Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
story reviews

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఊపిరితిత్తుల,శ్వాస సంబంధిత వ్యాధులను ఎదుర్కోవటములో ఆహారము పాత్ర - అంబడిపూడి శ్యామసుందర రావు

food roal in lungs breathing  desease

ప్రస్తుతము శ్వాస సంబంధిత,ఊపిరితిత్తులకు సంబంధిచిన వ్యాధుల సంఖ్య బాగా  పెరగటాన్ని గమనించవచ్చు. సాధారణముగా  ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ధూమపానానికి దూరముగా ఉండటము వీలైనంతవరకు కాలుష్యము లేని
గాలిని పీల్చటము మంచిది అని అందరు చెపుతారు అది ముమ్మాటికీ నిజమే. కానీ మనము తినే ఆహారము ద్వారా ఊపిరి తిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చాలా మందికి తెలియదు ఏఏ ఆహారపదార్ధాలు ఊపిరితిత్తులకు  బలాన్ని ఇస్తాయో తెలుసుకొని వాటిని తీసుకోవటం ద్వారా ఊపిరితిత్తులను సంరక్షించుకోవచ్చు అటువంటి ఆహార పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాము. 


1. క్యాబేజి కుటుంబానికి చెందిన కూరగాయలు :-క్యాబేజి కుటుంబానికి చెందిన కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరములోని విష పదార్ధాలను తొలగిస్తాయి. వీటిలోని  "గ్లూకోసినోలేట్స్" అనే రసాయనము శరీరములో ఏర్పడే క్యార్శినోజెన్లను నిష్క్రియా రూపములోకి మార్చి శరీరములోని కణజాలాన్ని కాపాడుతుంది  క్యాబేజి ,కాలిఫ్లవర్ మొదలైనవి మనకు లభ్యమయే క్యాబేజి కుటుంబానికి చెందిన కూరగాయలు . 

2. కెరోటినాయిడ్స్ :-కమల పండు రంగులో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్ వర్ణద్రవ్యము ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది .ఈ కెరోటినాయిడ్స్ చిలగడ దుంపలు,క్యారెట్,ఆప్రికాట్ పండ్లు మొదలైనవి కెరోటినాయిడ్స్ అధికముగా ఉండేవి ముఖ్యముగా క్యారెట్లలోని బీటా కెరోటీన్ విటమిన్ ఏ గా మారి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది

3. ఒమేగా 3 క్రొవ్వు ఆమ్లాలు :-   ఈ రకము క్రొవ్వు ఆమ్లాలు సాధారణ ఆరోగ్యానికి కూడా మంచివి, కానీ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రత్యేకముగా మంచివి అన్న విషయము చాలా మందికి తెలియదు అందువల్ల పెద్దగా పట్టించుకోరు  ఈ రకము క్రొవ్వు  ఆమ్లములు, చేపల్లోనూ,అవిసె గింజలలోను,బాదం పప్పు వంటి గింజలలోను అధికముగా ఉంటాయి. ఈ ఆమ్లము ఊపిరితిత్తుల పరిమాణాన్ని పెంచుతుంది 

4. వెల్లుల్లి :- సహజముగానే రోగ నిరోధక వ్యవస్థకు బలము చేకూర్చేది వెల్లుల్లి ఎందుకంటే దీనిలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫలమేటరీ పదార్ధాలు బాగా ఉంటాయి. క్యాన్సర్ పరిశోధనలలో వెల్లుల్లిని వారానికి రెండు సార్లు తినటము వల్ల ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి  తగ్గుతాయి అని తెలుసుకున్నారు వెల్లుల్లిలో సహజమైన యాంటీ బయోటిక్ యాల్లిసిన్ అనే పదార్ధము హెచ్చుగా ఉండటము వలన ఊపిరితిత్తులకు వచ్చే ఫంగల్ మరియు  బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను  ఎదుర్కొంటుంది

5. అల్లము:-  దీనిలోని జింజెరాల్ అనే పదార్ధము ఊపిరితిత్తులలో ఎక్కువగా ఉండే జిగురు వంటి పదార్ధాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా అల్లము లోని  6 షాగోల్ అనే కాంపౌండ్  శ్వాస నాళాలను గట్టిపడకుండా కాపాడుతుంది . దీనిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫలమేటరీ పదార్ధాలు ఊపిరితిత్తులను కాలుష్యమునుండి రక్షిస్తాయి. అల్లము ఉపిరితిత్తులలోని లోపలి వైపు కణజాలాలను  సడలింపజేసి శ్వాస క్రియ ను సులభము చేస్తుంది. అల్లాన్ని టీ కి కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి . 

6. మెగ్నీషియం :- చిక్కుడు,బీన్స్ గింజలు జీడిపప్పు, బాదం పప్పు వంటి వాటిలో మెగ్నీషియం అధికముగా ఉంటుంది. ఇది సహజ సిద్దమైన యాంటీ ఇన్ఫలమేటరీ అవటము వల్ల  శ్వాస క్రియను అభివృద్ధి పరుస్తుంది. దీర్ఘ కాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో భాధ పడే వారికి మెగ్నీషియం బాగా పనిచేస్తుంది. 

7. దానిమ్మ పండ్లు :- దీనిలో అంతో సయానిన్ , యాంటీ ఆక్సిడెంట్లు అధికముగా ఉండటము వలన ఇవి వృక్ష ఆధారిత యాంటీ  క్యార్సినోజెనిక్ పోషకాలను శరీరానికి అందిస్తాయి. ఇవి క్యాన్సర్ కణాల అభివృద్ధిని   మటుకు తగ్గిస్తాయి.దానిమ్మ పండ్ల గింజల రసము మంచి రుచికరమైన పండ్ల రసము

8. విటమిన్ సి :- జామ ఉసిరి ,నిమ్మజాతి పండ్లు మొదలైన వాటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఇదే. విటమిన్ సి  అధికముగా కలిగిన ఆహారము తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులు ఆక్సిజన్ రవాణాను సమర్ధవంతముగా చేస్తాయి . అంతే  కాకుండా బ్రాన్ ఖైటిస్, ఆస్తమా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.శ్వాస క్రియకు ఇబ్బంది కలిగించే పరిస్థితులను విటమిన్ సి ఎదుర్కొంటుంది

9. పైనాపిల్ :- దీనిలో అధికముగా ఉండే  బ్రోమిలైన్ అనే ఎంజైము సైనసస్ లో ఏర్పడే వాపును తగ్గిస్తుంది. ఉపిరితిత్తులనుండి కొన్ని ద్రవాలు బయటకు పోవటం అనే పరిస్థితి ని పల్మనరీ ఎడిమా అంటారు దీనిని నివారించే సహజ ఔషధము పైనాపిల్ పల్మనరీ ఎడిమా వల్ల శ్వాస ఇబ్బందులు ఏర్పడతాయి. బ్రోమలైన్ అధికముగా కలిగిన పైనాపిల్ తినటం వల్ల తెల్ల రక్త కణాల  ఇన్ఫలమేషన్ దాదాపు
85% తగ్గుతుంది 

10. మంచినీళ్లు :- ఆఖరిది అతి ముఖ్యమైనది మనము త్రాగే నీరు  అసలు అరోగ్యానికి నీరు చాలా ప్రధానమైనది ఇది ప్రసరణ వ్యవస్థ బాగా  శరీరములోని విషపదార్ధాలను అంటే వ్యర్ధ పదార్ధాలను తొలగించటంలో బాగా ఉపయోగ పడుతుంది అప్పుడు సహజముగానే ఊపిరితిత్తులు సమర్ధవంతముగా పనిచేస్తాయి. ఈ విధముగా మనము మన ఆహారాన్ని తీసుకోవటము ద్వారా ఊపిరితిత్తులను
సమర్ధవంతముగా పనిచేసేటట్లు చూసుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

మరిన్ని శీర్షికలు
balivada kantaravu gari lokamu  story sameeksha