Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
appatlo okadundevadumovie review

ఈ సంచికలో >> సినిమా >>

వీళ్ళ అభిమానం - వాళ్ళకి గుండెల్లో గాయం

too much

సెలబ్రిటీలంటే అభిమానం ఉండొచ్చు. కానీ ఆ అభిమానం శృతి మించి పోకూడదు. అలా శృతి మించిన అభిమానాన్ని సెలబ్రిటీలు కూడా ఎంకరేజ్‌ చేయరు. రక్తంతో లవ్‌ లెటర్లు రాయడం, పచ్చబొట్టు పొడిపించుకోవడం చేస్తూ ఉంటారు. 'రన్‌ రాజా రన్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించిన సీరత్‌ కపూర్‌ గుర్తుండే ఉంటుంది కదా. అందంగా ఉంటుంది. క్యూట్‌గా ఉంటుంది. ఈ భామకు ఓ అభిమాని తన అభిమానాన్ని ప్రదర్శించడంలో కొంచెం అతిగా ప్రవర్తించాడు. అందుకు ఆమె స్పందించి, ఆ అభిమానులు ఇలా ఎప్పుడూ చెయ్యెద్దు.

మీకు గాయమైతే మా మనసు చాలా బాధపడుతుంది. అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయడమే మా ప్రొఫిషన్‌. అంతేకానీ, వారికి బాధ కలిగితే మేము తట్టుకోలేము అంటూ ట్వీట్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ విషయంలో మరో ముద్దుగుమ్మ కూడా స్పందించింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈమెకు స్పందించే గుణం ఎక్కువ. అందుకే అభిమానులు కూడా ఎక్కువే. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటుంది. వాటికి తదనుగుణంగా తగిన టైంలో స్పందిస్తూ ఉంటుంది కూడా. అలాగే ఈ విషయంలో కూడా రకుల్‌ స్పందించి అభిమానులను రిక్వెస్ట్‌ చేస్తూ స్వీట్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చింది. సో అభిమానులు ఈ విషయాన్ని గమనించి, మీ అభిమాన సెలబ్రిటీస్‌కి బాధ కలిగించేలా ప్రవర్తించకండి. అలాగే మీరూ కూడా బాధపడకండి.

మరిన్ని సినిమా కబుర్లు
kadi movie  celebretions in bejawada