Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అశ్రద్ధ చేయకూడని ఏడు రకాల నొప్పులు - అంబడిపూడి శ్యామసుందర రావు

negligence for 7 body pains

మన నిత్యజీవితములో శరీరములో నొప్పులు అనేవి చాలా సర్వసాధారణమైనవి.ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ,రోగాలపాలైనప్పుడు లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసినప్పుడు వివిధ రకాల నొప్పులు శరీరములో మొదలవుతాయి.చాలా మటుకు ఈ నొప్పులు డాక్టరును సంప్రదించే అవసరాన్ని కలుగ జేయవు తగినంత రెస్ట్ వల్ల ఈ నొప్పులనుండిఉపశమనము పొందవచ్చు.కొన్ని సందర్భాలలో సరిఅయిన కారణములేకుండా దీర్ఘకాలిక తలనొప్పి లేదా వెన్ను నొప్పి లాంటి నొప్పులను అశ్రద్ధ చేయకుండా డాక్టరును సంప్రదించాల్సినవి కొన్ని ఉన్నాయి అవి ఏమిటో వాటి లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము. 

1. కాలిలో లేదా పాదములో మంటలు లేదా  తిమ్మిర్లు :-ఎవరైనా కాలిలోగాని పాదములోగాని మంటలు లేదా తిమ్మిరిలు అనిపిస్తుంటే వారు న్యూరోపతి లేదా మధుమేహ సంబంధిత న్యూరోపతితో భాధపడుతుండవచ్చు దురదృష్టవశాత్తు అమెరికాలోని 23 మిలియన్ల జనబా లాగానే చాలామంది వ్యక్తులు మధుమేహ లక్షణాలను పట్టించుకోకపోవటము వల్ల ప్రమాదకర పరిస్తుతులకుదారితీస్తుంది. ఈ రకమైన నొప్పితో కనిపించే ఇతర లక్షణాలు ఏమిటి అంటే ,నోరు ఎండిపోవడము,తీరని దాహము ఆకలి, చర్మమం పొడిబారి దురదాగా
వుండటము,గాయాలు ఆలస్యముగా నయము అవటం, తరచుగా త్వరగా మూత్ర విసర్జన చేయవలసి రావటము మొదలైనవి, ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టరును సంప్రదించాలి.

2.వివరించలేని విడవనటువంటి ఛాతిలో  గొంతులో,దవడ లలో,భుజాలలో,లేదా కడుపులో  నొప్పులు :-ఛాతీలో నొప్పి ఆరంభమయితే కొద్దిగా కంగారు పడవల్సినదే ఎందుకు అంటే  ఈ రకము నొప్పులు హృదోగ సంబంధిత సమస్యలకు కారణము అవ్వచ్చు. ఈ సమస్యలు లేదా ఇబ్బందులు గొంతులో, దవడ లలో, భుజములో లేదా కడుపులో  నొప్పి తో ప్రారంభమయిన ఇతర జబ్బులకు సంభందించిన లక్షణాలుగా భావించకుండా వెంటనే డాక్టరును చూడాలి ఈ దశలో యాసిడ్ రిఫ్లక్స్ కూడా గుండె సమస్యలు కు సంబంధినది అయినా త్వరగా వైద్య సహాయము అందేటట్లుగా చూసుకోవాలి.

3 వేధించే తలనొప్పి.:- తలనొప్పులు అనేవి డీహైడ్రేషన్, సైనస్ కంజెషన్ కారణముగా వచ్చే  తలనొప్పులను,ఎక్కువగా నీరు త్రాగటం
ద్వారా(మట్టికుండలోని) లేదా కొంత టైము యోగా చేయటానికి ,ప్రశాంతగా నిద్రపోవటానికి కేటాయించాలీ  జాగ్రత్తలు తీసుకున్నా తలనొప్పి
తగ్గినప్పుడు అశ్రద్ధ చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకొని వేధించే తలనొప్పికి కారణాలు తెలుసుకోవాలి ఈ రకమైన తలనొప్పి మెదడులో
రక్తస్రావానికి  కారణమవుతుంది.

4 ఆకస్మికముగా వచ్చి సాధించే వీపు నొప్పి :-వీపు నొప్పి అనేది చాలా సాధారణముగా మనము చెప్పే కంప్లైంట్ ఎందుకంటే చాలామంది కదలిక తక్కువగా ఉండే జీవన విధానాన్ని గడుపుతుంతుంటారు. ఆ కూర్చోవటములో కూడా అసాధారణ భంగిమ వల్ల వచ్చే నొప్పి,క్రమమంగా ఆ నొప్పులు దీర్ఘకాలిక నొప్పులు గా మారటం జరుగుతుంది. దీనివల్ల చాలా అసౌకర్యానికి గురవుతాము ఈ రకమైన నొప్పీ ఆకస్మికమైనది అయితే, అది అయోర్టా ( రక్తాన్ని శరీర భాగాలకు తీసుకొని వెళ్లే  ముఖ్యమైన రక్త నాళము) లో ప్రమాదకరమైన చిరుగు ఏర్పడినదన్న దానికి సంకేతము కాబట్టి ఇటువంటి ఆకస్మిక వీపు నొప్పికి త్వరగా తప్పనిసరిగా వైద్య సదుపాయాన్ని అందివ్వాలి  వీపు నొప్పి రెండు భుజాల మధ్య గనుక ఉంటె అది అధిక రక్త పోటుకు సంబంధించినది ఇటువంటి కంప్లైంట్ రక్త ప్రసారంలో లోపాలు, మధుమేహము, లేదా ధూమపానం వల్ల కూడా కలుగవచ్చు.

5.తీవ్రమైన కడుపునొప్పి - ఉదారకోశములో ఏర్పడే నొప్పికి కారణాలు చాలా రకాలైన ఆరోగ్య సమస్యల వల్ల ఉండవచ్చు. ఆకస్మికముగా తీవ్రముగా వచ్చే కడుపు నొప్పి కి కారణాలు గాల్ బ్లాడర్ (పిత్తాశయము) ప్యాంక్రియాస్ (క్లోమము) జీర్ణాశయము  లేదా ప్రేగులోని పుండ్లు లేదా అపెండిక్స్ వాపు లేదా పగులు కావచ్చు.కాబట్టి తీవ్రమయిన కడుపు నొప్పిని అశ్రద్ధ చేయకుండా డాక్టరును సంప్రదించాలి. డాక్టరు ఆ కడుపు నొప్పికి సరి అయినా కారణాన్ని తెలుసుకొని ట్రీట్ మెంట్ ఇస్తారు,

6.పిక్కలలో  నొప్పి లేదా వాపు :-  పిక్కలలో నొప్పి అనేది అంత  ప్రమాదకరమైనది ఏమి కాదు కానీ పిక్కలలో నొప్పి ఉన్న ప్రాంతములో వాపు లేదా అనొప్పి తగ్గకుండా ఎక్కువ సేపు ఉంటె అది ప్రమాదకరమైన డీప్ వీన్ త్రామ్ బోసిస్(DVT ) కి సూచన ఇది ఎందుకు ప్రమాదం అంటే కొంత రక్తము గడ్డకట్టి పగిలి గుండెనుండి పల్మనరీ సర్క్యులేషన్ లో ప్రవేశించి ఊపిరి తిత్తులలో గడ్డకట్టిన రక్తము చేరుతుంది. దీనిని వెంటనే గుర్తించి DVT కి వైద్యము చేయించుకోవాలి లేకపోతె పల్మనరీ ధమనిలో అడ్డు ఏర్పడి శ్వాస క్రియకు ఇబ్బంది ఏర్పడుతుంది .DVT కి పిల్లలలో వాపు మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కూడా కొన్ని కనిపిస్తాయి. అవి వాపు ఉన్న కాలి ప్రాంతములోని చర్మము
వెచ్చగా  ఉంటుంది. ఆప్రాంతములోని చర్మము ఎర్రగా లేదా పాలిపోయిన రంగులో ఉంటుంది. ఉపరితలానికి సిరలు కనిపిస్తాయి.

7. అసాధారణమయిన,అస్పష్టమైన ,వివరించలేని నొప్పి లేదా అన్ని కలిసిన నొప్పి:- పైన చెప్పిన నొప్పులు లాంటివి కాకుండా కొన్నీ  నొప్పులు శరీరములోని  ఏ ప్రాంతానికి చెందకుండా శరీరంమంతా వ్యాపిస్తూ ఇబ్బంది పెడతాయి ఇటువంటి నొప్పులను పట్టించుకోకుండా వదిలివేయకూడదు ఇవి ఎదో ఒక రకమైన ఆరోగ్యసమస్యలే ముఖ్యముగా డిప్రషన్ వల్ల ఇటువంటి నొప్పులు రావచ్చు. మానసిక స్థితి ఇటువంటి వివరించలేని నొప్పులకు కారణమవుతుంది. మానసిక సమస్యలు,పనిమీద ఆసక్తి లేక పోవటం సరిగా ఆలోచించ లేక  పోవటము  సాంఘికంగా అందరిలో కలవక పోవటము వంటి లక్షనాలను మీలో మీరు గమనిస్తే మానసిక వైద్యుణ్ణి లేదా ఫ్యామిలి కౌన్సిలర్ ను సంప్రదించాలి.

మరిన్ని శీర్షికలు
..prayanam story review