Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాప్సికం - రొయ్యలు - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద, క్యాప్సికం, రొయ్యలు, పసుపు, నూనె, కారం, ఉప్పు, కొత్తిమీర, టమాట, కొబ్బరిపాలు, నిమ్మకాయ.
 
తయారుచేసే విధానం:

ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. అవి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద క్యాప్సికం,  టమాట వేసి బాగాకలిపి 10 నిముషాలు మూతపెట్టి వుంచాలి. ఈ మిశ్రమం మగ్గిన తరువాత అందులో రొయ్యలను వేసి కలిపి మూతపెట్టాలి.

ఈ మిశ్రమం ఉడికిన  తరువాత అందులో కొబ్బరి పాలు పోసి కలిపి తరువాత కొత్తిమీర వేసి , నిమ్మకాయ రసం కొద్దిగా వేయాలి. అంతే వేడి వేడి క్యాప్సికం రొయ్యలు రెడీ...!!     

మరిన్ని శీర్షికలు
White Hair? | Grey Hair? |  | Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)