Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Poets and Singers Meet at Palakollu

ఈ సంచికలో >> సినిమా >>

జె.కె.భారవి పట్ల గౌరవం

Respect on JK Bharavi

తెలుగు సినీ పరిశ్రమలో జె.కె.భారవి అంటే చాలా గౌరవం చాలామందికి. ఆ గౌరవంతోనే భారవి తాజా సినిమా ‘జగద్గురు ఆదిశంకర’లో నటించడానికి పెద్ద హీరోలు రెమ్యునరేషన్‌ తీసుకోలేదట.

నాగార్జున ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కన్పించాడు. మోహన్‌బాబు కూడా నటించాడు. వీరిద్దరూ రెమ్యునరేషన్‌ తీసుకోకుండానే, భారవిపై వున్న గౌరవంతో ఉచితంగానే నటించారంటే అది గొప్ప విషయం కాకుండా ఎలా వుంటుంది? ఛండాలుడి పాత్రలో నటించడానికి నాగార్జున ఒప్పుకోవడమే గొప్ప విషయం అంటే, ఉచితంగా నటించడం ఇంకా గొప్ప విషయం.

నటులే కాదు, గాయకుడు శంకర్‌ మాధవన్‌ కూడా ఈ సినిమా కోసం ఉచితంగా గాత్రదానం చేశాడు. అలా అందరూ తలా ఓ చేయి వేయడంతో, సినిమాకి మంచే జరిగింది. మంచి రిపోర్ట్స్‌ వస్తున్నాయి. చక్కటి తెలుగు సినిమా, మన సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకునే సినిమా, సమాజానికి మంచి చేసే సినిమా వచ్చిందంటున్నారు తెలుగు సినీ పరిశ్రమలో.

మరిన్ని సినిమా కబుర్లు
No More Big Pictures till 6months