Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
maredu tree

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వండి-నవ్వించండి - ..

1. తాగుబోతు

రంగమ్మ ని ఉదయలక్ష్మి అడిగింది ,
"ఏమే రంగీ, మీ ఆయన రోజూ ఇంటికాడే పూటుగా పీకల్దాకా తాగుతాడుటగా "
"ఆ ఎదవ గురించి పట్టించుకోవటం మానేసా నమ్మగోరూ "
" ఆడి చొక్కా పట్టుకొని అడగపోయావా ? "
" ఎన్నోమార్లు అడిగా ,ఒక్క చుక్కైనా ఇచ్చి చావలా చచ్చినోడు "

************

2. ప్రేమ పెళ్లి

సుజాత బెడ్ కాఫీ తాగుతూ కైలాష్ తో అంది ,
" కే !, కొత్తగా పక్క ఫ్లాట్ లో దిగిన జంటది ప్రేమ పెళ్లి అనుకుంటా "
" అతని మొహం చూస్తే ఆ తప్పు చేసిన వాడిలా కనిపించలేదే "
" లేదు , నా దగ్గర సాక్ష్యం ఉంది "
" ఏమిటో అది "
" రాత్రి తోడుకని మజ్జిగ కోసం వెళితే, ఆ పిల్ల చలిలో అతని కోసం వేడి నీళ్ళు పెట్టి ,దగ్గర కూర్చొని
మరీ అంట్లు తోమిస్తోంది "

************

3. ఈజిప్ట్ మమ్మీ


కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?"
"నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న.
"మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"
"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని
"అటెండరంటే మాకు చాలా ఇష్టం"! అన్నారు విద్యార్థులు
"ఎందుకని?" అడిగారు డీఇఏ
"మేము ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్‌ కొట్టవలసింది... అతనే కదండీ"! అన్నారు విద్యార్థులు..

************

4. 1547 B.C.

ఓ లారిడ్రైవర్, క్లీనర్ మ్యూజియం చూడడానికి వెళ్లారు. అక్కడో అస్థిపంజరం వేలడదిసి ఉంది. దాని కింద 1547 B.C. అని రాసి ఉంది. ఎంట్రోయ్ మొన్న లారి కిందపడి చచ్చిపోయినోడు ఈడేనా గుసగుసగా అన్నాడు డ్రైవర్. అవునవును..... లారినేంబరు కూడా రాశారు అని డ్రైవర్ను బయటకి లాక్కొచ్చాడు క్లీనర్.

************


5. స్కూలులో ఎవరంటే ఇష్టం?

"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని
"అటెండరంటే మాకు చాలా ఇష్టం"! అన్నారు విద్యార్థులు
"ఎందుకని?" అడిగారు డీఇఏ
"మేము ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్‌ కొట్టవలసింది... అతనే కదండీ"! అన్నారు విద్యార్థులు.
 

************

6. ప్రశాంతం

"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా అడిగాడు 
"చచ్చేముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్" దవడలాడించాడు తాతారావు.

************

7. నాన్నకే...

కిట్టు: కోపం, బాధ రెండూ తగ్గడానికి మందులేమైన ఉన్నాయా మెడికల్ షాపతన్ని అడిగాడు.
మెడికల్ షాపతడు: ఇవిగో, ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికెలో మాయమవుతుంది. ఇంతకీ ఎవరికీ బిళ్ళలు? అని అడిగాడు.
కిట్టు: ఇంకెవరికి, మా నాన్నకే. ఇవాళ నా ప్రోగ్రెస్ రిపోర్టు చూపించాలి అని చెప్పాడు.

************

8. పులికి చదువోచ్చునా?

ఇద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు.
"భయపడకు ఆనంద్.... హఠాత్తుగా పులి ఎదురొచ్చినప్పుడు చేతులు రెండు పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను." ధైర్యం చెప్పాడు సంజీవి.
"నువ్వు చదివావు సరే. మరి ఆపులి ఆ పత్రిక చదివిందా'' అని వణుకుతూ అన్నాడు ఆనంద్

మరిన్ని శీర్షికలు
Karevepaku Podi (Curry Leaves Powder)