Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు ఖ్యాతిని చాటి చెప్పేందుకు వస్తోన్న శాతకర్ణి

satakari movie  expressed traditional

బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. తెలుగు రాజు శాతకర్ణి చరిత్రను చాటి చెప్పే కథతో తెరకెక్కుతోంది ఈ చిత్రం. అందుకే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా క్రిష్‌ ఈ సినిమాని తెరెకెక్కిస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు. ఆడియో ఫంక్షన్‌ని తెలంగాణలోని తెలుగు జనం మధ్యలో ఘనంగా నిర్వహించారు. అలాగే ఆడియో ఫంక్షన్‌ కూడా అత్యంత ఘనంగా జరిగింది. తెలుగుతనాన్ని చాటి చెప్పే ఈ కథలో బాలకృష్ణ నటించాలని అనుకోవడం, అది కూడా తన వందో చిత్రంగా ఎంచుకోవడం అన్నది నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ లోగా ఈ సినిమాకి సంబంధించిన మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చిత్ర యూనిట్‌. ఈ నెల 8న చిత్ర పతాకావిష్కరణ పండగ జరగబోతోంది. ఈ సినిమా ప్రసారమయ్యే 100 ధియేటర్లలోనూ ఈ జెండాను ఒకే రోజు, ఒకే సమయానికి ఆవిష్కరించడం ఇందులోని ప్రత్యేకత. వైజాగ్‌లోని జ్యోతి ధియేటర్‌లో బాలయ్య ఈ పతాక ఆవిష్కరణ చేయగా, మిగిలిన 99 ధియేటర్స్‌లోనూ బాలయ్య అభిమానులు అదే సమయానికి జెండాను ఆవిష్కరించనున్నారు. అంతేకాదు ఈ సినిమాకి ఒక్క కత్తెర వేటు కూడా పడకుండా సెన్సార్‌ బోర్డు యు/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చింది. తక్కువ టైంలో, తక్కువ బడ్జెట్‌తో ఇంత విజువల్‌ వండర్‌లా ఈ సినిమాను తెరకెక్కించినందుకు సెన్సార్‌ సభ్యులు చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారట. 

మరిన్ని సినిమా కబుర్లు
lasya entered tolly wood