Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
telugu samskruthi

ఈ సంచికలో >> శీర్షికలు >>

నరారణ్యంలో మృగాలు(కవిత) - పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ

అరణ్యాలు అంతరించిపోతున్నాయి
జనారణ్యలుగా అవతరిస్తున్నాయి
క్రూరజంతువులు అడవుల్ని వదిలేస్తున్నాయి
జనారణ్యలపై తెగబడుతున్నాయి
మహానగరాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి
రక్తం రుచి మరిగిన పులులు
మృగాలై విరుచుకు పడుతున్నాయి
పులులు వేటాడుతున్నాయి
సింహాలు చీల్చి చెండాడుతున్నాయి
తోడేళ్ళు రక్తం పీల్చేస్తున్నాయి
పాములు కాటేస్తున్నాయి 
బలి తీసుకుంటున్నాయి
క్రూర జంతువుల్ని కట్టడి చెయ్యాలి
హంతక మృగాలను వేటాడాలి
వేట కోసం విస్తృత యంత్రాంగం కావాలి
జనారణ్యంలో క్రూర జంతువుల్ని చంపేయాలి
అర్ధరాత్రి కూడా తలెత్తుకు తిరిగేలా
రక్షణ వ్యవస్థ కావాలి
మృగాల వేటకు అందరూ
సమాయత్తం కావాలి

మరిన్ని శీర్షికలు
mini kavithalu