Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anjali act horror movie

ఈ సంచికలో >> సినిమా >>

....

mass naharaj is back

మాస్‌ మహరాజ్‌ రవితేజ్‌ ఈ మధ్య సినిమాలు చేయడం లేదు. 'బెంగాల్‌ టైగర్‌' సినిమా తర్వాత రవితేజ నుండి కొత్త సినిమా కబుర్లు ఏమీ లేవు. 2016లో రవితేజ నుండి సినిమా రాలేదు. వరస పెట్టి సినిమాలు చేసే రవితేజ ఇంత లాంగ్‌ గ్యాప్‌ తీసుకోవడం వెనుక పలు కారణాలున్నాయి. అయితే ప్రస్తుతం రవితేజ ఈజ్‌ బ్యాక్‌ అంటూ వస్తున్న వార్తలు ఆయన ఫ్యాన్స్‌ని సంతోషపెడుతున్నాయి. 'పటాస్‌', సుప్రీమ్‌' సినిమాలతో సూపర్‌ హిట్స్‌ అందుకున్న డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ఈ డైరెక్టర్‌తోనే రవితేజ సినిమా కన్‌ఫామ్‌ చేశాడని సమాచారమ్‌. అంతేకాదు ఇంత గ్యాప్‌లో రవితేజ బాగా మేకోవర్‌ అయ్యాడట. వరుసపెట్టి ఇదివరకటిలాగే సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాడట. 'బెంగాల్‌ టైగర్‌' సినిమా టైంలో రవితేజ బాగా సన్నగా మారి, ఫేస్‌లో గ్లో మిస్‌ అయ్యిందంటూ కామెంట్స్‌ని ఎదుర్కొన్నారు.

అయితే ఇప్పుడు చేయబోయే సినిమాలో రవితేజ చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపించనున్నారట. అతి త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లనున్నాడట రవితేజ. తాజాగా విక్రమ్‌ సిరికొండ డైరెక్షన్‌లో ఓ కొత్త సినిమా సెట్స్‌మీదికెళ్లింది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి గతేడాది వచ్చిన గ్యాప్‌ని రవితేజ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫిల్‌ చేయనున్నాడట. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam