Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

కొబ్బరి కాయ ఎందుకు కొట్టాలి? - ..

treditional   information

కొబ్బరి కాయ ఎందుకు కొట్టాలి?

     మనం ఇళ్ళలోను, దేవాలయాల్లోను పూజ చేయగానే తప్పకుండా కొబ్బరికాయ కొడతాము. అలా కొట్టకపోతే మనం పూజ చేసిన తృప్తి కూడా ఉండదు. అసలు కొబ్బరి కాయ ఎందుకు కొట్టాలో తెలుసుకుందాము. కొబ్బరి కాయ పైన ఉండే పెంకు మన అహంకారానికి ప్రతీక. కొబ్బరి కాయ కొడ్తామో మన అహంకారాన్ని విడిచిపెడుతున్నామని, లోపల గల తెల్లని కొబ్బరిలా మన మనసును భగవంతుని ముందు పెట్టామని , నిర్మలమైన కొబ్బరి నీటిలా మన లను ఉంచుమని అర్ధం. భగవంతుని సృష్టిలో లోపల స్వచ్చమైన నీరున్న కాయ కొబ్బరికాయ మాత్రమే. కొబ్బరికాయ మన శరీరానికి ప్రతీక. బోండాం చర్మం, పీచు మన శరీరం లోని మాంసము, పెంక మన ఎముకలు,పచ్చి కొబ్బరి ధాతువు, నీళ్ళు మన ప్రాణాధారం, కాయ పై నున్న మూడు రంధ్రాలు ఇడ,పింగళ, సుషుమ్న నాడులు.

 

ప్రదక్షిణలు పరమార్ధం.

     పూర్వకాలంలో గణపతి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి భూమండల ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని పొందాడు. ప్ర అంటే పాపాలకు నాశనము, అంటే మన కోరికలు తీర్చుమని, క్షి అంటే మళ్ళీ మంచి జన్మ కావాలని, అంటే మన అజ్ఞానము పోయి ఆత్మజ్ఞానము కావాలని అర్ధము. ఆలయ ప్రదక్షిణ భూ ప్రదక్షిణ అవుతుంది. " హే భగవాన్ నేను నిన్నే అనుసరిస్తూ నీ చుట్టూ తిరుగుతున్నాను " అని అర్ధం. ప్రదక్షిణాలు చేసేటపుడు ఆ ఆలయంలో గల దేవునికి సంబంధించిన శ్లోకం గాని, మంత్రం గాని మనసులో పఠిస్తూ గాని, శ్లోకం గాని, మంత్రం గాని తెలియకపోతే ఆ ఆలయంలోని దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ చేయాలి.

 

ఆలయ దర్శనం తదుపరి ఆలయ ప్రాంగణంలో కోర్చోవడంలో పరమార్ధం.

     ప్రస్తుతం మన అందరి జీవితాలు పరుగుల మయం అయిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కాలంతో పాటు పరుగెత్తడం. ప్రశాంతంగా పట్టుమని పది నిమిషాలు కోర్చోవడానికి సమయం లేదు. ఆలయంలో నన్నా కనీసం అలా కళ్ళు మూసుకుని కూర్చుని భగవద్ద్యానం చేయాలని అంటారు. ఇది ఒక రకంగా ధ్యానం కూడా. దాని వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మన మనసులో మంచి ఆలోచనలు వస్తాయి. పాప పుణ్యాలు బేరీజు వేసుకుని మంచి మార్గంలో మన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తాము.

 

 
- నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు
మరిన్ని శీర్షికలు
story review