Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
lakkunnodu movie review

ఈ సంచికలో >> సినిమా >>

యాక్షన్‌ మూడ్‌లో మహేష్‌

mahesh in  sambhavami movie  shooting

సూపర్‌స్టార్‌ మహేష్‌ గతేడాది 'బ్రహ్మూెత్సవం' సినిమాతో బాగా నిరాశపరిచాడు. కానీ ఈ ఏడాది మాత్రం అలా కాదు, అభిమానుల్ని అలరించేలా ఓ సూపర్‌ హిట్‌ ఇస్తానంటున్నాడు. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ సినిమాలో నటిస్తున్నాడు. 'సంభవామి' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా బైలింగ్వల్‌ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాతో మహేష్‌ తమిళ ప్రేక్షకులకి దగ్గర కాబోతున్నాడు. అలాగే ఇప్పటికే సూపర్‌ స్టార్‌కి తమిళ జనంలో పాపులారిటీ వచ్చేసింది. జల్లికట్టు ఉద్యమంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి సూపర్‌ స్టార్‌ మహేష్‌ ముందుగా మద్దతు తెలపడంతో అక్కడి జనాల్లో ఇప్పటికే మార్కులు కొట్టేశాడు.

ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ నెల 29 వరకూ హైద్రాబాద్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ జరగనుంది. అలాగే ఆ తర్వాతి షెడ్యూల్‌ ముంబయ్‌కి షిఫ్ట్‌ కానుందట. అక్కడే భారీ యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కిచబోతున్నారట. ఈ సినిమాలో మహేష్‌ యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయేలా ఉండబోతున్నాయంటున్నారు. అంతేకాదు ఇంతవరకూ ఎవ్వరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌తో ఈ సినిమా రూపొందబోతోందట. అదేంటంటే సస్పెన్సట. తెరపైనే చూడాలంటున్నారు. ఎవ్వరి ఊహకీ అందని స్టోరీలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడం మురుగదాస్‌ స్పెషాలిటీ. మహేష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో మహేష్‌తో ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి రెడీ అవుతోంది. 
 

మరిన్ని సినిమా కబుర్లు
who?