Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
food roal in lungs breathing  desease

ఈ సంచికలో >> శీర్షికలు >>

బలివాడ కాంతారావు గారి కధ - అంబడిపూడి శ్యామసుందర రావు

balivada kantaravu gari lokamu  story sameeksha

బలివాడ కాంతారావుగారు 3-7-1927లో శ్రీకాకుళము జిల్లా లోని పదపాం అనే గ్రామం లో పుట్టి విశాఖ పట్టణములో విద్యాభ్యాసము  పూర్తి చేసి నేవీలో ఉద్యోగము చేరారు ఉద్యోగముచేస్తూ రచనా వ్యాసంగము ప్రారంభించి ఆనతికాలములోనే ప్రముఖ కదా,నవలా,నాటక రచయితగా పేరు సంపాదించుకున్నారు. దాదాపు 38నవలలు,400 కధలు, 5 నాటకాలు రచించారు. గోడమీద బొమ్మ అనే నవల,
పరాజయము, అన్నపూర్ణ ,బూచి , సుగుణ వంటి పెద్దకథలు వీటిలో ఉన్నాయి. ఈయన సాహితి రచనలు  తెలుగులో పి హెచ్ డి చేసే విద్యార్థులకు పరిశోధనా అంశాలు గాఉండేవి వీరు 6-5-2000 సంవత్సరములో స్వర్గస్తులైనారు ప్రస్తుతము కాంతారావు గారి రచన "లోకము" అనే కద గురించి ముచ్చటించుకుందాము. ఈ కధలో పూర్వాచారా పరాయణుడైన తండ్రి స్త్రీలు విద్యాభ్యాసము చేసి డబ్బు సంపాదించటము మంచిదా కాదా అన్న ఆలోచనలతో పొందిన మానసిక సంఘర్షణ ఆ సమస్యకు ఒక విధముగా సమాధానము పొందటము ఈ కధలో రచయిత చాలా చక్కగా మనస్సుకు హత్తుకొనేటట్లు వర్ణిస్తాడు. ఈ కధకు పెట్టిన టైటిల్ లోకము ,లోకము తీరు సామాన్యుడి ఆలోచనల ధోరణి వివరిస్తాడు . నీలకంఠము ఈ కధ లోని ముఖ్య పాత్ర. తన తోటి గుమస్తా భార్య పోయినప్పుడు, పొరిగింటాయన పెద్దకొడుకు పోయినప్పుడు చాలా యధాలాపముగా,"పోయే రోజు వస్తే ఎవరు ఆపలేరు పోయేవాళ్లతో మనము పోతామా ? చావంటే మాసిన బట్టను వదిలి కొత్తది వేసుకోవటంలాంటిది చావుకు ఏడ్చే మనము ముస్లిములు క్రిస్టియన్ల కన్నా వెనుక బడి ఉన్నాము," అని మెట్ట వేదాంతము చెబుతు ఉండే నీలకంఠానికే పాతికేళ్ళు పరిచయము ఉన్న భార్య గతించినప్పుడు అసలు భాధ ఏమిటో తెలిసింది .

ఒకకాలు విరిగినట్లు ,ఒక చెయ్యి తెగినట్లు గుండె బీటలు బారినట్లయింది. చావు అంటే భయము విషాదము అని తెలుసుకొనికడుపులో దాచుకున్న దుఃఖాన్ని కన్నీటిగా కొంత కార్చాడు. పెళ్ళానికి నగలు కొంటానని ,చీరలు కొంటాను అని ఇల్లు సంపాదిస్తానని చెప్పి వాటికోసము ప్రయత్నించాడు కానీ అవన్నీ ఉహలలోనే మిగిలిపోయినాయి భార్య కడుపుతో ఉన్నప్పుడు ఎవరైనా ఒకటే అనుకున్నా కూతురు పుట్టగానే లక్ష్మి కళ వచ్చింది అనుకోని ఆ కూతుర్ని అపర సర్వసతీదేవిని చేసి గొప్ప ఆఫీసరును అల్లుడిగా తెచ్చుకోవాలని మధ్య తరగతి బడుగు జీవి ఆశించాడు ఒక కూతురు ఒకకొడుకు అయితే బావుండు అనుకుంటే రెండవసారి  నీలకంఠానికి ఆడపిల్ల
పుట్టింది దేవుడికి నిజాయితాగా మొక్కుని ఉపవాసాలున్నా మోడో సారికూడా కూతురే పుట్టింది. అప్పటినుంచి  దేవుడి మీద భక్తిగౌరవాలు తగ్గినాయి. తల్లి మూడోపిల్లకి వెంకట సీతామహాలక్ష్మీ అని పేరు పెట్టిన నీలకంఠము సన్యాసమ్మ అని పిలిచేవాడు.చిన్నప్పుడు బాగా ఏడ్చే సన్యాసమ్మ ఫస్టు ఫారముతో చదువు ఆపేయమంటే ఏడ్చి ఏడ్చి చదువు కొనసాగించింది. 

నీలకంఠము ఉద్దేశ్యములో ఆడవాళ్లకు చదువులు అనవసరము  చదువుకున్న అమ్మాయిలు పెళ్లి చేసుకోరని చేసుకున్నా మొగుడి మాట వినరని నీలకంఠము అభిప్రాయము భార్య వత్తాసుతో సన్యాసమ్మ న్తలో దొంగతనముచేసి స్కూల్ ఫీజు కట్టి థర్డ్ పారము తరువాత కూడా చదువు కొనసాగిస్తుంది. కూతుర్ని సమర్ధించినందుకు భార్య మీద కోపము వచ్చిన తాను భార్యకు ఇచ్చిన నెరవేర్చలేని వాగ్దానాలు గుర్తుకు వచ్చి ఉరుకొనేవాడు అటువంటి సాధుజీవి భార్య మరణించటం నీలకంఠానికి ఒక పెద్ద లోటు భాధాకరమయిన విషయము. పెద్దకూతురికి చక్రవర్తిలాంటి సంబంధము తెద్దామనుకుంటే కట్నాల బెడద ఎవరైనా అందమైన కుర్రాడు కట్నము లేకుండా తన పెద్ద కూతుర్ని చేసుకంటే బాగుండునని 

ఆశ కమ్యూనిజము అంటే పూర్తిగా తెలియకపోయినా డబ్బున్నవాళ్ళ మీద కోపముతో కట్నాలు అడుగుతున్నారని ఉక్రోషముతో కమ్యూనిజాన్ని ఇష్టపడేవాడు .ఈ విధముగా  నీలకంఠము అల్లుళ్ళ కోసము ఆలోచించింది ఎక్కువ,ప్రయత్నించింది తక్కువ
లంచాలు తీసుకొని డబ్బు సంపాదిస్తే అది పాపము అని వాటి జోలికి పోకుండా చివరకు తన లాంటి గుమాస్తాకే ,పెళ్ళాము బలవంతము మీద తనకు ఇష్టము లేకపోయినా పెద్ద కూతుర్ని ఇచ్చి పెళ్లిచేశాడు కానీ విది వక్రించి పెద్ద కూతురు విధవై కూర్చుంది. దేవుడు గుడ్డి వాడని నీలకంఠము ఏడ్చాడు విధవ వివాహాలు అన్నా,వీరేశలింగము గారన్నా అభిమానము ఉన్నా తనకూతురికి మళ్ళీ పెళ్లి
చేయటము  అంటే గిట్టని పని ఎందుకంటే ఆడవాళ్ళ పాతివ్రత్యమే మన సంఘాన్ని దేశాన్ని కాపాడుతుందని స్థిరముగా నమ్మేవాడే నీలకంఠము.మొదటి ఇద్దరు కూతుళ్లు భార్యలాగా ఉంటారని వాళ్లంటే నీలకంఠానికి అభిమానము. ఆ ఇద్దరు కూతుళ్లు  తల్లిని  తలచుకొని  ఏడుస్తారు నీలకంఠము భార్య ఋణము  తీర్చుకోవటానికి మాసికాలకు వడ్డీకి అప్పుతెచ్చి ఖర్చు పెడుతుంటాడు .చిన్నకూతురు తల్లి మరణానికి కుంగిపోయి పోవటం చూసి నీలకంఠము అసహ్యపడ్డాడు. పైపెచ్చు ఇంటర్లో జేరతానని ఒక సమస్య తెచ్చిపెట్టింది తండ్రి ఇష్టపడకపోయినా స్నేహితురాళ్లు సహాయముతో ఇంటరులో జేరింది 

పెద్దకూతుళ్ల దగ్గర నీలకంఠము తన గోడు వెళ్లబోసుకున్నారు వాళ్లేమో చెల్లెలును మందలించి  నాన్న కష్టాన్ని చెప్పారు అయినా సన్యాసమ్మ లెక్క చేయలేదు పిల్లలకు ప్రయివేట్లు చెప్పటం ప్రారంభించింది. సన్యాసమ్మ పేరు గోడలమీదకు ఎక్కిందని నీలకంఠము తల బాదుకున్నాడు. పేపర్లు పంచి పెట్టిన నేను  ఖరాఖండిగా  సన్యాసమ్మ చెప్పింది. ఎత్తుమడమల  జోళ్ళు వేసుకోవటం కుర్రాళ్ళ దగ్గర అప్పుచేయటం తెలిసినీలకంఠానికే బ్రహ్మాండము బద్దలైనట్లీనిపించింది. చిన్నకూతురు అంటే ఏవగించుకుంటున్నాడు. సన్యాసమ్మకు చదివిచ్చిన సంస్కారము,నడకలోనివేషభాషల్లో కనిపిస్తుంది. కూతుర్ని ఇలా స్వేచ్ఛగా వదిలేసినందుకు లొకము తన గురించి ఏమనుకుంటుందో అన్న భయము నీలకంఠానిది.

రోజురోజుకి మనిషి బెంగతో నీరసించిపోతున్నాడు. తనకు ఇదివరలా ధృడంగా ఉండే నమ్మకాలు చెదిరి పోతున్నాయి తను నిజాయితీగా ఉంది ఏమి సాధించాడుపెళ్ళాము. పోయింది ఒక కూతురు విధవ అయింది కొడుకు లేడు ఆడపిల్లల భాద్యత తీర్చుకోలేకపోయినాడు . తను రిటైర్ అయ్యే లోగా మనదేశము లోకూడా రష్యాలో లాగా అన్నిప్రభుత్వమే చూసుకొనే పరిస్థితి వస్తే బాగుండునని ఆశ కానీ
రష్యాలో లాగా ఆడవాళ్ళు సైకిళ్లు తొక్కటం విమానాలు  నడపటం మగాళ్లతో సమానముగా ఉండటము మనకు పనికిరాదని నీలకంఠము నిశ్చితాభిప్రాయము. మనదేశములో ఆడది గృహాలక్ష్మిభర్త యందు గౌరవము కలిగి ఉండి నవ్వుతూనే కష్టాలు అనుభవించాలి అందుచేతనే చిన్నకూతురికి నీలకంఠానికి తగాదా వచ్చింది. కూతురి మీద విజ్రంభించి కూతుర్ని కాలేజీకి వెళ్ళద్దని అన్నాడు .

నేను చదువు మానని కూతురు చెప్పటముతో పళ్ళు పట పట కొరుక్కున్నాడు అక్కలు ఇద్దరు నాన్న కాళ్ళమీద పడి క్షమాపణ అడగమని చెల్లెలిని అడిగారు సన్యాసమ్మ"చావనైనా చస్తానుగాని "అని నెమ్మదిగా తండ్రికి వినబడేటట్లుగా అంటుంది. అది విన్న నీలకంఠము అదోలా అయిపొయింది రాత్రి నిద్రకూడా పట్టలేదు చిన్న కూతురిని చూస్తే నీలకంఠానికి ఎదో భయము ఆవరించింది తానూ త్వరగా చచ్చిపోతానేమో అన్న అనుమానము పుట్టింది. తానూ చచ్చిపోతే తన కూతుళ్లు అడుక్కోవలసి వస్తుందేమో ఈ ఆలోచనలతో నీలకంఠానికి జ్వరము వచ్చింది చిన్నామ్మాయి డాక్టర్ కు చూపిద్దామంటే కోపము కూడా వచ్చింది లంఖణాలవల్ల నీరసించిపోయారు నాలుగురోజులైనా జ్వరము తగ్గలేదు .ఏ నిముషములో చచ్చిపోతానన్న భయము పట్టుకుంది భార్య  కూతుళ్లు ఎలాంటి అపరాధము చేయలేదు  వాళ్ళకోసమైన తనను బ్రతికించమని  దేవుడిని ప్రార్ధించాడు. తండ్రికి ఇష్టము లేకపోయినా చిన్నకూతురు డాక్టరును తెచ్చింది. తానూ చచ్చిపోతే తన కూతుర్లగతి ఏమికాను అన్న మనోవ్యధ ఎక్కువ అయింది'. ఆ క్షణము వరకు ప్రపంచములో నీలకంఠము అసహ్యహించుకోకుండా ఉన్న  జీవాలు ,తన ఇద్దరు కూతుళ్లను దగ్గరకు పిలిచాడు. లోకము వేలెత్తి చూపించేటట్లుగా వుండమని ఆ ఇద్దరు కూతుళ్లు దగ్గర హామీ
తీసుకోవాలి కానీ ఏడుపు తప్పనోటా మాట రావటము లేదు. చివరికి ఈ పాడు లోకములో ఎలా ఉంటారో అని అంటాడు తండ్రిని చూసి కూతుళ్లు ఇద్దరు భయముతో బావురుమన్నారు . ఇది చుసిన చిన్న కూతురు సన్యాసమ్మ అక్కలవైపు తీక్షణముగా చూచి ,"మీకు ఏడవటం తప్ప ఇంకేమిరాదా? నాన్నను మీరు ఏడుస్తూ అధైర్య పరచకండి ,"అని ఒక్క  సారిగా అక్కలను గదమాయించింది. నాన్న వైపు తిరిగి ,"నాన్న అధైర్య పడకండి మీకు నీరసము తప్ప ఇంకేమిలేదు మీకు ఏమి ప్రమాదము లేదని డాక్టరు చెప్పాడు కొద్దిగా నోరు తెరవండి  బార్లీ  నీళ్లు పోస్తాను త్రాగండి  ఓపిక వస్తుంది" అని చెప్పింది కూతురు నోటిలో బార్లీ నీళ్లు పోస్తుంటే త్రాగకూడదు అనుకుంటూనే గుటక వేసాడు చిన్న కూతురు అంతటితో ఆగలేదు ఎదో మాట్లాడుతూనే ఉంది ఇన్నాళ్లు అసహ్యము,.అధైర్యాలనే మంచు కొండలతో తానూ కప్పబడ్డాడు ఇప్పుడు తనకు ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది ఆమె మాటలు సూర్య రశ్మి లాగా మంచును కరిగిస్తున్నాయి. సన్యాసమ్మ మాటల్లో కాలేజీ మానేస్తానని చల్లని కబురు చెప్పింది అటువంటి మాట తన చిన్న కూతురు నోటివెంట వింటానని ఎన్నడూ ఊహించలేదు ఆ మాటలకు పోయిన ప్రాణము తిరిగి వచ్చినట్లైయిది 

కూతురు తియ్యగా అన్నది,"నాన్నా మీరు అధైర్య పడకండి ఈ అప్పులు తీరవని భయపడకండి కాలేజీ మానేసి ఇంకొద్ది మందికి ట్యూషన్లు చెప్పి డబ్బులు సంపాదిస్తాను ఉద్యోగానికి ప్రయత్నిస్తాను ఉద్యోగమూ వచ్చినాక ఇద్దరి జీతాలు ఉంటాయి కాబట్టి చిన్నక్క పెళ్ళి చెడ్డమూ వీలయితే  పెద్దక్కకు కూడా మల్లి పెళ్ళిచేద్దాము ', ఈ మాటలు విన్న నీలకంఠానికి కళ్ళలో నీరు తిరిగింది ఈ కూతుర్ని ఎందుకు అసహ్యించుకున్నానా అని దిగులు పడ్డాడు మొదటిసారిగా ఈ కూతురే కొడుకు కన్నా ఎక్కువ అనిపించింది. తాను భయముతో మేడలో  వేసుకున్న ఉరిని ఈ కూతురే తప్పించింది. తన పెద్దకూతుళ్లు ఇద్దరినీ చదివించకపోవటము తానూ జీవితములో చేసిన తెలివి తక్కువ పనిగా గుర్తించాడు నీలకంఠము.

మరిన్ని శీర్షికలు
Smelly Hair, Best Ayurvedic Home Remedies in Telugu by Dr. Murali Manohar |