Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

ఇంద్రగంటి మ్యూజిక్‌ మ్యాజిక్‌

Indraganti Music Magic

ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాల్లో మ్యూజిక్‌కి ప్రత్యేకమైన స్థానం వుంటుంది. ఏ సినిమాకి అయినా మ్యూజిక్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. మ్యూజిక్‌ హిట్‌ అయితే సినిమా హిట్‌ అవుతుందన్న అభిప్రాయం సినిమా పరిశ్రమలో వ్యక్తమవుతుంటుంది. ఇంద్రగంటి తదుపరి సినిమాలోనూ మ్యూజిక్‌ అద్భుతమనిపించేలా పాటలున్నాయి. ‘అంతకుముందు ఆ తరువాత’ పేరుతో ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఒక్కో పాట ఒక్కో స్టయిల్‌లో వుంటూ, మెలోడీ, మోడ్రన్‌ టచ్‌తో పాటలన్నీ అద్భుతంగా వున్నాయనే ఫీడ్‌ బ్యాక్‌ లభిస్తోంది. కళ్యాణ్‌ కోడూరీ మంచి సంగీతాన్ని అందించాడు.

‘గమ్మత్తుగా ఉన్నది’ పాట మంచి మెలోడీ టచ్‌తో సాగితే, ‘హే కనిపెట్టే..’ పాట మంచి బీట్స్‌తో యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసేలా వుంది. ‘తేనె ముల్లులా’ పాట అయితే ఈ ఆల్బమ్‌కే హైలైట్‌. ఆర్కెస్ట్రైజేషన్‌ చాలా బావుంది. నేనేనా ఆ నేనేనా, తమరితోనే, ఏ ఇంటి అమ్మాయివే, నా అనురాగం తదితర పాటలూ దేనికవే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ట్యూన్‌ కంపోజిషన్‌ చాలా బావుండడంతో ఆల్బమ్‌ వినగానే హిట్‌ ఆల్బమ్‌ అన్పిస్తుంది. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటించాడీ సినిమాలో. సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.

మరిన్ని సినిమా కబుర్లు
Film on Telugu Journalists