Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
cinema title for manchu family multistarrer

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్ చుట్టూ తెలుగు సంఘాలు

అమెరికా లోని పలు తెలుగు సంఘాలు రాబోయే రెండు నెలల్లో వేర్వేరుగా మహా సభలు నిర్వహించబోతున్నయి. వీటి నిర్వహణలో తెలుగు సినిమా సెలెబ్రిటీ ల హవా ఎక్కువ వుంటుంది. సినిమా వాళ్ళకు వున్న క్రే జ్  వల్ల  వారి చుట్టూ నిర్వాహకులు చక్కర్లు కొడతారు .  సినిమా వాళ్ళ కూ వీటి పట్ల ఆసక్తి ఎక్కువే వుండేది. కాని అది ఒకప్పుడు. అమెరికా చూడాలని ఆసక్తి తగ్గడం తో పెద్దగ ఎవరు అమెరికా లో తెలుగు సభలకు వెళ్ళడానికి ఇష్ట పడడం లేదని సమచారం.

నిర్వాహకులు మాత్రం ఎలాగయినా పాపులారిటీ ఉన్నవారిని తమ తమ సభలకు తీసుకు వెళ్ళడానికి టాలీవుడ్ చూట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రముఖులు వస్తేనే అమెరికా లో వున్నా తెలుగు వారికీ సభల్లో పాల్గొనడానికి ఆసక్తి వుంటుంది. కాబట్టి పేరున్న తారలను ఒప్పించే పనిలో తానా, ఆటా వంటి తెలుగు సంఘాల ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు సఫలం కావాలని ఆశిద్దాం .

మరిన్ని సినిమా కబుర్లు