Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nenu local promotion  start...

ఈ సంచికలో >> సినిమా >>

....

anjali act horror movie

అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'చిత్రాంగద'. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళంలో 'యార్నీ' పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రచార చిత్రం విడుదలయ్యింది. చాలా బాగుంది. బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. గతంలో అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన 'గీతాంజలి' సినిమా హారర్‌ బేసెడ్‌ కామెడీ చిత్రం కాగా, ఈ సినిమాలో 'హారిజాంటల్‌' అనే ఓ కొత్త జోనర్‌ని పరిచయం చేయబోతున్నారట. 'పిల్ల జమీందార్‌' ఫేం అశోక్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అంజలి ఈ సినిమాలో చాలా క్యూట్‌గా కొంచెం హాట్‌గా కనిపిస్తోంది. అలాగే కొంచెం గట్టిగానే భయపెట్టేలా ఉంది.

హారర్‌ బేసెడ్‌ సినిమాలు ఎన్నో వచ్చాయి ఇంతవరకూ. అయితే వాటన్నింటిలోనూ ఈ సినిమా డిఫరెంట్‌గా రూపొందిందంటోంది చిత్ర యూనిట్‌. ఈ సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు చాలా కొత్తగా, వింత అనుభూతిని ఫీలవుతారట. అలాగే ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరపడం మరో విశేషం. అంజలి మంచి నటి అని తెలుసు. అయితే ఇలాంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకి కథ అంతా హీరోయిన్‌ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి, అలాంటి పాత్రకు అంజలి కరెక్ట్‌గా న్యాయం చేస్తుంది. 'గీతాంజలి'ని మించిన హిట్‌ని 'చిత్రాంగద' సినిమాతో అంజలి తన ఖాతాలో వేసుకుంటుందని ఫిల్మ్‌ నగర్‌ వర్గాల అంచనా. ఫిబ్రవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
mass naharaj is back