Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akkieni hero with mega director

ఈ సంచికలో >> సినిమా >>

శాతకర్ణి అచ్చమైన తెలుగుతనం

shatakarni compleate true  telugu

బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. క్రిష్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. చాలాకాలంగా ఆడియో అంటే మాస్‌ సాంగ్స్‌, కమర్షియల్‌ సాంగ్స్‌ అని ఫిక్స్‌ అయిపోయాయి. కానీ ఇది అచ్చమైన తెలుగు సినిమా కావడంతో పాటలన్నీ అచ్చంగా తెలుగుతనంతో నిండిపోయాయి. కమర్షియల్‌ సాంగ్స్‌, మాస్‌ సాంగ్స్‌ అని కాకుండా పాటలన్నీ అర్ధవంతమైన భావంతో తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా ఇది మా తెలుగు అని గర్వంగా చెప్పుకునే విధంగా ఉన్నాయి. సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, తెలుగు వారందరూ చూసి ఆదరించాల్సిన సినిమా ఇది. మన తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పే సినిమా ఇది.

తెలుగు జాని ఉనికిని చాటేందుకు పాటుపడిన రాజు గౌతమి పుత్ర శాతకర్ణి. ఈయన గొప్ప చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత మన తెలుగు వారందరిపైనా ఉంది. అందుకే ఈ సినిమా విజయంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా చరిత్ర పరంగా ఓ గొప్ప సినిమా అవుతుంది. సంక్రాంతి అనేది తెలుగువారు ఎంతో గొప్పగా చెప్పుకునే పండగ. అలాంటి పండగ రోజు ఈ సినిమా విడుదల కావడం మంచి పరిణామం. శ్రియ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ సీనియర్‌ నటి హేమామాలిని ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. రికార్డులు సొంతం చేసుకుంటోంది. తెలుగు వారంతా ఈ సినిమా కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam