Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
big ..big.. photo

ఈ సంచికలో >> యువతరం >>

యూత్‌ - డోన్ట్‌ ప్లే గేమ్స్‌ విత్‌ డేంజర్‌!

youth - dont play games with danger

15 ఏళ్ళ నుంచే యువరక్తం ఉప్పొంగిపోతోందిప్పుడు. 10 ఏళ్ళు దాటితే చాలు తాము యువకులమేనన్న భావన ఈ జనరేషన్‌లో కన్పిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేయడం కూడా దీనికి ఓ కారణమేమో. కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్‌ వంటివి చేతిలో ఉంటే ప్రపంచం గురించి తెలసుకోవడం చాలా తేలిక. అయితే ఈ తెలుసుకోవడం అనేది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తున్నారు. నాణానికి బొమ్మా, బొరుసూ ఉన్నట్లే సాంకేతికను వినియోగించుకోవడంలోనూ మంచీ చెడూ కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ని 'ప్రపంచ పరిజ్ఞానం' తెలుసుకోడానికి కొందరు ఉపయోగిస్తోంటే, ఇంకొందరు అసాంఘీక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళలోపువారిలో సాంకేతిక వినియోగం వెర్రి తలలు వేస్తోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

స్మార్ట్‌ ఫోన్‌లో ఏదన్నా కొత్త యాప్‌ వచ్చిందంటే దాన్ని వెంటనే వినియోగించేయాలని చూస్తోంది నేటి యువతరం. ఈ క్రమంలో అసాంఘీక శక్తులు స్మార్ట్‌ ఫోన్లలోని వ్యక్తిగత డేటాను తస్కరించడానికి మనమే ఆస్కారం కల్పిస్తున్నామని యువత ఆలోచించుకోవాలి. అలాగే స్మార్ట్‌ ఫోన్లలో గేమ్స్‌ యువతకు పెను శాపంగా మారిపోయాయి. సరదా సరదాగా గేమ్‌ ఆడేస్తూ, లోకాన్ని మర్చిపోవడం వల్ల ప్రమాదాల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. నష్టం జరిగిపోయాక బాధపడి ప్రయోజనం లేదు గనుక, ముందే అప్రమత్తంగా ఉండాలి యువత. కుటుంబ సభ్యులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారనేదానిపై ఖచ్చితమైన అవగాహనతో ఉండాల్సిందే. లేని పక్షంలో యువత పెడదారి పడ్తారు. తద్వారా ఆ కుటుంబానికే కాకుండా, సమాజానికీ చేటు కలుగుతుంది. 

ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లోనూ, స్మార్ట్‌ ఫోన్లలోనూ పుట్టుకొస్తున్న కొత్త కొత్త గేమ్స్‌తో యువతకు కంటి చూపు సమస్యలు ఎక్కువైపోతున్నాయి. యువతతోపాటుగా ఈ వ్యసనం బారినపడి కంటి సమస్యల్ని కొనితెచ్చుకుంటున్నవారిలో చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ పిల్లలకు ఇచ్చే హోమ్‌ వర్క్‌ కూడా ఇంటర్నెట్‌ ఆధారితంగానే ఉంటోంది. ప్రాజెక్టు వర్క్‌ పేరుతో ఇచ్చే టాస్క్‌లను కంప్లీట్‌ చేయడానికి ఇంటర్నెట్‌ మీద ఆధారపడక తప్పడంలేదు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌ ప్రతి ఇంట్లోనూ తప్పనిసరైపోయింది. కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌ని వినియోగించడం మొదలు పెడితే ఆ తర్వాత దానిపై సరైన పర్యవేక్షణ లేక, అశ్లీల చిత్రాల దగ్గర్నుంచి, టైమ్‌ని కిల్‌ చేసి, కంటి చూపుని పాడు చేసే గేమ్స్‌ దాకా అన్నిటికీ ఎడిక్ట్‌ అయిపోవడం ఖాయం. అందుకే బీ కేర్‌ఫుల్‌. ఇంటర్నెట్‌ అయినా, అందులో గేమ్స్‌ అయినా, ఇతరత్రా అసాంఘీక కార్యకలాపాలైనా అప్రమత్తంగా ఉండకతప్పదు.

మరిన్ని యువతరం