Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
who?

ఈ సంచికలో >> సినిమా >>

....

nenu local promotion  start...

నాని హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'నేను లోకల్‌'. ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదో డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ప్రమోషన్‌కి రెడీ అవుతోంది. గతేడాది వరుస సినిమాలతో విజయాలనందుకున్నాడు నాని. హ్యాట్రిక్‌ హీరో అయ్యాడు. ఈ ఏడాది మరో హ్యాట్రిక్‌కి రెడీ అయిపోతున్నాడు. డిఫరెంట్‌ అండ్‌ ఇంట్రెస్టింగ్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో నానికి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ సినిమా ఉండబోతోంది.

అలాగే నేచురల్‌ యాక్టింగ్‌తో నాని, కీర్తి సురేష్‌ల నటన ప్రధానంగా అందర్నీ ఆకట్టుకుంటుందట. కామన్‌ స్టోరీ అయినా కానీ డైరెక్టర్‌ సినిమాని తెరకెక్కించిన విధానం అందర్నీ కట్టిపడేస్తుందంటున్నారు. అలాగే ఈ సినిమాకి ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా చాలా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నారట. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రంతోనే అందరిలోనూ ఆశక్తి క్రియేట్‌ చేశారు నాని, కీర్తి సురేష్‌లు. ఎంతో క్యూట్‌గా రొమాంటిక్‌గా ఉంది వీరి జంట. అన్నట్లు ఈ సినిమాకి మ్యూజిక్‌ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించడం మరో విశేషం. 
 

మరిన్ని సినిమా కబుర్లు
anjali act horror movie