Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
story review

ఈ సంచికలో >> శీర్షికలు >>

6-1-2017నుండి 12-1-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద నూతన నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగంలో అధికారులతో కలిసి ప్రయత్నాలు చేపట్టుటకు అవకాశం కలదు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. పెద్దలకు మీ ఆలోచనలను తెలియజేయుట సూచన. సంతానం వలన కొంతమేర ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంది. సాధ్యమైనంత వరకు మీ పైన ఒత్తిడి లేకుండా చూసుకొనే ప్రయత్నం మంచిది. రావలిసిన ధనం సమయానికి చేతికి అందటం వలన ఊరట చెందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. 

 



 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో కొంతమేర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు, వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వ్యవస్థను అర్థం చేసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. సర్దుకుపోవడం వలన మేలుజరుగుతుంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. సంతానం విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞులతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి స్పష్టమైన నిర్ణయాల దిశగా ముందుకు వెళ్ళుట సూచన. ఉద్యోగంలో తోటివారితో మీ ఆలోచనలను పంచుకుంటారు, వారి సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. 



మిథున రాశి :  ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో నూతన ఆలోచనలకు అలాగే ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం పొందుతారు. పెద్దలతో చర్చల్లో పాల్గొనేటప్పుడు కాస్త నిదానంగా వ్యవహరించుట అన్నివిధాలా ఉత్తమం. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో సాద్యమైనంత వరకు ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. సోదరులతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది. విదేశాల్లో విద్య అభ్యసించుకోవాలనుకొనే వారికి అనుకూలమైన సమయం, గట్టిగా ప్రయత్నం చేయుట వలన లబ్దిని పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా పడే అవకాశం ఉంది.   

 



కర్కాటక రాశి :    ఈవారం మొత్తంమీద ముఖ్యమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సోదరులతో నూతన చర్చలకు అవకాశం ఉంది. సంతానం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం కలదు. వాహనముల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. వాహనముల వలన  అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు. 

 సింహ రాశి : ఈరోజు మీరు ఆరంభంలో తడబాటు ఎదుర్కొన్న రాను రాను ఆనుకున్న ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. విదేశాలలో ఉన్న వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనల దిశగా ముందుకు వెళ్ళుటకు ఆస్కారం ఉంది. నూతన పెట్టుబడులకు అవకాశం కలదు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సంతానపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో సభ్యుల నుండి నూతన ఆలోచనలు వింటారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. మిత్రులతో సమయం సరదాగా గడుపుతారు. 

 


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించుట సూచన. సోదరులతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి రాకపోవచ్చును. సమయం అధికభాగం వీటికే ఖర్చు అయ్యే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసిన ఇబ్బందులు పెరుగుటకు అవకాశం ఉంది. మిత్రులతో మనస్పర్థలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండుట సూచన. విదేశీప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన కాలం. గట్టిగా ప్రయత్నం చేయుట ద్వారా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన భాద్యతలు పెరుగుతాయి. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. మేలుజరుగుతుంది.


తులా రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వారికి అనుగుణంగా నడుచుకొనుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞులతో చర్చలు చేయుటకు ఆస్కారం కలదు. పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సర్దుబాటు విధానం మంచిది. కుటుంబంలో జీవితభాగస్వామి నుండి నూతన విషయాలు తెలుసుకొనే ఆస్కారం ఉంది. సంతానం విషయంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. సోదరులతో చర్చలు వాయిదా వేయుట సూచన. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, సమయానికి భోజనం చేయుట మంచిది. నూతన వాహనములు కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.  

 

 



వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. నూతన ప్రయత్నాల పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉంటారు. అధికారులతో ముఖ్యమైన చర్చలకు అవకాశం కలదు. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేయుప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో రావలిసిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారుల నుండి పనిఒత్తిడి పొందుతారు, కాకపోతే ఆలస్యంగా నైనా వాటిని పూర్తిచేయుటకు ఆస్కారం కలదు. వారం చివరలో మిత్రులతో అనుకోకుండా మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం కలదు. జాగ్రత్తగా వ్యవహరించుట , సర్దుబాటు విధానం వలన మేలుజరుగుతుంది. 

 


ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాలకు సమయం ఇస్తారు. జీవితభాగస్వామితో కలిసి పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం కలదు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది, పనిభారం పెరుగుటకు అవకాశం కలదు. సంతానపరమైన విషయాల్లో ఒత్తిడి తప్పకపోవచ్చును. మిత్రులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు మీకు కొంతమేర సహకారాన్ని అందిస్తాయి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. అధికారుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. వారినుండి చక్కటి సహకారం పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకోసం చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి.   

 

 



మకర రాశి :  ఈవారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు సర్దుబాటు విధానం అన్నివిధాలా మంచిది. అధికారుల వలన పనిభారం పెరుగుటకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను ఆర్థికపరమైన లావాదేవీలు చేపట్టకపోవడం సూచన. అనారోగ్య పరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. తగిన వైద్య సహకారం తీసుకోవడం మరి మరి సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలను పెద్దలతో పంచుకొనే ప్రయత్నం చేయుట, అలాగే వారిసూచనల మేర ముందుకు వెళ్ళండి. విలువైన వస్తువులను కోల్పోయే ప్రమాదం కలదు, కావున జాగ్రత్తగా ఉండుట సూచన. సంతాన పరమైన విషయాల్లో ఒక మోస్తారు ఒత్తిడికి గురవుతారు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. 

 


కుంభ రాశి :  ఈవారం మొత్తంమీద ఆరంభంలో నచ్చిన లేదా ఆత్మీయులను కలుసుకునే ఆస్కారం ఉంది. వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. అధికారుల నుండి వచ్చిన సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో ఒత్తిడి పెరుగుటకు ఆస్కారం కలదు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదాపడుతాయి. సంతానం వలన పెద్దలకు సమాధానం చెప్పవల్సి వస్తుంది. దూరప్రదేశంలో బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. గతంలో మీరు ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం సూచన. నూతన వాహనములను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. 



మీన రాశి : ఈవారం మొత్తంమీద చిన్న చిన్న పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట సూచన. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు వాయిదాపడుతాయి. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటును పొందుటకు అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. ఇష్టమైన వ్యక్తుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెద్దలతో అనుభందం పెరిగేలా నిర్ణయాలు తీసుకోవడం సూచన. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. స్త్రీ పరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట సూచన. 

Loading...
మరిన్ని శీర్షికలు
sahiteevanam