Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

సంక్రాంతికి సిసలైన సినిమా 'శతమానం భవతి'

shatamanam bhavati will  release sankranti

'శతమానం భవతి'. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా.సతీష్‌ వేగేశ్న డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సిననిమాలో ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అమెరికా నుండి పల్లెటూరికి వచ్చిన అమ్మాయి పాత్రలో అనుపమా మోడ్రన్‌ డ్రస్సులతో ఆకట్టుకుంటోంది. అలాగే చక్కగా లంగా వోణీలో పల్లె పడచులా అందంగా కనిపిస్తోంది. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో తన క్యారెక్టర్‌ని మరింత హైలైట్‌ చేస్తోంది ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఈ విషయాలన్నీ బోధపడుతున్నాయి. ట్రైలర్‌తోనే ఇంతగా ఆకట్టుకుంటోన్న ఈ భామ ఇక సినిమాలో ఇంకెంత టాలెంట్‌ చూపించిందో అంటూ ఆమెపై విమర్శల వర్షం కురిపించేస్తున్నారు అంతా. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా.

ఇక శర్వానంద్‌ నటన కూడా చాలా కొత్తగా ఉండబోతోంది ఈ సినిమాలో. గోదావరి జిల్లా యాసతో ఆకట్టుకుంటున్నాడు శర్వానంద్‌ ఈ సినిమాలో. పల్లెటూరి వాతావరణం, పల్లెటూరి ప్రేమలు, ఆప్యాయతలతో నిండుగా ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈ సినిమా ట్రైలర్‌. సంక్రాంతికి ముందే పండగ శోభ అంతా తెరపై చూపించినట్లుగా ఉన్న ఈ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దిల్‌ రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమా సంక్రాంతి రేస్‌లో నిలిచింది అంటేనే సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలుస్తోంది. చిన్న సినిమా అయినా కానీ చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. గతేడాది కూడా శర్వానంద్‌ సైలెంట్‌గా వచ్చి హిట్‌ కొట్టుకెళ్లిపోయాడు. అలాగే ఈ ఏడాది కూడా శర్వానంద్‌కి హిట్‌ ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మరిన్ని సినిమా కబుర్లు
kadi no 150 movie ready to release