Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
negligence for 7 body pains

ఈ సంచికలో >> శీర్షికలు >>

పాలగుమ్మి పద్మరాజు గారి కధ"పడవ ప్రయాణము"సమీక్ష - అంబడిపూడి శ్యామసుందర రావు

..prayanam story review

తెలుగు నవలా, కదా సాహిత్యము లోను తెలుగు సినిమా సాహిత్యములోను బాగా  సుపరిచితమైన పేరు పాలగుమ్మి పద్మరాజు గారిది.ఈయన తెలుగు కధకు అంతార్జాతీయ పురస్కారాన్ని సంపాదించిన రచయిత .1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యునల్
వారు నిర్వహించిన కధల పోటీలో 23 దేశాలనుండి వచ్చిన 59 కధలలో పద్మరాజుగారి "గాలివాన కధ బహుమతి పొందింది. ఈయన 24జూన్ 1915లో పశ్చిమ గోదావరి జిల్లాలోని తిరుపతిపురం అనే గ్రామములో  జన్మించారు. 1939-52 మధ్యకాలములో కాకినాడ పి. ఆర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు ఈయన 60 కథలు వ్రాసారు వాటిలో గాలివాన, పడవ ప్రయాణము, ఎదురుచూసిన ముహూర్తము వంటి
జనాదరణ పొందిన  ఉన్నాయి. అయన  రచించిన నవలలో ప్రముఖమైనవి నల్లరేగడి,బ్రతికిన కాలేజీ, రామరాజ్యాన్ని రహదారి,రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన మొదలైనవి..ఈయనకు కేంద్రియ సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది.

బంగారుపాప, భాగ్య రేఖ, బంగారు పంజరము,రంగుల రాట్నము,సర్దార్ పాప రాయుడు వంటిఅవార్డులు పొందిన  సినిమాలకు కధ మాటలు పాటలు స్క్రీన్ ప్లే వ్రాశారు.  1983లో స్వర్గస్తులైనారు. ప్రస్తుతము అయన కధ" పడవ ప్రయాణము" గురించి ముచ్చటించుకుందాము.ఈ కధ ప్రేమ గుడ్డిదేకాదు పిచ్చిది అని ఋజువు చేస్తుంది ఈకధలోని కథానాయిక రంగి తానూ పిచ్చిగా ఇష్టపడే కథానాయకుడు పద్దాలును వాడి బలహీనతలను ,లోపాలతో సహా , లేపు కొచ్చి పెళ్లిచేసుకోకపోయిన వాడితో సహజీవనము సాగిస్తుంటుంది. గోదావరి జిల్లాల్లో కాలువల గుండా సరకు రవాణా జరుగుతుంది. ఆ పడవల్లో కాలవల వెంబడి వున్నా గ్రామముల ప్రజలు ఆ పడవల్లో ప్రయాణిస్తుంటారు ఆవిధముగా ఒకసారి రచయిత సరకు పడవలో రాత్రి పూట ప్రయాణిస్తున్నప్పుడు  గట్టు మీదనుంచి ఎవరో పిలుస్తారు పడవ గట్టుకు చేరటంతో ఓ ఇద్దరు పడవ ఎక్కుతారు. పడవ ఎక్కిన  జంటలోని ఆడమనిషిని చుక్కాని కాస్తున్న మనిషి," ఇన్నాళ్లు యాడ పోయినవే రంగి కనమట్టం లేదు,"అని చనువుగా అడుగుతాడు.

" నేను మావోడు కలిసి ఇజానగరం,ఇశాక పట్నము తిరిగి అప్పన్నకొండకెల్లాము",అని  సమాధానముచెప్పి ఇప్పుడు మండపాక పోతున్నామని చెప్పి పడవలోని మిగిలిన సిబ్బంది గురించి అడుగు తుంది. మగవాడు పడవ టాపుమీద అడ్డదిడ్డముగా పడుకొని ఉంటాడువాడి నోట్లో చుట్ట పక్కకి పడిపోతే ఆడమనిషి తీసి ఆర్పీసి కూర్చుమంటే వాడు తాగి ఉండటంవలన ఆడమనిషిని బూతులు తిడుతూ ఉంటాడు ఆడమనిషి నల్లగాఉండి అందముగా లేకపోయినా ముఖములో పెద్దమనిషి తరహా ఉంది. అగ్గిపుల్ల వెలుగులో పక్కనే పడుకున్న రచయితను గుర్తించి ,"ఈ పక్కనెవరో పడుకున్నార్రా"అని మగవాణ్ణి తట్టి లేపింది,కానీ ఆ తాగుబోతు ఆడదాన్ని తిట్టటం మొదలు పెట్టాడు ఈ గొడవకు పడవలోని గుమాస్తా వచ్చి ,"ఏమె రంగీ ఈడెవడు ?"అని అడిగి  మగమనిషిని చూచి గుర్తుపట్టి "ఈ పద్దాలు దొంగతోత్తుకొడుకుని తాగుబోతోని  ఎందుకు పడవ ఎక్కించారు"అని దింపేయమని పడవ  సిబ్బంది మీద  అరిచాడు ఇంతలో రంగి మొగాణ్ణి కోప్పడి వాగమాకామని చెప్పి గుమాస్తాను బ్రతిమాలి మండపాక లో ఇద్దరు దిగుతామని చెప్పిబ్రతిమాలి  ఒప్పించింది. ఏమైనా అల్లరిచేస్తే కాల్వలోకి తోయిస్తానని హెచ్చరించి గుమాస్తా గదిలోకి వెళ్ళిపోయాడు.

అప్పుడు రచయిత  పద్దాలును గమనించాడు.బొద్దు మీసాలు కోల ముఖము  ఛాతీ విరుచుకొని చాలా నిర్లక్ష్యముగా ఉన్నాడు పడవ మళ్ళీ నిశ్శబ్దముగా సాగుతోంది ఆ చీకట్లో రచయితకు చిరకాలము నాటి విషాద గాధలు మెల్లగా ఆప్యాయముగా జ్ఞాపకమొస్తున్నాయి అన్ని అనాదినుంచి మగవాణ్ణి లాలించి పోషించిన స్త్రీ త్వపు గాధలు. వచ్చేది  ఏవూరు అని రంగిని పద్దాలు అడిగితె కాల్దారి అని సమాధానము చెపుతుంది "ఇయ్యాల జాగ త్తుండ్రా వొద్దు వొద్దు ఎరా నా మాట ఇనవా?"అని రంగి బతిమాలుతూ అడిగింది. భయ పడమాక అంటూ ఆమె పక్కలో వేలెట్టి  పొడిచాడు ఆ స్పర్శ శాశ్వతముగా ఉండిపోవాలని కొరుతున్నట్లుగా ఆమె ముఖమెత్తింది. పడవ నీటి వాలుకి మెల్లగా జారుతుంది. పడవలోపల అంతా కునుకుతున్నారు రంగి మెల్లగా చుక్కాని దగ్గరకు వెళ్లి ,"మరిదీ ఎలాగున్నావు "అని  మాటలు మొదలుపెట్టి తానూ పద్దాలు తిరిగిన ఊళ్ళ విశేషాలుచెపుతుంటే ఆ కబుర్లు జోకొడుతున్నట్లు ఉన్నాయి "పిల్లా,నాకు నిద్దరొ త్తందే "అన్నాడు చుక్కాని కాసే మరిది "సుక్కాని నే సూత్తాలే నువ్వలా  తొంగోమరిది " అని రంగి అని చుక్కానిని తన చేతుల్లోకి తీసుకోంది .పడవ  మళ్ళి మెల్లగా జారిపోతుంది  రంగి ఆ నిశ్శబ్దాన్ని కదపకుండా తనగొంతు కెత్తి చల్లగా పాట పాడింది. "యాడున్నాడో- నావాడు-యాడున్నాడో :
కూడు గిన్నెలో యెట్టి - కూకుని సూత్తుంటే నీడల్లె మా పెల్లి  నిదరే కంటికి రాదు - యాడున్నాడో తేలల్లే కొండెత్తి - తెగకుట్టే సలిగాలికి
నా లోపలంతా బిగిసినాదో మరిది: యెచ్చని నీ వొళ్ళు నన్నొత్తితే గాని సచ్చి పోతానేమో -------యాడున్నాడో " ఆ పాటలో పడుకుని ఉన్న అన్ని ప్రాణులు ఒకసారి  కునికాయి . గడచినా యుగాల ప్రేమగాధలు వింతగా మెల్లగా, విషాదంగా ఆ పాటలో కనిపించాయి. కొంచము దూరములో నెత్తిని ముసుగు మూసుకొని కూర్చున్న పద్దాలు నెమ్మదిగా టాపు దిగి పడవలోకి వెళ్ళాడు రంగి అలాగే  పాడుతోంది
రంగి పాట అలా లోకాలు తిరిగివచ్చి రచయిత గుండెలను తాకి నిద్రపుచ్చింది,నిద్రలో ప్రాకృతికమయిన ప్రణయము రచయిత  ముందు గంతులేసింది ఆ కలలో రంగి పద్దాలు అనేక రూపాలలో సాక్షాత్కరించారు.

పడవలో గొడవ ప్రారంభమవటముతో రచయితకు మెలుకువ వస్తుంది. పడవ గట్టుకు  చేరింది. సరంగులు లాంతర్లు పట్టుకొని పడవ ఎక్కి దిగుతున్నారు గట్టుమీద రంగిని ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు. గుమాస్తా తాడుతో కొడుతున్నాడు .మెలకువ వచ్చిన రచయిత గట్టుమీదకు గెంతి ఏంజరిగందని అడిగాడు. "ఆ దొంగనాకొడుకు సరుకేట్టుకొని పారిపోయాడు . సుక్కాని పట్టుకున్న ఈ లంజ ఎక్కడో పడవను గట్టుకు తార్చి ఆడు పారిపోయేటట్లు చేసింది,"అని గుమాస్తా కోపంగా నిస్పృహ తో అన్నాడు. "రెండు బెల్లము మూటలు ,మూడు చింతపండు మూటలు ఎత్తి కెల్లాడు యజమాని ఆ నష్టమంతా నాకు కడతాడు అందుకే ఆడ్ని పడవ ఎక్కించద్దు అన్నాను ", అని తన భాధను గుమాస్తా వెళ్లగక్కున్నాడు. సరుకు ఎక్కడ దింపుకున్నాడో గుమాస్తా అడిగిన ప్రశ్నలకు సరిగా రంగి జవాబు చెప్పదు రంగిని అత్తిలి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే వాళ్ళే దాని సంగతి చూస్తారు అని గుమాస్తా నిర్ణయించుకొని రంగిని పడవ ఎక్కిస్తారు. పడవ మళ్లీ కదిలింది. టాపు  మీద కూర్చున్న రచయితను రంగి చనువుగా చుట్ట ముక్క అడుగుతుంది. రంగి చుట్ట అట్టించుకొని సారంగుతో,"మరిది నన్ను పోలీసోళ్ళకు అప్పగించి ఎంలాభము నన్ను వదిలేయమను " అంది. గుమాస్తా వదలడు  అని  సరంగు  అంటాడు.  పద్దాలు నీమొగుడా?ఆని  రచయితా రంగిని అడుగుతాడు "మా వోడు "అంది రంగి. సంభాషణ  వింటున్న సరంగు ,"దీన్ని లేవదీసుకుపోయాడండి,పెళ్లాడాలేదు అడి కి ఇంకొకత్తె  ఉంది. అది యాడుందే ఇప్పుడు "అని అడుగుతాడు "కొవ్వూరులో ఉంది రంగు,పొంగు బాగుందిప్పుడు, నేను తిన్నన్ని తన్నులు  తింటే నాలాగే అవుద్ది గుడిసేటినెంజ" తన అక్కసును వెళ్లగక్కింది రంగి. "మరి నీకు వాడితో ఎందుకు?" అని రచయితా అడుగుతాడు " ఆడు నావోడు దేనితో తిరిగినా నాదగ్గరికి రాకుండా ఎక్కడికి పోతాడు? మొగాడికి ఎంతమంది  అయితే మాత్రము ఏమి , అయ్యగారు ఏడు మా రాజండి" అని రంగి పద్దాలును సమర్థిస్తుంది. "  బాబో ఆడి సంగతి మీరింకా  ఎరుగరు  ఓ తూరి  గుడిసెలో దీన్ని పెట్టి నిప్పంటిచాడు దీనికి భూమ్మిద నూకలున్నాయి కాబట్టి  బతికింది "అని సరంగు చెపుతాడు ఆ సంఘటనలో తన వీపు కాలీనమచ్చను చూపిస్తుంది రంగి. "మరి నిన్నిలా చేస్తుంటే ఇంకా వాణ్ని పట్టుకొని దేవులాడతావెందుకు?అని రచయిత రంగిని అడుగుతాడు. "ఏం చెయ్యను అడు కంటబడితే అన్నీ మరచిపోయి కరగిపోతాను  .

సందాల కొవ్వురు లొ బయలుదేరేటప్పుడునన్ను ఏంతో జాలిగా బ్రతిమాలాడు పడవలోకెక్కి చేతికందిన సరుకు దించి పారెయ్యాలని  ఆడికి  నేనుంటే గాని ఆ పనులు సాగవు " అని తన ప్రేమను తన నిస్సహతను చెపుతుంది. మాటల్లో అసలు విషయము  దింపారో తెలుసుకుందామని సరంగు ప్రయత్నిస్తాడు కానీ రంగి దానికి జవాబివ్వదు. ఆ కటిక చీకట్లో రచయితకు రంగి మాయ మనిషి లాగా అవ్యక్తంగానే ఉండిపోయింది. రంగి పారిపోయే ప్రయత్నము మానుకొని తాపీగా చుట్ట కాలుస్తూ కూర్చుంది. "నీకసలు పెళ్ళికాలేదా?"అని రచయిత అడిగితె అవలేదని సిన్న తనంలోనే తన్ని లేపుకొచ్చాడని, తాగి నప్పుడు చావగొడతాడని  చెబుతుంది.ఆ తన్నులు తిన్నప్పుడు వాడిని  వదిలి వెళ్లి పోదామనిపిస్తుంది కానీ ఉత్తప్పుడు చాలా మంచివాడని వెన్నలా కరిగిపోతాడని తానూ  లేకపోతే బ్రతకలేడని వంద మందితో తిరిగిన తన  రాకుండా ఉండలేడ ని వాడి గురించి గొప్పగా చెబుతుంది. . రంగి తత్వము వాళ్ళిద్దరి  మధ్య ఉన్న అనుబంధము ఎల్లాంటిదో రచయితకు అర్ధముకాదు. రంగి మళ్ళి చెప్పటము మొదలు పెట్టింది ఇద్దరికీ ఏ పని  దొంగతనాలలోకి దిగారని చెప్పింది ఒకసారి పద్దాలు రంగి గుడిసెకు వాడితో సంబంధము పెట్టుకున్న ఆడదాన్నితీసుకువస్తే ఇద్దరికీ గొడవ జరగటం వల్ల దాన్ని వేరే చోట ఉంచి రంగి దగ్గరకు వచ్చి కాసేపు ఏడ్చి రంగిని నాను పేట (బంగారు గొలుసు ) ఇమ్మని ఆ గుంటకు కావాలని బ్రతిమాలుతాడు  మాములుగా అయితే వాడు అడిగితె ఇచ్చేసేదే ఆ గుంటకు అని తెలిసినాక కోపముతో వాడ్ని ఙ్గన్తి తలుపేసుకుందిటా . అప్పుడు వాడు బయట గొళ్ళెం పెట్టి గుడిసెకు నిప్పంటించాడుట పోలీసులు వచ్చి ఎవరిమీదైనా అనుమానము ఉందా? అని అడిగినా వాడిపేరు చెప్పలేదుట. ఆతరువాత వచ్చి పిల్లాడిలా ఏడ్చి నానుపేట పట్టుకెళ్ళాడు అనిచెప్పింది

"నిన్ను పోలీసులు పట్టుకుంటే ఏమిచేస్తావు "అని రచయిత అడుగుతాడు. " ఆ ఏముంది నాదగ్గర  దొంగ సొత్తు ఏమి ఉండదు ఒకరోజు కొడతారు మర్నాడు ఒగ్గేస్తారు " అని ధీమాగా చెబుతుంది "మరి వాడు పోలీసు లకు దొరికితే" అన్న  ప్రశ్నకు "ఆడు దొరక్కుండానే నేను పడవలో ఉండిపోతా  ఆ  సరకు అమ్మిన డబ్బు మళ్ళి ఆ గుంటకే ఇస్తాడు దాని మీద మోజు తగ్గే దాకా దాన్ని వదలదు దొంగనెంజ
నా ఉసురు పోసుకుంటుంది ." అని రంగి రచయితతో చెబుతుంది. ఆ మాటల్లో ఉద్రేకమేమీలేదు వాణ్ని రంగి ఉన్నవాణ్ణి ఉన్నట్లుగా అంగీకరించింది. వాడికోసము ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక ఆదర్శము  భక్తి కాదు ప్రేమాకాదు ఎన్నో చిత్రమైన సంకీర్ణ భావాలతో,ఈసులతో,అనురాగాలతో ఎన్నిటితోనో కలిసిన స్త్రీ హృదయము. తన  మగవాడి కోసము ఎప్పుడు పరితపిస్తుంటుంది పద్దాలు సుగుణాలతో అవగుణాలతో రంగి అంగీకరించింది వాడు నా వాడు  నాదగ్గరకు వస్తాడుఅన్న ఆశ ఒక ధైర్యము ఒక  విశ్వాసము  మాటల్లో
తొణికసలాడాయి. రచయిత భయముతో,భక్తితో,జాలితో ఆ  మాటలను  తెల్లారినాక పడవ దిగేముందు ఒక రూపాయి రంగి చేతిలో పెట్టి తొందరగా ఊళ్లోకి పోయినాడు.

మరిన్ని శీర్షికలు
sarasadarahasam