారు. చింత గింజలను రైతుల నుండి కొని,వాటిని పొట్టు తీసి యంత్రాలద్వారా మెత్తటి పొడిగాతయారు చేస్తారు.దానిని బిస్కెట్ తయారీ లోనూ,ఇతర ఆహార పదార్థాల తయారీల్లోనూ వాడు తారు. ఎక్కువగా జిగురు తయారుచేయడానికి దీన్ని వాడు తున్నారు. వెల్లుల్లి వేసిన ఎండిన చింతాకు పొడికూడా వేడి అన్నంలో కలుపుకుతింటే రెట్టింపు అన్నంలోనికెళుతుంది, ఎండు చింతాకును కాకర కాయ చేదుపోను కలిపి వండుతారు . చిన్న చింతబెత్తంతో పూర్వం పాఠశాలల్లో పిల్లల్ని చదవకుండా వచ్చినా, బడికి గైర్ హజరైనా , క్లాసు లో అల్లరిచేసినా, దండించ ను పంతుళ్ళు పిల్లలను ఈ చింతబరికతో కొట్టేవారు.చర్మం మీద వెంటనే వాతలుపడి చాలా నొప్పి పుట్టేది, ఆచింతబరిక చూడగా నే పిల్లలు భయంతో పారిపోయేవారు.నేడు పిల్లల్నికొట్టడమే నేరం కనుక 'చింతబరిక'తెరమాటుకెళ్ళిపోయింది.

చింతకలప ఎరుపు రంగులో దృఢంగా ఉంటుంది.అందువల్ల ఇంటిసామాన్ల తయారీలో కలపగా వాడతారు.చింత కట్టేలనుముఖ్యం గా పల్లెల్లోవంట చెరుకుగానే ఉపయోగిస్తారు. ఇటుకలు కాల్చడానికి ఇటుక బట్టీలలోనూ చింతకలప ఉపయోగంఎక్కువగాఉంది.  లేత చింతకాయలను అధికంగా పప్పూ, పచ్చడీ చేసుకు తింటే రుచిగా ఉందని అధికంగా తింటే జలుబు చేస్తుంది. చింతకాయలు ముదిరి గింజ ఏర్పడిన తర్వాతే వాటినిరోట్లో దంచి ఉప్పు,పసుపు కలిపి నిలవ పచ్చడిని చేస్తాం.చింతకాయలతో, మిరప పళ్ళను కలిపికూడా నిలవ పచ్చడికొందరు తయారుచేస్తారు .ఏదైన 'అతి సర్వత్రావర్జయేత్ 'అన్నట్లు రుచిని మాత్రమే కాక ఆతర్వాత ఫలి తాలనూ గుర్తుచేసుకుంటూ అధికంగా కాక మితంగా తింటేమంచిది.ముదిరిన చింత కాయకు వేడిచేసే గుణముంది. అది త్వర గా జీర్ణం కాదు. అతిగా తింటే కడుపులో మంట వస్తుంది.చింతపండు తేలికగా అరిగినా అధికంగా ప్రతిరోజూ చింతపండు తోచేసినవంట కాలు తింటూ ఉంటే కడుపులో మంటకూడా రావచ్చు.ఐతే ఈ చింతపండు ఆహార పదా ర్థా లకు రుచిని కలిగిస్తుంది. దాహాన్నిఅరి కడుతుంది. కొత్త చింతపండు కంటే పాత చింత పండును వాడటమే ఆరోగ్యకరం. ఇది రక్త హీనతను తొలగిస్తుంది. చింత చిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధితగ్గుతుంది. వాత హరం.చింత చిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపులు  నొప్పి తగ్గిపోతాయి.చింత ను ఎక్కువగా నవంబర్ నుంచీ ఏప్రెల్ వరకూ చింత కాయలు, పండూ లభిస్తాయి. చింతమా ను బెరడు గుల్మ వ్యాధులలో వైద్యానికి ఉపయో గిస్తారు.చింత చెట్టు వివిధభాగాలను ఆయుర్వేదము, సిధ్ధ , యునానీ వైద్యాల లో మందుల తయారీకి వాడుతారు.

100 గ్రాముల చింతపండులో 283 కేలరీల శక్తి ఉంటుంది.సిట్రిక యాసిడ్ గుణాలు కలిగున్న చింతపండు ఆయుర్వేద పరంగా, పులితేనుపులు అరికట్టడానికి,కడుపు ఉబ్బరానికి, జ్వరం, వికారం మొదలైన రోగాల కి మందుల్లో వాడతారు. ఆకలి మంద గించి తే ఉదయాన్నే 4-5 చెంచాల చింతపండు రసం త్రాగితే మంచి ఆకలి పుడుతుంది. శరీరంపైన ఎక్కడైనా వాపులు, నొప్పులు వస్తే  చింత పండు రసంలో ఆ భాగంలో మసాజ్ చేస్తే తగ్గుతాయి. అలాగే కాళ్ళు,నడుము వంటివి బెణికితే  చిక్కటి చింతపండు రసాన్ని ఉడికించి గోరు వెచ్చగా ఆ వాపులపై పూస్తే వెంటనే ఆబాధ నివరణ అవుతుంది. భోజనం చేసేప్పు డు చివర్లో మనం రసం అంటే చారు పోసుకుని తినడం వల్ల  ఇది జీర్ణశక్తిని పెంచి తిన్నది తేలిక గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అజీర్ణరోగాలను తగ్గింది,  జీర్ణశక్తిని పెంచను చింతపండు దివ్య ఔషధంగా ఉపయోగిస్తుంది. ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉండేవారు . గ్లాసు పాలలో కాచి చల్లార్చిన చింత పండు రసం 4-5 చుక్కలు వేస్తే పాలు విరిగిపోయి, పైన నీళ్ళు తేలుతుంది .ఆనీటిని రోజూ మూడు పూటలా తాగగలిగితే ఈ బాధలు తగ్గిపోతాయని ఆయుర్వేద శాస్త్రంద్వారా తెలుస్తున్నది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్లవ్యాధి తగ్గుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకుఅంటే పైల్స్ కు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురులో విటమిన్ ఎ. సి. ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. పూర్వం ఇప్పటిలా చిన్నాపెద్ద అంతా ఈ టూత్ బ్రష్ లు వాడేవారు కాదు.చింత కర్ర బొగ్గుగాకాల్చి, ఆ బోగ్గుల పొడిలో ఉప్పు, పిప్పర్మెంట్ పువ్వు కలిపి తయారు చేసిన పళ్ళపొడి తోకానీ, ఇంకా పేదలు, చింత బొగ్గు నమిలి,లేదా చింత బొగ్గుపొడిచేసి ఉప్పు కలిపి ఆపొడితో  దంత ధావనం చేసేవారు.చింత బొగ్గుల పొడిలో నువ్వుల నూనె కలిపి కాలిన చోట రాస్తే కాలిన గాయాలు మానిపోతాయి.   చింతగింజల పొడి డయేరియాను ,డిసెంటరీ కి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. చింత చెట్టు వేరు గుండె అనారోగ్యాలను తగ్గిస్తుంది. బెరడు టానిక్ లాగా ఉపయోగిస్తుంది. చింతపండులో విటమిన్ బి, కాల్షియం అధికం గా ఉంటాయి.

పూర్వం ఇన్ని రకాల కూరగాయలు లభించేవికాదు. అందువల్ల ముఖ్యంగా పల్లెవాసులు చింత చిగురు ఎక్కువ దొరికేప్పుడు, దాన్ని కొద్దిగా దంచి,రుబ్బివడలలాగా వత్తి ఎండ బెట్టి నిలువ ఉంచుకుని వర్షాకాలంలో వాడుకుంటారు. ఇవి కొన్ని నెలలు నిల్వ వుంటాయి. చింత పండు బదులుగా ఈ చింతాకు వడలను వేసి కూరలు చేస్తే వారు.

పుట్టుట ఒక చింత భూమినుండుట చింత  - సంసారమొక చింత చావు చింత  బాల్యమంతయు చింత వార్ధక్య మొక చింత - జీవించు టొక చింత చెలిమి చింత  కర్మలన్నియు చింత కష్టంబు నొక చింత -  సంతస మొక చింత వింత చింత ---  సంతసమూ ఒక చింతే మతి. ఐతే ఈ చింతల న్నీ వేరైనా మన 'చింత' చెట్టు 'చింత వేరేదే! చింత పండు లేని వంట గది చింతను గృహ మమ్మాయికి తీర్చా లంటే భగవత్ చింత నతో పాటుగా మార్కెట్ కెళ్ళకతప్పదుకదా! పదండి మరి.

 

మరిన్ని శీర్షికలు
sirasri question